పండగపూటైనా ఒకటో తేదీకి జీతాలు, పెన్షన్లు ఇవ్వండి : డా. దాసోజు శ్రవణ్
పండగపూటైనా ఒకటో తేదీకి జీతాలు, పెన్షన్లు ఇవ్వండి : డా. దాసోజు శ్రవణ్
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం సమయానికి జీతాలు ఇవ్వలేని దుస్థితిలో ఎందుకు ఉందని బీజేపీ నేత డా. దాసోజు శ్రవణ్ విమర్శించారు. ధనిక రాష్ట్రం అయిన తెలంగాణాలో .. ఉద్యోగులకు ఒకటో తేదీన ఎందుకు జీతాలు ఇవ్వలేకపోతున్నారో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
దసరా పండగ సమయానికైనా వేతనాలు వస్తాయా? లేదా? అనే ఆందోళనలో ఉద్యోగులు, పెన్సనర్లలో వుందని, గత ఏడాది కూడా దసరా పండక్కి జీతాలు ఇవ్వలేదని గుర్తు చేశారు.
సమయానికి జీతం రాక అప్పులు చేస్తున్న ఉద్యోగులు వచ్చిన జీతాన్ని వడ్డీలకి ఇచ్చి ఆర్ధిక సమస్యల్లో కూరుకుపోతున్నారని పేర్కొన్నారు. కనీసం ఈ ఏడాదైన కుటుంబ అవసరాల నిమిత్తం దసరా పండక్కి జీతాలు, పెన్షన్లు ఇవ్వాలని కోరారు.
''అక్టోబర్ 5 లోగ సద్దుల బతుకమ్మ, దసరా పండుగలున్నందున, కుటుంబ అవసరాల నిమిత్తం సెప్టెంబర్ నెలలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్స్ అక్టోబర్ 1 న చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి'' చేశారు దాసోజు.
Comments
Post a Comment