దళితుల అభ్యున్నతి కోసం దళితబంధు - మంత్రి కొప్పుల ఈశ్వర్
తెలంగాణ సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శం
దళితుల అభ్యున్నతి కోసం దళితబంధు
కామారెడ్డి జిల్లాలో మంత్రి కొప్పుల ఈశ్వర్ పర్యటన
నిజాంసాగర్ మండలంలో దళిత బంధు కింద 1297 మందికి రూ.128.80 కోట్ల ఆస్తులు పంపిణీ
తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశాని ఆదర్శమని రాష్ర్ట సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ లో దళితబంధు లబ్దిదారులకు ఆస్తుల పంపిణి కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు. దళితుల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ దళిత బంధు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని అర్హులైన దళితునికి 10 లక్షల రూపాయలు అందించి ఆ కుటుంబాలు అభివృద్ధి చెందేలా కృషి చేస్తున్నారన్నారు. నిజాంసాగర్ మండలంలో మొత్తం 24 గ్రామాల్లో 1297 మంది లబ్దిదారులను గుర్తించి.. 128.80 కోట్ల రూపాయల విలువ చేసే ఆటోలు, ట్రాన్స్ పోర్టు వాహనాలు, ట్రాక్టర్లు, జేసీబీలు, వ్యవసాయ సంబంధిత వాహనాలను మంత్రి కొప్పుల ఈశ్వర్ పంపిణీ చేశారు. దళిత బంధు పథకం దేశానికే ఆదర్శమన్నారు. దళిత కుటుంబాలను ఆర్ధికంగా నిలబెట్టాలన్న లక్ష్యంతో ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని చెప్పారు. దళితులు ఆత్మగౌరవంతో జీవిస్తూ ఆర్ధికాభివృద్ధి చెందాలన్నదే సీఎం కేసీఆర్ ఆకాంక్ష అన్నారు. రైతు బంధు, రైకు రుణ మాఫీ, రైతు బీమా, 24 గంటలు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తూ అన్నదాతలను ఆదుకుంటున్నామని చెప్పారు. ప్రతీ ఎకరాకు నీరు అందించి తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేశారని తెలిపారు. ఆడపిల్లల పెళ్లిళ్లకు కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాల కింద ఒక లక్షా 16 వేల రూపాయలు అందిస్తున్నామని చెప్పారు. అదేవిధంగా అదే విధంగా గర్భిణీ స్త్రీలతో పాటు పుట్టిన పిల్లలకు పౌష్టికాహారం అందిస్తూ కేసీఆర్ కిట్టును అందజేస్తున్నారని తెలిపారు. ఆడ పిల్ల పుడితే 13 వేలు, బాబు పుడితే 12 వేల రూపాయాలు ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. ప్రభుత్వాసుపత్రుల్లో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని.. ప్రసూతి అయిన తర్వాత ప్రభుత్వ వాహనంలోనే తల్లి పిల్లను ఇంటికి చేరవేయడం జరుగుతుందని తెలిపారు.
ఇలా చెప్పుకుంటూ పోతే దేశంలో ఏ రాష్ట్రంలో అందించని సంక్షేమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్నారని తెలిపారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమాన్ని చూసి దేశంలోని ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా ఈ విధంగా జరగాలని కోరుకుంటున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. దేశ ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని ఆహ్వానిస్తున్నారని అన్నారు, రాబోయే రోజుల్లో కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళతారని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరు అడగకముందే ప్రజలకు కావాల్సిన సంక్షేమాన్ని గుర్తించి అందిస్తున్నారన్నారు.
ఈ కార్యక్రమంలో జడ్పిటిసి దారిశెట్టి లావణ్య రాజేష్ ఎం.పీ.పీ తోట నారాయణ, రైతు బంధు జిల్లా అధ్యక్షుడు చీటి వెంకటరావు, వైస్ ఎంపీపీ చీటి స్వరూపారాణి, కోరుట్ల పట్టణ టిఆర్ఎస్ అధ్యక్షుడు అన్నం అనిల్, నాయకులు బలిజ రాజారెడ్డి, టిఆర్ఎస్ యూత్ పట్టణ, మండల అధ్యక్షులు జాల వినోద్, నత్తి రాజ్ కుమార్, ఉపాధ్యక్షుడు బలిజ శివప్రసాద్, మండలంలోని పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, సింగిల్ విండో చైర్మన్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
---------------------------
Comments
Post a Comment