ప్రొద్దుటూరు కన్యకా పరమేశ్వరి టెంపుల్ పై సమగ్ర విచారణ చేసి నివేదికను పంపండి...
ప్రొద్దుటూరు కన్యకా పరమేశ్వరి టెంపుల్ పై సమగ్ర విచారణ చేసి నివేదికను పంపండి...
కడప జిల్లా దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ ని ఆదేశించిన కడప జిల్లా దేవాదాయశాఖ ఆఫీసర్...
ఆర్యవైశ్య సంస్థల పాలకులకు ఇది ఒక సవాల్ అనే చెప్పాలి... ఇప్పటికైనా ఆర్యవైశ్య సంస్థలను పాలకులు క్రమశిక్షణతో నడపాలి...
కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని కన్యకాపరమేశ్వరి టెంపుల్ ను సందర్శించి విచారణ చేసి సమగ్ర నివేదికను పంపాల్సిందిగా దేవాదాయశాఖ ఇన్స్పెక్టర్ను ఆదేశిస్తూ కడప జిల్లా దేవాదాయ శాఖ ఆఫీసర్ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు!?
ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన ఆర్యవైశ్య ప్రముఖుడు తెల్లాకుల మనోహర్, ప్రొద్దుటూరు కన్యకాపరమేశ్వరి టెంపుల్ లో అవినీతి,అక్రమాలపైఇచ్చిన ఫిర్యాదు పై జిల్లా దేవాదాయశాఖ ఆఫీసర్ ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది..
ఈ విషయాన్ని ప్రొద్దుటూరు ఆర్యవైశ్య సభ సభ్యుని దృష్టికి తేగా దేవాదాయ శాఖ నుంచి ఆదేశాలువస్తు0టాయ్, మేము సమాధానం ఇస్తుంటామని సదరు సభ్యులు బాధ్యతా రహితంగా చెప్పారు...
ఇన్స్పెక్టర్ ఇచ్చిన నివేదిక అందుకున్న అనంతరం కడపజిల్లా దేవాదాయ శాఖఆఫీసర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో ?అనంతరం పరిణామాలు ఎలావుంటాయో? వేచి చూడాలి..
జర్నలిస్టు శివరామాంజనేయులు... అనంతపురం జిల్లా సౌజన్యంతో
Comments
Post a Comment