గ్లోబల్ అల్యూమినియం కంపెనీ అక్రమ కట్టడాలు కూల్చివేత - గ్రామ కార్యదర్శి శంకర్ గౌడ్
గ్లోబల్ అల్యూమినియం కంపెనీ అక్రమ కట్టడాలు కూల్చివేత - గ్రామ కార్యదర్శి శంకర్ గౌడ్
మెదక్ జిల్లా: మెదక్ జిల్లా మనోహరబాద్ మండలం కాళ్లకల్ గ్రామ పరిధి లో సర్వే నెంబర్ 157, 158, 161, 162 లలో గ్లోబల్ అల్యూమినియం కంపెనీ
అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చివేయాలని గ్రామపంచాయతీ అత్యవసర సమావేశం లో తీర్మానించినట్లు గ్రామ కార్యదర్శి శంకర్ గౌడ్ తెలిపారు. గ్లోబల్ అల్యూమినియం కంపెనీ అక్రమంగా నిర్మించిన కట్టడాలను తొలగించాలని ఈ నెల 15న జిల్లా కలెక్టర్ మెమో ద్వారా ఆదేశించారు. ఈ రోజు గ్రామ పంచాయతీ ప్రత్యేక సమావేశంలో రేపు 29 రోజున 10.30 ల నుండి అక్రమ కట్టడాలను పోలీసుల సహకారంతో కూలగొట్టాలని తీర్మానించారని తెలిపారు. పోలీసులను బందోబస్తు కూడా ఏర్పాటు చేయాలని కోరామని ఆయన తెలిపారు.
ఈ అక్రమ కట్టడాలపై పలువురు ఫిర్యాదు చేయడం తో హెచ్ ఎమ్ డి ఏ అధికారులు, డివిజనల్ పంచాయతీ అధికారి విచారణ జరిపి నివిధిక సమర్పించడం తో కలెక్టర్ అక్రమ నిర్మాణాలను తొలగించాలని ఆదేశిస్తూ మెమో జారీచేశారు. యిది యిలా ఉండగా హైదరాబాద్ అమీర్పేట్ లోని ఓ ప్రధాన కార్యాలయపు అధికారి అక్రమ కట్టడాలను రక్షించడానికి కృషి చేసినా ఫలితం దక్కలేదని సమాచారం
Comments
Post a Comment