తెలంగాణా లో అక్షర యోధులకు అవమానాలు, తెలంగాణలో మోసపోయిన జర్నలిస్ట్- టీజేయు రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాద్
తెలంగాణా లో అక్షర యోధులకు అవమానాలు, తెలంగాణలో మోసపోయిన జర్నలిస్ట్- టీజేయు రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాద్
*తెలంగాణలో మోసపోయిన జర్నలిస్ట్*
*ఎనిమిదేండ్ల నుంచి సమాచార శాఖకు మంత్రి లేడు, *పూర్తిస్థాయి కమిషనర్ లేడు*
*చతికపడ్డ మీడియా అకాడమీ*
*పెద్ద సారు కలవడు
*అధికారులు మారరు*
*ప్రభుత్వ పక్షాన ఉండే నాయకులు ఆసుపత్రిలో చేరితే సీఎం రిలీఫ్ ఫండ్ లక్షలు
.*గ్రామీణ ప్రాంత పేద జర్నలిస్టులకు ఎందుకు రావు అన్నది ఇదో పెద్ద ప్రశ్న*
హైదరాబాద్: తెలంగాణ కోసం ఉద్యమించిన సబ్బండ వర్గాలలో జర్నలిస్ట్ లు ముందువరుసలో ఉన్నారని తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాద రావు అన్నారు. 1969నుంచి తెలంగాణ కోసం జర్నలిస్ట్ లు ఉద్యమాలను విడవకుండా కొనసాగిస్తూనే ఉన్నారని. ప్రజలను ఉద్యమం లోకి తీసుకు వచ్చేందుకు కృషి సాగించారుని. చాలా మంది సమైక్య వాదుల మనసు మార్చి వారిని తెలంగాణ వాదులుగా తీర్చి దిద్దిన ఘనత జర్నలిస్టులదేనాని, రాజకీయ ఉద్యమాల ద్వారానే తెలంగాణ సాధ్యమౌతుంది అని భావించిన తరువాత నాయకులను ఉద్యమంలోకి తీసుకు రావడానికి జర్నలిస్టుల దశాబ్దాల కృషి ఉన్నదని. తెలంగాణ సాకారమైతే ప్రజల బతుకుల్లో మార్పు వస్తుందని,సామాజిక,ఆర్థిక,రాజకీయ రంగాల్లో తెలంగాణ అస్మిత కనిపిస్తుందని భావించి ఉద్యమాన్ని నిర్మించడం లో జర్నలిస్టులు తనవంతు కృషి చేశారని పేర్కొన్నారు. కళ్ళు మూసుకు పోయి అధికార మత్తులో జోగుతూ ఆంధ్రా నేతల మూతులు నాకే ఎందరో నాయకులను ఉద్యమంలోకి తీసుకు రావడానికి జర్నలిస్టులు ప్రయత్నించారని, అందులో భాగమే కెసిఆర్ గారి తెలంగాణ ఉద్యమ ఎజెండా. టిడిపి లో ఉంటూ అసెంబ్లీ లో 360 GO అవసరం లేదని వాదించిన వ్యక్తి, చంద్ర బాబే బంగారం అంటూ బానిసత్వాన్ని ప్రదర్శించిన కల్వకుంట్ల చంద్రశేఖర రావు కు ఉద్యమ పాఠం నేర్పింది జర్నలిస్ట్ లు కాదా అని ప్రశ్నించారు.
