షేర్ బంగ్లా సంతోష్ మాత గుడి బంగారం, వెండి ఆభరణాలు బద్రంగానే ఉన్నాయా?


షేర్  బంగ్లా సంతోష్ మాత గుడి బంగారం,  వెండి ఆభరణాలు బద్రంగానే ఉన్నాయా? 


నల్గొండ:  షేర్ బంగ్లా సంతోష్ మాత గుడి అమ్మవారి బంగారం,  వెండి ఆభరణాలు  బద్రంగానే ఉన్నాయా? అని సందేహాము వ్యక్తం చేస్తున్న భక్తులు.    రెండు బంగారు నక్ లెస్ లు, దాదాపు 10 బంగారు ముక్కుపుడకలు, బంగారు బొట్టు బిల్లలు, ముద్ద బంగారం   మరియు   4 నుండి 5 కిలోల వెండి భక్తులు భక్తితో అమ్మవారికి సమర్పించినవి ఉన్నట్లు  సమాచారం. ఇక్కడ మేనేజర్ గా  పనిచేసిన వ్యక్తి ట్రాన్సఫర్ అయ్యి దాదాపు 3 నెలలు ఆయునప్పటికి ఇంతవరకు  క్రొత్త మేనేజర్ కు బంగారం, వెండి ఆభరణాలు అప్పగించ లేదని తెలిసింది. దీనితో భక్తుల  మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉంది.  ఈ విషయం పై ప్రస్తుత మేనేజర్ జయరామయ్య ను వివరణ కోరగా  పాత మేనేజర్  రిజిస్టర్ మాత్రమే ఇచ్చాడని, త్వరలోనే  బంగారం,  వెండి ఆభరణాలను ఇస్తానన్నాడని, తీసుకునే  సమయంలో భక్తుల ముందే తీసుకుంటానని తెలిపారు.  ఈ గుడి లో  నిర్వహణ సక్రమంగా లేదని,  కొత్త గా చార్జి తీసుకున్న మేనేజర్ ఇంత వరకు గుడికే రాలేదని, గుడి చుట్టూ  కంపౌండ్ కట్టకుండా కాంట్రాక్టర్  వదిలి పోయాడని భక్తులు అనుకుంటున్నారు. గుడిలో భక్తులు కానుకలు సమర్పణకు కొరకు మువబుల్ హుండీ వాడుతున్నారని, దీనితో కానుకుకలు  ప్రక్కదారి పెట్టె అవకాశం ఉందని ఓ మాజీ   గుడి ఛైర్మెన్ అనుమానం వ్యక్తం చేశారు. గుడి రక్షణకు సిసి కెమెరాలు బిగించాలని కోరారు. గుడి అభివృద్ధికి  భక్తులు సమర్పించిన  లక్షల రూపాయలకు ఆడిట్ జరిగలేదని , సీజీఎఫ్ నిధుల పై ఆడిట్ జరిగలేదని, మొత్తం నిర్మాణం పై ఆడిట్ జరిగలేదని ఈ ఛైర్మెన్ తెలిపారు. ఈ విషయంలో దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్, సహాయ కమీషనర్ మరియు రాష్ట్ర స్థాయి అధికారాలు దృష్టి పెట్టి బంగారు వెండి ఆభరణాలు కొత్త మేనేజర్ అప్పగించే విధంగా , నిర్వహణ  సక్రమంగా  జరిగే విధంగా చర్యలు తీసుకొని భక్తుల మనోభావాలు కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు.


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్