మునుగోడు ఎన్నికల ట్రెండ్ నా పరిశీలన లో మొత్తం కమలం జెండాల రెపరెపలే

 


నా మునుగోడు ఎన్నికల ట్రెండ్ పరిశీలన లో   

మొత్తం కమలం  జెండాల రెపరెపలే

నేను ఈ రోజు మునుగోడు ఎన్నికల ట్రెండ్ పరిశీలన కు మునుగోడు పోయాను. రాజగోపాల్ రెడ్డి కాంప్ ఆఫీస్  జనసందోహంతో  కిట కిట లతో నిండి ఉంది. నిరంతరాయంగా చేరికలు జరుగుతూనే ఉన్నాయి. 

అక్కడి నుండి చండూరు బయలు దేరాను మధ్యలో ఓ బాలుడు ఎడ్ల వెంబడి కమలం జెండాను పట్టుకొని రెపరేపలాడిస్తున్నాడు 

ఇంకా  కొంత దూరం  చండూరు శివారు లోని 201 బూత్ లో  దాదాపు 50మంది  కార్యకర్త లు  సరూర్ నగర్ కార్పొరేటర్  ఆకుల శ్రీవాణి ఆధ్వర్యంలో ప్రచారం చేయడం కనిపించింది.

 ఈ ప్రచారం లో  సంఘ సేవకుడు ప్రజలకు కంటి సేవలు అందిస్తున్న డాక్టర్ రవిచరన్   వారిని పరిచయం చేసుకుని స్వచ్చందగా వారి వెంట ప్రచారానికి వెళ్లడం కనిపించింది.  


ఇంకా  కొంచం  దూరం  ముందుకు వచ్చి చండూరు అంగడి సెంటర్ కు  చేరుకున్న 

అక్కడ ఓ వినూత్న దృశ్యం కనపడింది. కొంత మంది ఓయూ విద్యార్థులు సురేష్ యాదవ్ ఆధ్వర్యంలో మెడలో ఉరి తాడు వేసుకుని సాలు దొర, సెలవు దొర అంటూ నినాదాలు చేస్తు కనబడ్డారు. 

కేసీఆర్ కు ఓటు వేస్తే నిరుద్యోగులకు ఉరే, మునుగోడు పై చిన్న చూపు ఉన్న కేసీఆర్ కు ఓడిద్దాం అంటూ నినాదాలు చేసారు.

హ్


అక్కడి నుండి   గాంధీ విగ్రహం దగ్గర కి పోయా 

అక్కడ స్వర్ణకారులు వారి వారి పనుల్లో ఉన్నారు. ఒకరిని ఎలా ఉంది ఎన్నికల సరళి అని అడగ్గా    ఏడాదిన్నర తరువాత 

రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో  మాకు  మేలు జరుగుతుందని బజార్లో మోరీలు, రోడ్లు వేస్తున్నారని అన్నారు.

నా 4 గంటల పర్యటనలో ఒక్క టిఆర్ఎస్ , కాంగ్రెస్ మరియు ఇతర  పార్టీల జెండాలు పట్టుకొని ప్రచారం  కనపడకపోవడము మరి దేనికి సంకేతమో. చండూరు లో  బీజేపీ ప్రచార వాహనం, ఓ కాంగ్రెస్ వాహనం కంటపడింది.


-భూపతి రాజు, సీనియర్ జర్నలిస్ట్. ఎడిటర్ గూఢచారి



Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్