ఐఐటీ జేఇఇ/నీట్ 2022 విజేతలకు సన్మాన, అభినందన కార్యక్రమం


 


ఐఐటీ జేఇఇ/నీట్ 2022 విజేతలకు   సన్మాన, అభినందన కార్యక్రమం 

హైదరాబాద్:;

తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ ఆధ్వర్యంలో ఐఐటీ జేఇఇ/నీట్ 2022 విజేతలకు MCRHRD లో  సన్మాన, అభినందన కార్యక్రమం నిర్వహించారు. 

మంత్రులు  కొప్పుల ఈశ్వర్,హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, గురుకుల సొసైటీ సెక్రెటరీ రోనాల్డ్ రాస్, గోట్ అండ్ షీప్ కార్పొరేషన్ ఛైర్మెన్ బాలరాజు యాదవ్ పాల్గొన్నారు. 


మంత్రి కొప్పుల ఈశ్వర్ కామెంట్స్....


గురుకులాల వల్ల పేదల విద్యార్థులకు, చదువుకు దూరం ఉన్నవారు గొప్ప అవకాశం పొందుతున్నారని తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుతోనే ఇది సాధ్యమయ్యిందన్నారు. ఒకప్పుడు రెసిడెన్షియల్ పాఠశాలల్లో అడ్మిషన్లు తీసుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదన్నారు.  కేవలం తెలంగాణ రావడం, 1000 గురుకులాలు నిర్వహించడం వల్ల ఇది సాధ్యమైంది. అద్బుత ఫలితాలు తెస్తున్నాయి, మొత్తం 5 లక్షల మంది దాకా చదువుతున్నారు. ప్రతిభ చాటిన విద్యార్ధులను మంత్రి కొప్పుల ఈశ్వర్ అభినందనలు తెలిపారు. తెలంగాణలో ఐదు లక్షల మందికి విద్యను అందిస్తూ దేశంలోని అగ్రభాగాన నిలిచామన్నారు. తెలంగాణ సర్కార్ దేశంలోనే రోల్ మోడల్ అవుతుందని చెప్పారు. ఈ ఏడాది ఐఐటీ, నీట్, జేఈఈలో 657 మంది విద్యార్ధులు అత్యుత్తమ ర్యాంకులు సాధించారని మంత్రి చెప్పారు.

అంతే కాకుండా సెంట్రల్ యూనివర్సిటీలో నాలుగు వందల మంది అడ్మిషన్లు పొందారని తెలిపారు. విద్యార్ధులను ప్రోత్సహించిన సిబ్బందిని, తల్లిదండ్రులను కూడా మంత్రి కొప్పుల ఈశ్వర్ అభినందించారు,

==============

మంత్రి హరీశ్ కామెంట్స్....


ప్రభుత్వ గురుకులాలు అంటే ఒకప్పుడు పేదవాళ్లు చదివేది అనుకునే వారు, మామూలుగా చదివే వారు అనే మాట ఉండేది. కానీ తెలంగాణ ఏర్పాటు తర్వాత గురుకుల విద్యార్థులు..లక్షల ఖర్చుతో చదివే నారాయణ, చైతన్య విద్యార్థులతో పోటీ పడి ర్యాంకులు సాధించారు.


తెలంగాణ ప్రభుత్వం కల్పించిన అవకాశం వల్ల, ప్రిన్సిపల్, టీచర్ల కృషి వల్ల ఇది సాధ్యమైంది. 


తెలంగాణ ఏర్పాటుకు ముందు 42 ర్యాంకులు మాత్రమే వస్తె, ఇప్పుడు ఆ సంఖ్య 1312 కు పెరిగింది. 

8 ఏళ్లలో ఎంతో పెరిగాయి. తెలంగాణ ఏర్పాటుకు ముందు 134 గురుకుల కాలేజీలు ఉంటే ఈరోజు 268 గురుకులాలు ఉన్నాయి.


నాడు ఇంటర్ చదువు గురుకులాల్లో ఎక్కువగా అందుబాటులో ఉండేది కాదు. పది చదువుకున్న తర్వాత పనులకు వెళ్ళేవారు. అందుకే సీఎం గారు అన్ని గురుకులాలను, జూనియర్ కాలేజి అప్ గ్రేడ్ చేశారు. పేద విద్యార్థులకు డాక్టరు, ఇంజినీర్ అయ్యే అవకాశం కల్పించారు.


