విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని బీజేవైఎం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ
విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని బీజేవైఎం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ
నల్గొండ:;తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం తక్షణమే అధికారికంగా నిర్వహించాలని బీజేవైఎం. బిజెపిఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించామనివ్బీజేవైఎం జిల్లా అధ్యక్షులు అయిత రాజు సిద్ధూ తెలుపారు.
తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం అయిన సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచ న దినంగా నిర్వహించాలని బీజేపీ కిసాన్ మోర్చ జాతీయ కారువర్గ సభ్యులు గోలి మధుసూదన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు... సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ నల్లగొండ పట్టణంలో బీజేపీ యువమోర్చ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు .. బీజేపీ కార్యాలయం నుంచి పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు... ఈ సందర్భంగా గోలి మధుసూధన్ మాట్లాడుతూ... తెలంగాణ ప్రభుత్వం కొంత మంది కి భయపడి విమోచన దినోత్సవం గా కాకుండా సమైక్యత దినోత్సవం పేరిట జరపడాన్ని ఆయన తప్పు పట్టారు... సెప్టెంబర్ 17ని కేంద్రం అధికారికంగా నిర్వహిస్తుందనే ప్రకటనతో నే హడావుడిగా 3రోజుల ఉత్సవాలకు సిద్ధమయ్యిందని ఆరోపించారు ... కార్యక్రమంలో నల్లగొండ పార్లమెంట్ కన్వీనర్ బండారు ప్రసాద్ మాజీ జిల్లా అధ్యక్షులు వీరెల్లి చంద్రశేఖర్. జిల్లా ఉపాధ్యక్షులు యాదగిరి చారి. బిజెపి పట్టణ అధ్యక్షులు మొరిశెట్టి నాగేశ్వరరావు ప్రధాన కార్యదర్శులు ఆవుల మధు. గణేష్ యువ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు దాసరి సాయి. శ్రీకాంత్ యువ మోర్చా పట్టణ ప్రధాన కార్యదర్శి సూర్య . మండల అధ్యక్షులు అనిల్. దుర్గా జిల్లా ప్రోగ్రాం కన్వీనర్ జడ్జీవన్ తదితరులు పాల్గొన్నారు
Comments
Post a Comment