తెలంగాణ నిబద్దత కలిగిన పాశం యాదగిరి లాంటి ఎందరో బుద్ది జీవులు చాలా మంది నేతలను ఉద్యమంలోకి తెచ్చారుని, ఐతే ఆ ఉద్యమంలో రాజకీయ అవసరాలు ఉన్నందు వల్ల కెసిఆర్ కూడా ఆకర్షితులయ్యారని, . దేశపతి శ్రీనివాస్, కవి నందిని సిద్ధారెడ్డి, సిద్దిపేట ఈనాడు విలేకరి అంజయ్యా, అష్టకాల రాం మోహన్, సంగారెడ్డి వార్త విలేకరిగా ఉన్న ఆర్. సత్య నారాయణ లు ప్రభావం చూపించారని అన్నారు. కెసిఆర్ రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అప్పటి మెదక్ జిల్లాలో తెలంగాణ ఉద్యమం బలంగానే ఉన్నదిని. అన్నాడు మెదక్ జిల్లా జర్నలిస్ట్ ల సంఘానికి స్వర్గీయ రామలింగారెడ్డి అధ్యక్షుడు, నేను ప్రధాన కార్యదర్శిగా ఉన్నానని, నేను జహీరాబాద్ లో పనిచేస్తుండగా తెలంగాణ కోసం జర్నలిస్టుల పాటల క్యాసెట్ రూపొందించామని తెలిపారు. దేశపతి శ్రీనివాస్ , దరువు అంజన్న లు పాడిన పాటలతో క్యాసెట్ విడుదల చేయాలని కెసిఆర్ ని ఆహ్వానిస్తే ఆయన ఆసభకు రాలేదని అందుకు వేరే రాజకీయ కారణాలు ఉన్నాయని చెప్పారు. తరువాత కాలంలో అనేకసార్లు నేను, రామలింగ రెడ్డి కెసిఆర్ ని తార్నాక లోని ఇంటిలో కలిసి తెలంగాణ ఉద్యమం లోకి రావాల్సిన అవసరం గురించి వివరించామని. అప్పటికే తెలంగాణ నలుమూలల కలియ తిరుగుతూ తెలంగాణకు జరుగుతున్న నష్టాన్ని వివరిస్తున్న గాదె ఇన్నయ్య తో పాటు అనేక మంది మేధావుల తో చర్చించిన తరువాత కెసిఆర్ తెలంగాణ ఉద్యమానికి ఆరంగేట్రం చేశారుని .తెరాస ఆవిర్భావం తరువాత తెరవెనుక ఉన్న చాలా మంది జర్నలిస్టులు బహిరంగంగా ముందుకు వచ్చారని తెలిపారు. అప్పటికే వామపక్ష భావజాలం తో ఉన్న చాలా మంది గ్రామీణ ప్రాంత విలేకరులు తెలంగాణ ఉద్యమాన్ని బుజాన వేసుకుని నడిపించారని, ఎప్పుడు బలంగా ఉన్న ఎపియుడబ్ల్యూజే మాత్రం ఉద్యమానికి దూరంగా ఉండటం తో కొంతమంది తెలంగాణ వాదులుము కలిసి తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఏర్పాటు చేసి అల్లం నారాయణ కన్వీనర్ గా ముందుకు పోయామని, ఫోరం తెరాస అనుబంధంగా మారడం, వామపక్ష భావజాల ము తప్ప ఇతరుల అభిప్రాయాలను గౌరవించక పోవడం తో తెలంగాణ జర్నలిస్ట్ లకు ఒక ప్రత్యేక సంఘం ఉండాలన్న అవసరం కొద్ది తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఏర్పాటు జరిగిందిని తెలిపారు. సిద్ధాంత వైరుధ్యాలు, అభిప్రాయ బెదాలే తప్ప ఎవరితోటి విరోధం లేదని. ఉద్యమం లో అందరినీ కలుపుకొని పోయే స్వభావం తెలంగాణ జర్నలిస్టుల యూనియన్ కు ఉన్నదని. ఇప్పటికీ అదే ఉరవడి కొనసాగుతున్నదని ఆయన తెలిపారి ఉద్యమ సమయంలో జేఏసీ ఆవిర్భావం కోదండరాం సారథ్యం ఇలా అన్ని అంశాలలో జర్నలిస్టుల పాత్ర చాలా ఉన్నదని యాజమాన్యాలు అనుకూలంగా లేక పోయిన,ఉద్యోగాలు పోతాయని తెలిసినా, కేసులు ఐనా వెనకడుగు వెయ్యకుండా ఉద్యమం నడిపించారుని. ఇందులో నేను కొందరి పేర్లు మాత్రమే రాశాను కానీ తెలంగాణలో గ్రామీణ ప్రాంతాలలో పనిచేసే విలేకరులు అందరూ చిత్తశుద్ది తో ఉద్యమంలో పాల్గొన్నారని, కాదు వారే ముందుండి నడిపించారు