కేసీఆర్ కాన్వాయ్ లో డబ్బు సంచులు - బండి సంజయ్


  కేసీఆర్ కాన్వాయ్ లో డబ్బు సంచులు - బండి సంజయ్


బహిరంగకేసీఆర్ సభ వేదికగా మరో డ్రామాకు కేసీఆర్ స్కెచ్


కేసీఆర్ కాన్వాయ్ లో డబ్బు సంచులు


దమ్ముంటే మునుగోడుకు చేసిన అభివ్రుద్ధిపై మాట్లాడాలి


కుట్ర చేయలేదని నలుగురు ఎమ్మెల్యేలతో కలిసి సభా వేదికగా ప్రమాణం చేసే దమ్ముందా?


మీరు తప్పు చేయకుంటే సీబీఐ విచారణకు అభ్యంతరమేంది?


లిక్కర్ స్కాం వెలుగులోకి రాగానే భయంతోనే సీబీఐ రాకుండా జీవో


విచారణకు ఆదేశించకుండా కోర్టులోనూ అఫిడవిట్ దాఖలు చేయడం సిగ్గు చేటు


గత 8 ఏళ్లలో 34 మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లో చేర్చుకున్న కేసీఆర్....


ఆయా ఎమ్మెల్యేలకు ఎంత డబ్బు ఇచ్చారో సభా వేదికగా సమాధానం చెప్పాలి



ముఖ్యమంత్రి కేసీఆర్ పై నిప్పులు చెరిగిన బండి సంజయ్ కుమార్




చండూరు బహిరంగ సభ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ మరో డ్రామాకు తెరలేపబోతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్  వ్యాఖ్యానించారు. 

మునుగోడు ప్రజలను సెంటిమెంట్ తో టీఆర్ఎస్ వైపు మళ్లించేందుకు ఏడుపు డ్రామాకు సిద్ధమయ్యారని అన్నారు. ఉప ఎన్నికల్లో ఒక్కో ఓటుకు రూ.40 వేలు పంచేందుకు సిద్ధం చేసిన డబ్బును సీఎం కాన్వాయ్ లోనే తరలించబోతున్నారని సంచలన అరోపణ చేశారు. కేసీఆర్ కు దమ్ముంటే చండూరు బహిరంగ సభ వేదికగా మునుగోడుకు చేసిన అభివ్రుద్ధిపై మాట్లాడాలని సవాల్ విసిరారు. 8 ఏళ్ల పాలనలో మునుగోడు నియోజకవర్గాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేశారు? గ్రామాలు, మండలాల వారీగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని నిధులు కేటాయించారో వివరించాలని డిమాండ్ చేశారు. నలుగురు ఎమ్మెల్యేల వ్యవహారంలో ఏ తప్పు చేయకుంటే బహిరంగ సభ వేదికగా ఆయా ఎమ్మెల్యేలతో కలసి ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. ఈరోజు మర్రిగూడలోని బీజేపీ క్యాంపు కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినధి జె.సంగప్ప, రాష్ట్ర నాయకులు దరువు ఎల్లన్న తదితరులతో కలిసి బండి సంజయ్ మాట్లాడుతూ కేసీఆర్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 



అందులోని ముఖ్యాంశాలు...

ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ ఉంది. ఆ సభలో కేసీఆర్ కొత్త డ్రామా వేయడానికి సిద్ధంగా ఉన్నారు. 

మునుగోడు గడ్డమీద అడుగుపెడుతున్నారు. మునుగోడు ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఎన్ని నెరవేర్చారు? మునుగోడు అభివ్రుద్ధికోసం ఏం చేశారు? చెప్పాలి

ఈ నియోజకవర్గ అభివ్రుద్ది విషయంలో మీరు నిర్లక్ష్యం చేశారు కాబట్టే మరో ఏడాదిన్నర సమయమున్నా ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి ఎన్నికల్లో వచ్చారు.