పేద పిల్లల చదువు పై పెట్టుబడి కూడా రాష్ట్ర అభివృద్ధిలో భాగంగానే భావించారు. రోడ్లు, భవనాల ఏర్పాటు మాత్రమే కాదు, బావి తరాల పిల్లల చదువు కూడా అతి ముఖ్యమని భావించారు. రేపటి తరం మీద పెట్టే పెట్టుబడి, అద్బుత సంపదగా భావించారు. విద్యార్థుల కోసం చేసే ఖర్చును కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గా భావించారు.


తెలంగాణ రాకముందు మొత్తం గురుకులాలు 290 ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 1000 కి చేరువ అయ్యింది.


561 మంది ఐఐటీ, 750 మంది ఎంబీబీఎస్, బీడీఎస్ చదివే అవకాశం పొందారు.


ఇంటర్ తర్వాత డిగ్రీ చేయడం అంటే ఒకప్పుడు ఎంతో కష్టం. ముఖ్యంగా మహిళలు ఎంతో ఇబ్బంది పడేవారు. దీనికి పరిష్కారంగా సీఎం కేసీఆర్ 30 డిగ్రీ కాలేజీలు ప్రత్యేకంగా ప్రారంబించారు. 


దేశంలో తొలిసారి రెసిడెన్షియల్ లా కాలేజీనీ కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. పీజీ కాలేజీలు కూడా ప్రారంబించింది. 


కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సైనిక్ స్కూల్ ఇవ్వకపోయినా, గురుకులాల సొసైటీ ఆధ్వర్యంలో సైనిక్ స్కూల్ ప్రారంభించి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లో చేరాలనే విద్యార్థుల కలను సాకారం చేస్తున్నాం.


ఒక పేద ఇంట్లో ఒక ఇంజినీర్, ఒక డాక్టర్ చదివే అవకాశం రావడం ఎంతో గొప్ప విషయం. వారి వల్ల ఆ కుటుంబం మాత్రమే కాదు, ఒక తరం లో మార్పు వస్తుంది. సీఎం కేసీఆర్ దీన్ని నమ్మారు కాబట్టే, విద్యార్థులకు చదువుకునే అద్బుత అవకాశాలు కల్పించారు.


తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ సమాజం మీకు ఎంతో ఇచ్చింది. మీరు మంచి స్థాయికి చేరుకుని, తిరిగి సమాజానికి ఇవ్వాలి. మీ ఊరుకో, మీ స్నేహితులకో, గురుకుల సొసైటీకో ఏదో విధంగా తిరిగి ఇవ్వాలి. 


మతాలు, కులాలు మధ్య చిచ్చు పెడితే ఏం వస్తుంది. ఆర్థిక, సామాజిక అంతరాలు లేని నవ సమాజం నిర్మాణం కావాలని సీఎం ఆకాంక్ష. అది విద్య వల్ల సాధ్యం అవుతుందని నమ్మారు. ఆచరిస్తున్నారు. 


నేడు ఏ మండలం పోయినా ఒక గురుకులం ఉంది. తెలంగాణ రాష్ట్రం సాధించిన ఘనత ఇది. అందులో చదువుకొని అత్యున్నత శిఖరాలు చేరే గొప్ప అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది.


దీంతో పాటు రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో కార్పొరేట్ తరహా ఇంగ్లీష్ మీడియం విద్యను తీసుకువచ్చింది. దీనికోసం 7000 కోట్లు ఖర్చు చేస్తున్నది. 


డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు విద్యలో ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించడం వల్ల వెనుక బడ్డ వర్గాల పిల్లలకు అవకాశాలు లభించాయి. 


అత్యున్నత చదువులు చదివిన అంబేద్కర్ గారు ఎలాగైతే దేశం కోసం ఇంగ్లాండ్ వదిలి వచ్చి రాజ్యాంగం రచించారో, అదే దారిలో నేటి విద్యార్థులు ఆలోచించాలి అన్నారు. ఉన్నత స్థాయికి ఎదిగాక, దేశం కోసం, సమాజం కోసం ఎంతో కొంత చేయాలి.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్