సీఎం కేసీఆర్‌తో కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి భేటీ


సీఎం కేసీఆర్‌తో కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి భేటీ 

హైదరాబాద్‌: తెలంగాణ సీఎం కేసీఆర్‌తో కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి భేటీ అయ్యారు. ప్రగతిభవన్‌లో కేసీఆర్‌ను ఆయన కలిశారు. నేతలిద్దరూ కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం తాజా రాజకీయ పరిస్థితులు, దేశంలో జరుగుతున్న పరిణామాలపై కేసీఆర్‌, కుమారస్వామి చర్చిస్తున్నట్లు సమాచారం. జాతీయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల పాత్ర, కేసీఆర్ కొత్త జాతీయ పార్టీ ఏర్పాటు, భవిష్యత్ కార్యాచరణపై నేతలిద్దరూ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ ఇప్పటికే బెంగళూరు వెళ్లి మాజీ ప్రధాని దేవెగౌడ, కుమారస్వామితో చర్చించారు. జాతీయ స్థాయిలో రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న కేసీఆర్.. ఇప్పటికే దేశంలోని వివిధ పార్టీల నేతలతో చర్చించారు. భాజపాను గద్దె దించేందుకు కలిసి రావాలని ఆయా పార్టీల నేతలను కోరారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌ వచ్చిన కుమారస్వామి.. కేసీఆర్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్