కురుమల అభివృద్ధికి తోడ్పడండి - కురుమ రిజర్వేషన్ పోరాట సమితి. KRPS బండి సంజయ్ కు వినతి
కురుమల అభివృద్ధికి తోడ్పడండి
కురుమ రిజర్వేషన్ పోరాట సమితి. KRPS బండి సంజయ్ కు వినతి
గొర్రె పిల్ల కోసం పులితో పోరాడే కురుమలకు అన్యాయం చేసే పార్టీలకు బుద్ధి చెప్పాలి
కురుమలను అభివృద్ధి చేయడంలో బిజెపి పార్టీ ముందుంటుంది
కురుమలను కేంద్రమంత్రి గవర్నర్ ను చేసిన చరిత్ర బిజెపిది
వేల గొర్రెల్లో గొర్రెను గుర్తించే కురుమలకు తమకు అన్యాయం చేస్తున్న పార్టీని గుర్తించి శక్తి ఉంది
రాష్ట్రంలో కురుమల ఎదుర్కొంటున్న సమస్యలపై కురుమ రిజర్వేషన్ పోరాట సమితి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ కు వినతి పత్రం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేల గొర్రెల మందలో ఏ గొర్రె తనతో గుర్తించే కురుమలకు ఏ పార్టీ మేలు చేస్తుందో కూడా గుర్తించే నైపుణ్యం ఉంటుందని కురుమలకు కీడు చేసే పార్టీని ఓడించడంలో కురుమలు ముందుండాలని గొర్రెను కాపాడేందుకు పులితో సాహసం చేసే కురుమలకు రాజకీయంగా కురుమలను అనగ తొక్కాలని చూస్తున్న పార్టీలను భూస్థాపితం చెయ్యడం పెద్ద లెక్కెం కాదని బిజెపి పార్టీ కురుమలకు మద్దతుగా ఉంటుందని బండారు దత్తాత్రేయను కేంద్ర మంత్రిగా గవర్నర్ గా అవకాశం కల్పించిన పార్టీ బిజెపి పార్టీ అన్నారు. ఇప్పటివరకు అసెంబ్లీకి పోనీ కులాలను అసెంబ్లీకి పంపించడమే బిజెపి ఒక లక్షమని బిజెపి అందరి పార్టీ అని కురుమలు బిజెపిని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాలని కోరారు. రిజర్వేషన్ పోరాట సమితి బింగి స్వామి మాట్లాడుతూ కురుమల ఉన్న అనేక సమస్యలు పరిష్కారం కోసం బండి సంజయ్ కు వినతిపత్రం అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కురుమ కులం తెలంగాణ రాష్ట్రం లో ప్రధాన సంఖ్యలో ఉన్న కులం అయిన గుర్తింపు మాత్రం శూన్యం గొఱ్ఱెల కాపరులుగా, ఒగ్గు కథ కళాకారులుగా, గొంగడి నేతకారులుగా వివిధ రంగాల్లో కురుమ లు జీవనం సాగిస్తున్నారు.
బీరప్ప, మల్లన్న లను కుల దైవంగా ఆరాధిస్తారు,5 సంవత్సరాలకు ఒకసారి (పెద్ద పండుగ) పేరుతో బీరప్ప జాతర ప్రతి గ్రామం లో నిర్వహిస్తూ ప్రాచీన సంస్కృతిని సాంప్రదాయాలను కొనసాగిస్తూన్నారు.
ఒగ్గు కథ, ఒగ్గు డోలు పట్నాల సంస్కృతి ఇతర కులాలకు బిన్నంగా జీవనం సాగిస్తున్నారు.
గొఱ్ఱెల కాపరులుగా అడవుల చుట్టూ తిరుగుతూ గ్రామాలకు దూరంగా కొంతమంది జీవిస్తున్నారు. కొంత మంది గ్రామాలలో ఉన్నా విద్య, ఉద్యోగం, రాజకీయం లో చాల వెనకబడి ఉన్నారు.
ప్రభుత్వాలు గొఱ్ఱెలు ఇచ్చిన వాటి మేత కోసం అనేక కష్టాలు పడుతున్నారు. గొఱ్ఱెల స్కీం లో డాక్టర్లు, మధ్యవర్తులు కోటి శ్వరులు అయ్యారు తప్ప ఏ ఒక్క గొఱ్ఱెల కాపరి కాలేదు.
కొమురవెళ్లి మల్లన్న, ఐనవోలు మల్లన్న, ఓదెల మల్లన్న ఇలా రాష్ట్రం లో అనేక గుళ్ళలో వంశ పారంపర్యంగా సేవలకు గుర్తింపుకరువు తో అనెక ఇబ్బందులు పడుతున్నారు.
సమాజం లో కథల ద్వారా అనేక సెవలు చేసిన ఒగ్గు కళాకారులను ప్రభుత్వము ఆదుకోవాలి.
గ్రామాల్లో బీరప్ప దేవాలయాల్లో దీప ధూప నైవేద్యం కొరకు చర్యలు తీసుకోవాలి.
కులాన్ని అభివృద్ది చేసేందుకు కురుమ కార్పొరేషన్ ఏర్పాటు చెయ్యాలంటు మరి రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు దీనికి సానుకూలంగా స్పందించిన బండి సంజయ్ కురుమలకు నిరంతరం అండగా ఉండే పార్టీ బిజెపి పార్టీ అని బండారు దత్తాత్రేయను కేంద్ర మంత్రిగా గవర్నర్గా చేసిన ఏకైక పార్టీ బిజెపి పార్టీని అన్నారు. ఉపాధ్యక్షులు కాసా జాహంగిర్, పెద్దాపురం నరసింహ బర్ల శ్రీనివాస్, శిద్దాల రవి,బైరిలింగం గుంటి అనిల్ ,ఇరుమల్ల ప్రశాంత్, ఎగుర్ల జయ రాములు, దొడ్డి వెంకటయ్య, ఒగ్గు అశోక్, బింగి చంద్రం, గుంటి శీను, ఇరుమళ్ళ బీరప్ప, తిగుళ్ళ మహేష్, ఏనుగుల రాజు, బింగి మల్లేష్ , బింగి నరేష్ , శ్రీధర్ , గణేష్ అజయ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment