ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను కాలరాస్తే ప్రజల పాలిట అండగా నిలవల్సింది జర్నలిస్టులే - ఎంపీ లక్ష్మణ్,** ప్రాంతీయ పార్టీలు ఉన్న చోట పత్రిక స్వేచ్ఛ లేదు - ఎమ్మెల్యే ఈటెల
ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను కాలరాస్తే ప్రజల పాలిట అండగా నిలవల్సింది జర్నలిస్టులే - ఎంపీ లక్ష్మణ్,
ప్రాంతీయ పార్టీలు ఉన్న చోట పత్రిక స్వేచ్ఛ లేదు - ఎమ్మెల్యే ఈటెల
సికింద్రాబాద్ : ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ( IFWJ),74 వ జాతీయ కౌన్సిల్ సమావేశాలు
వెస్ట్ మారెడ్ పల్లిలోని పద్మశాలి భవన్లో జరిగిన సమావేశాలకు ఎంపీ, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ముఖ్య అతిథులుగా హాజరైనారు. డాక్టర్ కే లక్ష్మణ్, మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను కలరాస్తే ప్రజల పాలిట అండగా నిలవల్సిందే జర్నలిస్టులేనని, ప్రజలు యూపీ మోడల్ పరిపాలనను కోరుకుంటున్నారని అన్నారు. సమాజంలో వ్యవస్థలు పరస్పరం విఫలమైనప్పుడు వాటి బాధ్యతను గుర్తు చేస్తూ ప్రజలను చైతన్యం చేయడంలో జర్నలిస్టుల బాధ్యత చారిత్రాత్మకంగా నిలుస్తుందిని పేర్కోన్నారు.
:ఈటలరాజేందర్ మాట్లాడుతూదేశంలో అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ఉన్న చోట పత్రిక స్వేచ్ఛ లేదని,
నియంతృత్వ ధోరణి నడుస్తుందని, షోయబ్ ఉల్లా ఖాన్ నిజాం కి వ్యతిరేకంగా వార్తలు రాసినందుకు హత్యచేశారని అన్నారు. ఇప్పుడు తెలంగాణలో అధికార పార్టీ మీడియా నియంత్రణ చేస్తుందని, మెజారిటీ పత్రికల్లో ప్రజాసమస్యల ప్రస్తావన లేదు.. పార్టీల సొంత డబ్బా కొట్టుకుంటున్నారని విమర్శించారు. పత్రికల వారు మాకు అండగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని, జర్నలిస్టులు అందరూ షోయభుల్లా ఖాన్ వారసులుగా ప్రజలకోసం పని చేయలని కోరారు. చాలా మంది జర్నలిస్టులు తినడానికి తిండి లేకుండా ఉన్నారని, కుటుంబాలు పోషించలేక పోతున్నారని, అందరికీ అక్రిడేషన్ కార్డ్స్ ఇస్తా అన్నారు ఇవ్వలేదని. వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.జర్నలిస్ట్ లకు అన్ని ఆసుపత్రుల్లో పని చేసే విధంగా హెల్త్ కార్డ్ లు ఇవ్వాలని
జర్నలిస్ట్ పిల్లలకు విద్య అందించాలని, అర్హులైన జర్నలిస్టులు అందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం, ఐ ఎఫ్ డబుల్యూ జె జాతీయ అధ్యక్షుడు మల్లికార్జునయ్య, రాష్ట్ర టీజేయు అధ్యక్షుడు కప్పర ప్రసాద్, జాతీయ పాలకవర్గ సభ్యులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్వామి, రాష్ట్ర నాయకులు భారత్, బర్ల శ్రీనివాస్, వేముల సుదర్శన్, అన్ని రాష్ట్రాల నుండి భారీగా జర్నలిస్టులు, అన్ని తెలంగాణ జిల్లాల అధ్యక్షులు, కార్యవర్గాలు పాల్గొన్నాయి.
Comments
Post a Comment