కోమటిరెడ్డి సంకీర్థ్ రెడ్డి ట్వీట్ 100% సత్యం
కోమటిరెడ్డి సంకీర్థ్ రెడ్డి ట్వీట్ 100% సత్యం
మునుగోడు ప్రజల ముందుకు యావత్ తెలంగాణ అసెంబ్లీ సభ్యులను, మంత్రులను తీసుకవచ్చిన రాజగోపాల్ రెడ్డి నుద్దేశిస్తూ డాడ్ మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాని కోమటిరెడ్డి సంకేర్త్ రెడ్డి చేసిన ట్వీట్ అక్షర సత్యం. ఇప్పటికే మునుగోడు ప్రజలు గెలిచారన్న ట్వీట్ లో చివరి మాట. జరుగుతున్న పరిణామాలు అందుకు నిదర్శనం. ఇప్పటి వరకు తన తండ్రి ఎంత అడిగిన, అరిచిన పట్టించుకోని ప్రభుత్వ పెద్దలు తో పాటు 84 మంది శాసన సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్సీ, ఎంపీలు మునుగోడు ప్రజల మోకాళ్ళ ముందు వంగి ఓట్లు అడుగుతున్న దృశ్యం కోమటిరెడ్డి సంకేర్త్ రెడ్డి ట్వీట్ లో 100 శాతం కనబడింది.
ఒక్క రాజీనామాతో రాష్ట్ర రాజకీయాల్లో మార్పుకు స్వీకారం చుట్టిన రాజగోపాల్ రెడ్డి ని మునుగోడు మరియు రాష్ట్ర ప్రజలంతా అభినందించవలసిన విషయమే. ఓట్ల వేయించుకునే వరకు ప్రజాస్వామ్యము, గెలిచిన తరువాత రాజరికము అన్న చందంగా ఉన్న ఈ పరిస్థితి నుండి ఒక్క సరిగా పాలకులను ప్రజల దగ్గరికి తీసుకు వచ్చిన ఘనత రాజగోపాల్ రెడ్డిది.
మంత్రులకు, ఎమ్మెలీలకు, ప్రజలకు కలవడానికి అనుమతి ఇవ్వని భవన్ నేడు బార్లాగా తలుపులు తీసి అవమానాలకు గురై పార్టీలు మారిన వారికి స్వాగతం పలుకుతూ కౌగిలించు కుంటుంది.
ఏ పాలకులైన ప్రజల వద్దకు పాలన, రచ్చబండ, ప్రజాదర్బార్ లతో ప్రజల ల సమస్యలు తెలుసుకొని పాలించాలి అలాంటిది మేము మొనార్కలము మేము బయటికి రాము కోడి పిల్లలకు గింజలు వేసినట్లుగా ఉచితంగా కొన్ని పథకాలు ప్రకటిస్తాం మా వెమ్మడే ప్రజలు ఉండాలని కోరుకోవడం ఎంతవరకు సరైందో ఆలోచించుకోవాలి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి వేల మంది బలిదానాలతో, వారి తల్లుల గోసతో వచ్చిన తెలంగాణ ప్రజాస్వామ్య బంగారు తెలంగాణ కావాలి కానీ, దురదృష్టవశాత్తు రాజరికపు తెలంగాణ అయ్యింది. Rtc, ఇంటర్ విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు, నిరుద్యోగులు అన్యాయం జరిగిందని ఆత్మహత్యలు చెసుకోవడం నిరంకుశానికి నిదర్శనాలు కావా? ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను పాలకుల్లో ఏ ఒక్కరైనా ఓదార్చిన సంఘటనలు యున్నాయా? దీని ప్రజలు తప్పకుండా గుర్తుపెట్టుకుంటారు. తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు. తెలంగాణ ప్రజలకు ఆత్మగౌరం చాలా ఎక్కువ, వారు సమయం వచ్చినపుడు తప్పకుండా సరైన గుణపాఠం చెపుతారు.
ఇంకా మునుగోడు లో రాజకీయం రెండు వర్గాలుగా చీలింది. మునుగోడు అభివృద్ధికి ఎంత మొత్తుకున్నా నిధులు ఇవ్వవలేదని అభువృద్ది జరగలేదని రాజీనామా చేసిన బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి ఒక వైపు, అధికార పార్టీ టిఆర్ఎస్, దానికి మద్దతు ఇస్తున్న సీపీఐ, సిపిఎం, ప్రతిపక్ష కాంగ్రెస్, బీఎస్పీ ఇంకా చిన్న పార్టీలు ఇంకో వైపుగా ఉన్నాయి. అధికార పార్టీ టిఆర్ఎస్, దానికి మద్దతు ఇస్తున్న సీపీఐ, సిపిఎం మరియు ప్రతిపక్ష కాంగ్రెస్, బీఎస్పీ ఇంకా పోటీచేస్తూన్న అందరూ దాడి చేస్తున్నది రాజగోపాల్ రెడ్డి పైనే అందరూ రాజగోపాల్ రెడ్డి పైనే వార్ చేస్తున్నారు.
మునుగోడు ప్రజలు ఆలోచించుకోవలసిన విషయం ఆసన్నమైంది. పదవి పట్టుకుని వేలాడే ఈ రోజుల్లో ప్రజల కోసం , ప్రాంత అభివృద్ధి కోసం తన రాజకీయ జీవితాన్ని ఫణంగా పెట్టిన రాజగోపాల్ రెడ్డి ని గెలిపించుకుంటారో, ప్రజల ను కోడి పిల్లలగా వాడుకునే వారికి పట్టం కడుతారో లేక ప్రజాస్వామ్య పద్ధతి లో గెలిచి ఇంకో పార్టీల లోకి వెళ్లే వారికి ఓట్లు వేస్తారో ఆలోచించుకివాలి. వాడ వాడ లో రోడ్లు, మోరీలు, గట్టుప్పల్ మండలం, గిరిజన బంధు, ఇంకా బోలెడు అభివృద్ధి కి కారకుడైన రాజగోపాల్ రెడ్డి ని మునుగోడు ప్రజలు ఆదరిస్తారని, అదుకొని అక్కున చేర్చు కుంటారని పలువురు విశ్లేషకుల విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Post a Comment