రాజగోపాల్ రెడ్డి అభివ్రుద్ధిపై విసిరిన సవాల్ పై స్పందించాలి. మీరెందుకు నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేశారు? ప్రజలకు చెప్పాల్సిందే.

కేంద్రం ఇచ్చిన సంక్షేమ పథకాలను ఈ మునుగోడు నియోజకవర్గంలో ఏమేం అమలు చేశారు?  గ్రామాల వారీగా, మండలాల వారీగా మీ ప్రభుత్వం ఎన్ని నిధులిచ్చింది? ఏ కార్యక్రమానికి ఎంత? అనే వివరాలు వెల్లడించాలి. అదే సమయంలో కేంద్రం ఆయా గ్రామాల వారీగా ఇచ్చిన నిధుల వివరాలు కూడా స్పష్టం చేశారు.

మీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధిని గ్రామాల్లోకి తీసుకెళ్లడానికి మీ నాయకులే అవమానంగా ఫీలవుతున్నారు.. ఎందుకో కూడా చెప్పాలి.

మీరు ముఖ్యమంత్రి అని భావిస్తే... సభ ద్వారా ప్రజలకు వివరించాలి.

ఈ రోజు బహిరంగ సభ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఏడవాలని రడీ అయ్యారట. వాళ్ల సిబ్బందికి ఖర్చీఫ్ ఇవ్వాలని చెప్పారని నాకు సమాచారం వచ్చింది. చావు నోట్ల తలకాయ పెట్టిన... అని సెంటిమెంట్ రగిలించి అడ్డదారిలో గెలవాలని స్కెచ్ వేసిండు.. ఏడవాలి... ప్రజలు అయ్యే అనేలా కేసీఆర్ నటించబోతున్నడు. కేసీఆర్ దొంగ ఏడుపును జనం నమ్మరు.

రాష్ట్రంలో, మునుగోడులో జనం పడుతున్న గోసలు చూడు... వాళ్ల కన్నీళ్లను తుడిచే ప్రయత్నం చెయ్..

నడ్డా సభ గురించి మీకెందుకు? మీలాంటి చిల్లరగాళ్లకు కౌంటర్ ఇవ్వడానికి మేమెందుకని అమిత్ షా, నడ్డాగారు చెప్పారు. 

రేపు, ఎల్లుండి భారీ ర్యాలీలు నిర్వహించబోతున్నం... ఈ ర్యాలీలతో దిమ్మతిరగాలె.

కేసీఆర్ తనకు తాను ఎక్కువగా ఊహించుకుంటుండు...గల్లీ స్థాయి లీడర్ కు ఉండే మర్యాద కూడా నీ దక్కడం లేదు.

సీబీఐ విచారణకు అనుమతించకుండా రెండు నెలల క్రితం జీవో నెంబర్ 51 తీసిండట. ఇంతవరకు పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదు. కేసీఆర్ బిడ్డ లిక్కర్ స్కాం బయటకొచ్చి విచారణ జరుగుతున్న సమయంలో ఈ జీవో తీసుకొచ్చిండు. సీబీఐ అంటే అంత భయమెందుకు?

నువ్వు బీజేపీపై సిగ్గు లేకుండా ఆరోపణలు చేసినవ్... నిరూపించడానికి యాదాద్రికి రమ్మన్నం... సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, సీబీఐ విచారణ జరపాలని కోరినం... అయినా ముందుకు రాలేదు...

మేం కోర్టును ఆశ్రయిస్తే... విచారణ జరపొద్దని అడ్డుకునేలా కౌంటర్ వేస్తున్నవ్... మరి వాస్తవాలు ఎట్లా వెలుగులోకి రావాలి?

నువ్వు తప్పు చేయనప్పుడు విచారణ జరిపించడానికి అభ్యంతరమేంటి?

నీకు కోర్టుల మీద, పోలీసుల మీద, సీబీఐ, ఈడీ మీద నమ్మకం లేదు.. అసలు నీమీద నీకే నమ్మకం లేదు.

