గ్లోబల్ టెండర్లో ఎల్ 1 గా వచ్చినందుకే కాంట్రాక్టు దక్కింది - అసత్యాలను, అబద్ధాలను ప్రచారం చేస్తే పరువు నష్టం దావాకు వేనుకాడం - సుశి ఇన్ఫ్రా


 గ్లోబల్ టెండర్లో ఎల్ 1 గా వచ్చినందుకే  కాంట్రాక్టు దక్కింది  -   అసత్యాలను, అబద్ధాలను ప్రచారం చేస్తే పరువు నష్టం దావాకు వేనుకాడం -  సుశి ఇన్ఫ్రా


 హైదరాబాద్, ( గూఢచారి): మైనింగ్  కంట్రాక్టు టెండరు ఖరారుకు సంబంధించిన వాస్తవాలను, సాంకేతిక అంశాలను రాజకీయ నేతలతో పాటు సామాన్య ప్రజలకు వివరించేందుకు సుశి ఇన్ఫ్రా పూర్తి వివరాలతో ఓ ప్రకటనను   విడుదల చేసింది.

 అందులోని వివరాలు:  చంద్రగుప్త బొగ్గు గని - గని అభివృద్ధి, నిర్వహణ ప్రాజెక్టు - ఝార్ఖండ్ సిసిఎల్ నాలుగు దశాబ్దాలుగా  దేశ వ్యాప్తంగా మౌలిక వసతులు కల్పనా రంగంలో ఏటా వేల కోట్ల కాంట్రాక్ట్ వర్కులు చేస్తున్న సుశీ ఇన్ఫ్రా అండ్ మైనింగ్ లిమిటెడ్ కంపెనీకి ఝార్ఖండ్ లో కోల్ మైనింగ్ కాంట్రాక్ట్ దక్కించుకోవడం పెద్ద విషయమే కాదని, సుశీ కంపెనీ ట్రాక్ రికార్డ్ స్టడీ చేస్తే ఎవరికైనా స్పష్టమవుతుందని తెలిపింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కుమారుడు సంకీర్త్ రెడ్డి మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్న సుశీ ఇన్ ఫ్రా అండ్ మైనింగ్ కంపెనీకి ఝార్ఖండ్ రాష్ట్రంలోని చంద్రగుప్త కోల్ మైనింగ్ ప్రాజెక్ట్ దక్కడం వెనక బిజెపి పెద్దల హస్తముందంటూ గత మూడు నెలలుగా కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన కొందరు నేతలు మీడియాలో అసత్యాలను ప్రచారం చేస్తున్నారని, మైనింగ్ టెండర్లు ఎలా ఖరారవుతాయనే సాంకేతిక అంశాలపై అవగాహన ఉన్న నేతలు కూడా ఉద్దేశపూర్వకంగా, రాజకీయ లబ్ధి కోసమే అసత్యాలు, అబద్ధాలు మాట్లాడుతున్నారనిపిస్తోందని. అందుకే ఈ మైనింగ్ టెండరు ఖరారుకు సంబంధించిన వాస్తవాలను, సాంకేతిక అంశాలను రాజకీయ నేతలతో పాటు సామాన్య ప్రజలకు వివరించేందుకే ఈ ప్రకటనను విడుదల చేస్తున్నామని తెలిపింది. 

భారత ప్రభుత్వ రంగ సంస్ధ కోల్ ఇండియాకు అనుబంధంగా ఉన్న సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (CCL) సంస్ధ, తనకు ఝార్ఖండ్ రాష్ట్రంలో ఉన్న చంద్రగుప్త కోల్ ప్రాజెక్టులో  ఏటా 15 మిలియన్ టన్నుల బొగ్గును 25 ఏళ్ల పాటు  వెలికితీయడానికి సంబంధించి గ్లోబల్ టెండర్లను ఆహ్వానించిందని,  ఇందులో 1. గ్లోబల్ టెండర్ నోటిఫికేషన్ ను సిసిఎల్ మొదటి సారి 2020 జూన్ 30 లో తేదీన జారీ చేసిందని, ఈ టెండర్ లో పాల్గొన్న మూడు కంపెనీలు ఒక టన్ను బొగ్గును తవ్వి వెలికి తీయడానికి కోట్ చేసిన ధరలు ఇలా ఉన్నాయని,* టెండర్ లో ఎల్ 1 గా నిలిచిన అదాని ఎంటర్ ప్రైజ్ లిమిటెడ్ కంపెనీ రూ.776/- కోట్ చేసిందని, టెండర్ లో ఎల్ 2 గా నిలిచిన అరబిందో - మహాలక్ష్మీ - ట్రిడెంట్  కన్సార్టియం రూ.871/- కోట్ చేసిందని, టెండర్ లో ఎల్ 3 గా నిలిచిన మాంటెకార్లో లిమిటెడ్ కంపెనీ రూ.999/- కోట్ చేసిందని,అయితే ఈ మూడు కంపెనీలు కోట్ చేసిన ధరలు సహేతుకంగా లేవని భావించిన సిసిఎల్ ఈ టెండర్ ప్రక్రియను పూర్తిగా రద్దు చేసిందని తెలిపారు.  