అనడం కరెక్ట్ అని పేర్కొన్నారు. ఇదంతా ఎందుకు చేశామో తెలుసని, ప్రజలతో మమేకమైన వారిగా వారి సమస్యలతో పాటు, ఆత్మ గౌరవం, జర్నలిస్ట్ ల సమస్యలు పరిష్కార మౌతాయని భావించారని. కానీ అవేవీ జరగలేదు. అధికార మార్పిడి తప్ప ఆత్మ గౌరవం కూడా కరువైందని విమర్శించారు. వైఎస్ ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రం లో జర్నలిస్ట్ లకు ఇండ్ల స్థలాలు ఇచ్చారు. ఎనిమిదేండ్ల తెలంగాణలో ఇండ్ల స్థలాల మాటే మరిచి పోయిన పరిస్తితి ఉన్నదని, హెల్త్ కార్డులు లేక ఎందరో జర్నలిస్టులు అసువులు బాసారని, ప్రభుత్వం వద్ద పైరవీలు చేసే జర్నలిస్ట్ లకు తప్ప ఎవ్వరికీ ఎలాంటి సహాయము అందటం లేదని వాపోయారు.ఎవరికైనా ప్రమాదం జరిగితే ఇక అంతే వారి కుటుంబం రొడ్డున్న పడ్డట్టేనని, ఎందరో తమ్ముళ్లు ఫేస్ బూక్లో లో పోస్ట్ పెడతారుని. ప్రమాదం జరిగి ఆసుపత్రిలో ఉన్నాను సహాయం చెయ్యండి అని, కరోనా సమయంలో ఐదు కిలోల బియ్యం కోసం సంచులు పట్టుకొని దాతల ఇండ్ల ముందు పడికాపులు కాసిన వారెందరో. ప్రభుత్వ పక్షాన ఉండే నాయకులు ఆసుపత్రిలో చేరితే సీఎం రిలీఫ్ ఫండ్ లక్షలు ఎలా వస్తాయి అదే. గ్రామీణ ప్రాంత పేద జర్నలిస్టులకు ఎందుకు రావు అన్నది ఇదో పెద్ద ప్రశ్నేనని, ఇండ్ల స్థలాలు ఒక నాయకుడికి మూడు,నాలుగు వస్తాయి. అడిగిందే తడువుగా నిబంధనలకు విరుద్ధంగా వారి బంధువులకు ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి. కానీ నిక్కార్శైన, కాలాన్నే నమ్ముకున్న వారికి ఎందుకు రావని ప్రశ్నించారు. జర్నలిస్టుల వైద్యం, వారి పిల్లలకు విద్యా, ఇంటిస్తలం, ఉద్యోగ భద్రత, చిన్న పత్రికలకు, చానల్లకు ప్రకటనలు, భావ ప్రకటన స్వేచ్ఛా, భద్రత తదతర అంశాలు ఎందుకు చర్చకు రావడం లేదని అన్నారు ఆత్మ గౌరవం కూడా కరువైందని, సీఎం విలేకరుల సమావేశంలో అవమానిస్తూ మాట్లాడితే ఎవరికి చెప్పుకోవాలని, పాలాభిశేకాలు, పాదాభివందనాలు ఎవరికోసం చేస్తున్నారని,చివరకు అక్రీడేషన్ కార్డ్ ల కోసం కూడా ఇబ్బందులే..పైరవీలు చేస్తేనే కార్డ్ ఇస్తున్న పరిస్తితని,
ఇంకా ఉపెక్షితే తెలంగాణలో పరిస్తితి మరింత దిగజారే అవకాశం ఉందిని తెలిపారు.
23నుంచి జాతీయ కౌన్సిల్
జర్నలిస్ట్ ల సమస్యలపై చర్చించి ఒక కార్యాచరణ రూపొందించాల్సి ఉన్నదని, తెలంగాణ తో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల పరిస్థితులను కూడా చర్చించేందుకు ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ . జాతీయ కౌన్సిల్ సమావేశాలు హైదరాబాద్ లో జరుగు తున్నాయని 23,24తేదీలలో జరిగే ఈ సమావేశాలలో దేశం నలుమూలల నుంచి ప్రతినిధులు పాల్గొననున్నారని తెలిపారు.
ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ అఖిల భారత అధ్యక్షులు మల్లికార్జునయ్యా, సెక్రెటరీ జనరల్ పరమానంద పాండే లు మార్గ దర్శనం చేస్తారని. పలువురు రాజకీయ ప్రముఖులు హాజరై మాట్లాడతారని, ఈ సమావేశాలను జయప్రదం చెయ్యాల్సింది గా జర్నలిస్ట్ లకు విజ్ఞప్తి చేశారు.
Comments
Post a Comment