సచివాలయానికి అంబెడ్కర్ పేరు పెట్టాలని కేసీఆర్ నిర్ణయించడం చారిత్రాత్మకమ్ - మంత్రి కొప్పుల ఈశ్వర్
సచివాలయానికి అంబెడ్కర్ పేరు పెట్టాలని కేసీఆర్ నిర్ణయించడం చారిత్రాత్మకమ్ - మంత్రి కొప్పుల ఈశ్వర్
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన తెలంగాణా సచివాలయానికి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబెడ్కర్ పేరు పెట్టాలని నిర్ణయించడం చారిత్రాత్మకమని రాష్ట్ర యస్ సి సంక్షేమ శాఖామంత్రి కొప్పుల ఈశ్వర్ కొనియాడారు. భారతదేశంలో మరెక్కడా లేని విదంగా దళితులను సుసంపన్నం చేసేందుకు గాను దళితబంధు పధకాన్ని ప్రవేశ పెట్టి దళితుల పక్షపాతి గా చాటుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సచివాలయానికి డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ పేరు పెట్టి దళిత పక్షపాతి అన్న పేరును సార్ధకం చేశారన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. భారత రాజ్యాంగ నిర్మాతకు తెలంగాణా ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి కేసీఆర్ అందించిన అరుదైన గౌరవంగా ఆయన అభివర్ణించారు. ఈ నిర్ణయం యావత్ భారత దేశానికి స్ఫూర్తి దాయకంగా నిలుస్తోందన్నారు.నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనానికి కుడా బాబాసాహెబ్ అంబెడ్కర్ పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు.

Comments
Post a Comment