టెండర్ షరతుల్లో ఎలాంటి మార్పులు చేయకుండా మరోసారి సిసిఎల్ 2021 ఫిబ్రవరి 30 ను గ్లోబల్ టెండర్ నోటిఫికేషన్ ను జారీ చేసిందని, ఈ రెండో టెండర్ లో పాల్గొన్న మూడు కంపెనీలు ఒక టన్ను బొగ్గును తవ్వి వెలికి తీయడానికి కోట్ చేసిన ధరలు  టెండర్ లో ఎల్ 1 గా నిలిచిన సుశీ ఇన్ఫ్రా మైనింగ్ లిమిటెడ్ - ఎమ్ ఆర్ కేఆర్ కన్సార్టియం  రూ.648/- కోట్ చేసిందిని, టెండర్ లో ఎల్ 2 గా నిలిచిన అదాని ఎంటర్ ప్రైజ్ లిమిటెడ్ కంపెనీ  రూ.695.40/- కోట్ చేసిందని, టెండర్ లో ఎల్ 3 గా నిలిచిన మాంటెకార్లో లిమిటెడ్ కంపెనీ రూ.749/- కోట్ చేసిందని, టెండర్ ప్రక్రియలో భాగంగా ఎల్ 1 గా నిలిచిన  సుశీ ఇన్ఫ్రా మైనింగ్ లిమిటెడ్ - ఎమ్ఆర్ కేఆర్ కన్సార్టియం సిసిఎల్ సంప్రదింపులు జరిపినపుడు ఒక టన్ను బొగ్గును తవ్వి వెలికి తీయడానికి మేం కోట్ చేసిన రూ.648/- కంటే మరో 110 రూపాయలు తగ్గించుకొని రూ.538.29/- కే ప్రాజెక్టు చేపడుతామని స్పష్టం చేయడంతో టెండర్ ఖరారైందని పేర్కొన్నారు. 

ప్రభుత్వ రంగ సంస్థ అయిన కోల్ ఇండియా లిమిటెడ్ లో టెండర్ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా ఉంటుందని,  టెండర్ ఖరారు లో రాజకీయ జోక్యం, ఇతర ఒత్తిళ్లకు ఎలాంటి ఆస్కారం ఉండదని ప్రభుత్వ రంగ సంస్ధలకు చెందిన వేల కోట్ల విలువైన కాంట్రాక్టులు ఏవైనా గ్లోబల్ టెండర్ల ద్వారానే ఖరారవుతాయని,  ఇందులో కేంద్ర ప్రభుత్వ పెద్దల ప్రమేయమేమీ ఉండదని కాంట్రాక్ట్ రంగం గురించి అవగాహన ఉన్నవారందరికీ తెల్సిందే నని స్పష్టం చేసింది. వాస్తవాలు ఇలా ఉండగా ఝార్ఖండ్ రాష్ట్రంలోని ఈ కోల్ మైనింగ్ ప్రాజెక్టును సుశీ ఇన్ ఫ్రా కంపెనీ దక్కించుకోవడం వెనక బిజెపి పెద్దల సహకారముందంటూ  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యతిరేకులు కొందరు తప్పుడు ప్రచారం చేయడం రాజకీయ లబ్ధి కోసమే అన్నది స్పష్టమవుతోందని, ఈ టెండర్ ఖరారు పై మా కంపెనీకి, కోల్ ఇండియా, సిసిఎల్ సంస్థలకు దురుద్దేశాలను అంటగడుతున్న కొన్ని రాజకీయ పార్టీలు కావాలనుకుంటే  ఈ మొత్తం టెండర్ ప్రక్రియ పై సిబిఐ, సెంట్రల్ విజిలెన్స్ వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు వేటితో అయినా విచారణ జరిపించుకోవచ్చని, ఈ టెండర్ విషయం లో సుశీ ఇన్ఫ్రా కంపెనీ, కోల్ ఇండియా లిమిటెడ్ సంస్థ లపై అసత్యాలను, అబద్ధాలను ప్రచారం చేస్తూ మా కంపెనీ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్న రాజకీయ పార్టీలపైన, నాయకులపైనా సంబంధిత  కోర్టులో పరువు నష్టం కేసులు వేయడానికి వెనుకాడబోమని  ఈ కంపెని  మేనెజింగ్ డైరెక్టర్ కోమటిరెడ్డి సంకీర్త్ రెడ్డి  తెలిపారు.  

ఈ కోల్ మైనింగ్ టెండరు పూర్తిగా మా కంపెనీకి ఉన్న ఆర్ధిక బలం, సాంకేతిక పరిజ్ఞానం వంటి అంశాల ప్రాతిపదికనే దక్కిందని మరోసారి స్పష్టం చేస్తున్నామని తెలిపింది.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్