నియంత పాలనను సాగిస్తున్న తెరాస కుటుంబ పాలనను సాగనంపాలి - మాజీ ఎంపీ బీజేపీ నాయకులు బూర నర్సయ్య గౌడ్


 నియంత పాలనను సాగిస్తున్న తెరాస కుటుంబ పాలనను  సాగనంపాలి - మాజీ ఎంపీ బీజేపీ నాయకులు బూర నర్సయ్య గౌడ్

నల్గొండ: తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ రోజు నల్గొండలో  జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమములో  మాజీ పార్లమెంట్ సభ్యులు బూర నర్సయ్య గౌడ్ పాల్గొన్నారు.  తెలంగాణ ఉద్యమ సమయంలో మొదటి నుండి క్రియాశీలకంగా పని చేసిన కార్యకర్తలకు,   కెసిఆర్ ను  కలిసి  ప్రజల సమస్యలు చెప్పుకునే అవకాశం  లేకుండా పోయిందని, కెసిఆర్ నియంత్రత్వ విధానాలకు  విసిగి వేసారిన, ఆత్మ గౌరవాన్ని   కాపాడుకోవడం, వ్యవస్థ లో మార్పుకోసం బిజెపి పార్టీలో చేరాల్సిన అవస్యకత ఏర్పడిందని తెలిపారు. ఉద్యమ సమయంలో ప్రధాన భూమిక పోషించి తెలంగాణ ఉద్యమాన్ని దశ దిశలా తెలియపరిచిన జర్నలిస్ట్ లకు ఇచ్చిన హామీలను సైతం ముఖ్యమంత్రి పూర్తిగా విస్మరించినాడని, తెలంగాణా ఏర్పాటు తర్వాత అన్నీ వర్గాల  ప్రజలను కెసిఆర్ మోసగించాడని, ఎస్సి, ఎస్టీ, బిసి ల పట్ల  నిర్లక్ష్య వైఖరితో  ఎటువంటి సంక్షేమ పతకాలు చేపట్టకుండా నియంత పాలనను సాగిస్తున్న తెరాస కుటుంబ పాలనను  సాగనంపాలని కోరారు.  మునుగోడు లో ప్రస్తుతం జరుగుతున్న ఉప ఎన్నికలు కూడా తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ ప్రజల  ఆత్మ గౌరవనికి జరుగుచున్న ఎన్నికని ఈ ఎన్నికల్లో మునుగోడు ప్రజలు బి జే పి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భారీ మెజారిటీ తో  మునుగోడు ప్రజలు గెలిపిస్తారాని  చెప్పారు.

తెలంగాణా జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కప్పర ప్రసాదరావు  గారు అధ్యక్షుత జరిగిన 

ఈ కార్యక్రమం లో మాజీ మంత్రివర్యులు సంబాని చంద్రశేఖర్, మాజీ ఏం ఏల్ సి, కపిలవాయి దిలీప్ కుమార్, తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. బింగి స్వామి, ఐ ఎఫ్ డబ్ల్యూ జె జాతీయ వర్కింగ్ కమిటీ సభ్యులు కపిల వాయి రవీందర్, తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ నల్గొండ జిల్లా అధ్యక్షులు భూపతి  రాజు, ప్రధాన  కార్యదరి. మీసాల నరహరి, కొండా సంపత్, యాదగిరి గౌడ్, గుబ్బ శ్రీనివాస్, ముత్తయ్య, నవీన్ మరియు  ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, పాల్గొన్నారు

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్