బతుకమ్మ పండుగను పండుగ వాతావరణం లో ఘనంగా నిర్వహించాలి



*బతుకమ్మ పండుగను పండుగ వాతావరణం లో ఘనంగా నిర్వహించాలి*


మహిళా ఉద్యోగులందరు పాల్గోనాలి


ప్రతి శాఖల వారిగా ప్రత్యేక బతుకమ్మలతో పాల్గోనాలి.


బతుకమ్మ చీరల పంపిణిని నోడల్ అధికారులు పర్యవేక్షించాలి


అదనపు కలెక్టర్ భాస్కర్ రావు


0 0 0 0


ఈనెల  25 నుండి ఎంగిలిపూల  బతుకమ్మ తో ప్రారంభమై  అక్టోబర్ 3న జరుగు సద్దుల బతుకమ్మ వరకు పండుగను ఘనంగా పండుగ వాతావరణం లో నిర్వహించేలా ఏర్పాట్లు ఉండాలని అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అధికారులను ఆదేశించారు. 


గురువారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో బతుకమ్మ పండుగ ఏర్పాట్లపై సమావేశాన్ని నిర్వహించి అధికారులకు ఏర్పాట్లపై ఆయన దిశానిర్దేశం చేశారు.  ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచి ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంబమై సద్దుల బుతుకమ్మ వరకు తొమ్మిది రోజుల పాటు నిర్వహించనున్న బతుకమ్మ పండుగ ఏర్పాట్లు జిల్లాలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా  ఘనంగా నిర్వహించాలని అన్నారు. వచ్చే ఆదివారం 25వ తేదినుండి ప్రారంభం కానున్న బతుకమ్మ పండుగను జిల్లాలోని ఎన్.జి.కళాశాల మైదానం లో 9 రోజుల పాటు కార్యక్రమాలను నిర్వహిస్తామని, ఈ కార్యక్రమంలో జిల్లాలోని అన్నిశాఖల మహిళ ఉద్యోగులందురు పాల్గోనెలా చూడాలని అన్నారు.  ఈ బతుకమ్మ వేడుకలలో వారి వారి శాఖలకు ప్రాదాన్యం ఇస్తూ ప్రత్యేకంగా ప్రతి రోజు నిర్ణయించిన విధంగా ఆయా శాఖలు బతుకమ్మ లో పాల్గొనాలని అన్నారు జిల్లాతో పాటు అన్ని గ్రామాలు, మండలాల్లో ఎంగిలిపూల బతుకమ్మ నుండి సద్దుల బతుకమ్మ వరకు 9 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించాలని సూచించారు.  నిమజ్జనం చేసే ప్రాంతాలలో లైటింగ్, సానిటేషన్ ఏర్పాట్లు సక్రమంగా ఉండేలా చూడాలని ఆధికారులను ఆదేశించారు. 


  అనంతరం బతుకమ్మ చీరల పంపిణిపై మాట్లాడుతూ, జిల్లా కు కేటాయించిన 4 లక్షల 90 వేల బతుకమ్మ చీరలను  మండలాల నుండి అన్ని పంచాయతీ లకు  చీరలను చేర వేయాలని, పంపిణి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవాలని,  పంపిణిలో ఇబ్బందులు తలెత్తకుండ నియోజక వర్గ ప్రత్యేక అధికారులతో చర్చించి ఏర్పాట్లు చేసుకోవాలని పేర్కోన్నారు.  ఈ కార్యక్రమంలోజడ్.పి.సి.ఈ. ఓ ప్రేమ్ కరణ్ రెడ్డి,, స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి సుభద్ర,  వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గోన్నారు.



Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్