కొత్త నాటకం మొదలు పెట్టిన కెసిఆర్ - బిజెపి రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్


 

 కొత్త నాటకం మొదలు పెట్టిన కెసిఆర్ - బిజెపి రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్


నల్గొండ:; 4గురు ఎమ్మెల్యేల బేరసారాలు కెసిఆర్, పికే కుత్రేనని బిజెపి రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. నల్గొండ జిల్లా బీజేపీ కార్యాలయం లో ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఒక పార్టీలో గెలిచిన వారిని కొనుగోలు చేసే వ్యక్తి కెసిఆర్ అని, తెలంగాణ వచ్చిన వెంటనే 12 మంది ఎమ్మెల్సీలను కొనుగోలు చేశారని విమర్శించారు. టిడిపిని కొనుక్కొని తెలంగాణలో ఆ పార్టీని మూసి వేశారని, ఏ పార్టీ అయితే తెలంగాణ ఇచ్చిందో ఆ పార్టీ కాంగ్రెస్ ను  నిండా ముంచింది  కెసిఆర్ నని అన్నారు. 18 మంది గెలిస్తే 12 మందిని కొనుక్కున్న వ్యక్తి ఈ కెసిఆర్. 

హోదా పట్టి కొనుగోళ్లు, హోదా పట్టి డబ్బులు ఇచ్చి విలువకడుతున్నారని, కొనుగోళ్ల సాంప్రదాయం మొదలు పెట్టింది కెసిఆర్ నని అన్నారు. బి ఆర్ యెస్ పెట్టీ దేశమంతా కూడా ఇదే చేస్తారా ? అని ప్రశ్నించారు.బిజెపి పార్టీకి ఎమ్మెల్యేను కొనాల్సిన అవసరం కూడా లేదుని, 

రాజకీయ నాయకులను ప్రలోవ పెట్టే విధానం బిజెపి పార్టీ సిద్ధాంతం కాదని, ఆ నలుగురు ఎమ్మెల్యేలు అర్ధ రూపాయి కూడా విలువ లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో  పట్టణ అధ్యక్షులు మొరిశెట్టి నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ఆవుల మధు,చింత మూత్యల్ రావు, గాలి శ్రీనివాస్,‌ఏమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, అల్లి సురేష్, భాస్కర్,వేంకటేష్, లింగుస్వామి,మామిడ్ల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్