పురపాలక చట్టం సవరణల పై గవర్నర్ కు లేఖ వ్రాసిన ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్
పురపాలక చట్టం సవరణల పై గవర్నర్ కు లేఖ వ్రాసిన ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్
హైదరాబాద్: పురపాలక చట్టంలో 6 సవరణలు చేస్తూ, రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసిన సవరణ లపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కు కొన్ని అనుమానాలున్నాయిని పేర్కొంటూ రాష్ట్ర గవర్నర్ కు లేక వ్రాసింది. ఈ చట్ట సవరణలకు ఆమోదం తెలిపే ముందుగా తామూవ్ లేవనెత్తిన విషయాలను పరిగణన లోనికి తీసుకోవాల్సిందిగా రాష్ట్ర గవర్నర్ ను కోరింది.
యధాతథంగా చదవండి
1. నామినేట్ సభ్యుల పెంపు: హైదరాబాదు పురపాలక సంస్థలో 5 నుంచి 15 కు అలాగే ఇతర పురపాలక
సంస్థలలో 5 నుంచి 10 కి నామినేట్ సభ్యుల సంఖ్య పెంచబడింది. నామినేట్ సభ్యులు పురపాలక పనులలో మరియు చట్టంపై పూర్తి అవగాహన కలిగి ఉన్నవారుగా ఉండాలని నిర్దేశించినను ఎటువంటి నియమాలు పాటించడంలేదు. హైదరాబాదు మునిసిపల్ చట్టం సెక్షన్
8 - (ఎ) ప్రకారము ప్రతి మునిసిపల్ వార్డులో స్థానికంగా ఉన్న స్వచ్చంద సేవా సంస్థల ప్రతినిధులు అలాగే ఇతర నిష్ణాతులతో పురపాలక ఎన్నికల పిదప మూడు నెలలలో వార్డు కమిటీలు ఏర్పాటు చేయాలి. కాని మూడు
సంవత్సరాలు గడిచినా వాటి ఊసే లేదు. ఇది ఇలా ఉండగా ఇప్పుడు నామినేట్ సభ్యుల సంఖ్య 15 కు పెంచడం సమంజసంగా లేదు. ఈ చర్య జి.హెచ్.యం.సి. పనిలో ఏ మాత్రము సహాయపడదు. అదీ కాక ఈ
సవరణలలో ఎటువంటి ప్రజా ప్రయోజనం లేదు. ప్రస్తుతం ఉన్న ఐదుగురు నామినేట్ సభ్యులు గత 3 సంవత్సరాలుగా చేసిందేమేలేదు.
అటువంటప్పుడు సంఖ్య పెంచడం దేనికి ?
2. అవి తీర్మానానికి 4 సంవత్సరముల గడువు:
తెలంగాణ మునిసిపాలిటీల చట్టం సెక్షన్ 37 ప్రకారం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టుటకు, సగానికి తక్కువ
కాకుండా ఓటు హక్కు గల సభ్యులు తీర్మానాన్ని ప్రతిపాదించవలసి ఉంటుంది. అలాగే జి.హెచ్.యం.సి సెక్షన్
91 (ఎ) కూడ చెపుతుంది. అవిశ్వాస తీర్మానానికి ఇంత పకడ్బందీగా ఉండగా చీటికి మాటికి అవిశ్వాస
తీర్మానం పెట్టే అవకాశం రాదు. అటువంటి పరిస్థితులలో 4 సంవత్సరాల వరకు అవిశ్వాస తీర్మానం చెల్లదు.
అంటూ చట్ట సవరణలు చేయడం రాజ్యాంగ విరుద్ధం. ఈ సవరణ అవినీతికి, ఆశ్రిత పక్షపాతానికి తావిస్తుంది.
3. రాజ్య సభ సభ్యులకు ఓటు హక్కు :
రాజ్యసభ సభ్యులను పురపాలక చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలలో
సభ్యులుగా చేస్తూ చట్టాన్ని సవరించడం రాజ్యంగ విరుద్ధం. 74వ రాజ్యాంగ సవరణ తరువాత పురపాలక
సంస్థలు రాజ్యాంగ సంస్థలు (కాన్సిట్యూషనల్ బాడీస్) గా రూపొందినాయి. ఈ చట్ట సవరణతో రాజ్యసభ
సభ్యులను కేవలం మేయర్, డిప్యూటీ మేయర్, చైర్ పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికకు మాత్రమే సభ్యులుగా
చేర్చుట ఏ మాత్రము సమర్ధనీయం కాదు. ఇది కేవలం రాజకీయ లబ్ధి కొరకే ప్రతిపాదించడం జరిగింది. ఈ
సవరణలో ఎలాంటి ప్రజా ప్రయోజనం లేదు.
ఈ చట్ట సవరణలకు ఆమోదం తెలిపే ముందుగా ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేవనెత్తిన విషయాలను
పరిగణన లోనికి తీసుకోవాల్సిందిగా గౌ// రాష్ట్ర గవర్నర్ గారిని కోరడమైనది.
Comments
Post a Comment