డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ విగ్రహ నిర్మాణపు పనులను పరిశీలించిన రాష్ట్ర యస్ సి సంక్షేమ శాఖామంత్రి కొప్పుల ఈశ్వర్, శాసనసభ్యుల బృందం
డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ విగ్రహ నిర్మాణపు పనులను పరిశీలించిన రాష్ట్ర యస్ సి సంక్షేమ శాఖామంత్రి కొప్పుల ఈశ్వర్, శాసనసభ్యుల బృందం
హైదరాబాద్ నడిబొడ్డున ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన 125 అడుగుల డాక్టర్ బాబాసాహెబ్ అంబెడ్కర్ విగ్రహ నిర్మాణ పనులు డిసెంబర్ నాటికి పూర్తి అవుతాయని రాష్ట్ర యస్ సి సంక్షేమ శాఖామంత్రి కొప్పుల ఈశ్వర్ ఆశాభావం వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబెడ్కర్ 125 వ జయంతి నాటికి ఇంతటి ఎత్తైన విగ్రహ నిర్మాణపు పనులు పూర్తి చేసిన మీదట ఆయనకు ముఖ్యమంత్రి కేసీఆర్ అందించే గౌరవానికి ప్రతీకగా ఉంటుందని ఆయన చెప్పారు. హైదరాబాద్ లోని ఎన్ టి ఆర్ గార్డెన్ వద్ద నిర్మించ తలపెట్టిన 125 అడుగుల డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ విగ్రహ నిర్మాణపు పనులను మంత్రి కొప్పుల ఈశ్వర్ శాసనసభ్యుల బృందంతో కలసి పరిశీలించారు. అనంతరం మంత్రి కొప్పుల మాట్లాడుతూ రాజ్యాంగాన్ని లిఖించి దేశ ఔన్నత్యాన్ని నిలపెట్టిన బాబాసాహెబ్ అంబెడ్కర్ గౌరవార్థం ముఖ్యమంత్రి కేసీఆర్ 125 అడుగుల విగ్రహాన్ని నిర్మిస్తున్నందుకు దళిత వర్గాల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. అదే విదంగా దేశ రాజధానిలో నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనానికి అంబెడ్కర్ పేరు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ మేరకు అంబెడ్కర్ పేరు కొత్త పార్లమెంట్ భవనానికి పెట్టాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేయడాన్ని ఆయన స్వాగతించారు. అయితే అదే సమయంలో బిజెపి కి చెందిన సభ్యుడు రఘునందన్ రావు తీర్మానం సమయంలో బయటకు వెళ్లడంలో అంతరార్థం ఏమిటన్నది ఆపార్టీ రాష్ట్ర నేత బండి సంజయ్ తేల్చి చెప్పాలని మంత్రి కొప్పుల డిమాండ్ చేశారు. ఆ మాటకు వస్తే పార్లమెంట్ కు అంబెడ్కర్ పేరు పెట్టె అంశంలో బిజెపి వైఖరిని వెల్లడించాలని ఆయన కోరారు.అంతే గాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణా ప్రభుత్వం చేసిన తీర్మానం తరహాలోనే పార్లమెంట్ కు బాబాసాహెబ్ అంబెడ్కర్ పేరు పెట్టాలంటూ బిజెపి పాలిత రాష్ట్రాల ప్రభుత్వాలు తీర్మానం చెయ్యలని మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. తద్వారా దళితుల పట్ల బిజెపి కున్న వైఖరి వెళ్లడవుతుందని ఆయన స్పష్టం చేశారు.
Comments
Post a Comment