ఏ విచారణ జరపకపోతే ప్రజలు నమ్మేదెలా? మాపై ఆరోపణలు చేసినప్పుడు నువ్వే విచారణ చేయించాలి. కానీ మేం కోరినా విచారణ జరపకపోవడానికి కారణమేంటి?

ఆ ఎమ్మెల్యేలను ఈరోజు సభకు తీసుకొచ్చి మాట్లాడించాలని చూస్తుండు....

రోహిత్ రెడ్డి ఎన్ని కోట్లకు అమ్ముడుపోయిండో... మహేందర్ రెడ్డిని అడిగితే చెబుతరు కదా... ఉపేందర్ రెడ్డి ఎంతకు అమ్ముడుపోయిండో... తుమ్మల నాగేశ్వరరావును అడిగితే చెబుతారు..

2014 నుండి ఇప్పటి వరకు 36 మంది ఎమ్మెల్యేలను నీ పార్టీలో చేర్పించుకున్నవ్... 

బీజేపీలో ఎవరు చేరినా పదవికి రాజీనామా చేసి రావాలి. అది మా సిస్టమ్... మరి నీ పార్టీ సిస్టమేది?

2014లో 24 మంది ఎమ్మెల్యేలను, 2018 తరువాత 12 మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లో చేర్చుకున్నవ్.. (ఆయా ఎమ్మెల్యేల పేర్లను చదివి విన్పించారు). వీళ్లతో ఎందుకు రాజీనామా చేయించలేదు? ఎన్నికలకు ఎందుకు వెళ్లలేదు. సంతలో పశువులను కొన్నట్లు కొన్నవ్?

వీళ్లందరికీ ఎన్ని డబ్బులిచ్చి, ఏ ప్రలోభాలు చూపి టీఆర్ఎస్ లో చేర్చుకున్నవో చెప్పాలి.

మేం ఆ 4గురి ఎమ్మెల్యేలను ఎందుకు కొంటాం? వాళ్లతో ప్రభుత్వం పడిపోతుందా? లేక మేం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామా? మాకేం అవసరం?

ఈరోజు ఆ 4గురు ఎమ్మెల్యేలు, నువ్వు, నీ కొడుకు, అల్లుడు కలిసి బహిరంగ సభ వేదికగా ప్రమాణం చేసే దమ్ముందా? మునుగోడును నిర్లక్ష్యం చేయలేదు? అభివ్రుద్ధి చేశామని, ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో ఏ కుట్రలు చేయలేదు... ఇవన్నీ వాస్తవాలని ప్రమాణం చేయాలి.

అడ్డదారిలో గెలవాలనుకుని కుట్రలు చేస్తే జనం నమ్మరు.. నమ్మించి మోసం చేయడంలో గురువు. 

ఈరోజు జరిగే సభతో నీ రాజకీయ సమాధి కాబోతుంది.

ఈరోజు సీఎం కాన్వాయ్ లోనే డబ్బులు తరలించబోతున్నారు. ఒక్కొ ఓటుకు రూ.40 వేల చొప్పున కవర్లు సిద్ధం చేసిన బ్యాగులతో దిగుతున్నరు. ఫస్ట్ హెలికాప్టర్ లో వస్తే... ఆయన కాన్వాయ్ లో బ్యాగులు తీసుకొచ్చేలా ప్లాన్.. ఆయా వాహనాలను ఆపకుండా ఆదేశాలు.. ఆ డబ్బును డంప్ చేసి పంచేందుకు సిద్ధమైండు..

తెలంగాణ ప్రజలు... మునుగోడు ప్రజలంతా కేసీఆర్ కుట్రలను, డ్రామాలను గుర్తించాల్సిందిగా కోరుతున్నా..

ఛార్జ్ షీట్ పై... మేం అధికారంలో ఉన్నమా? మాపై ఛార్జ్ షీట్ ఏమిటి? మునుగోడును నువ్వు చేసిన మోసాలపై ఛార్జ్ షిట్ వేసేందుకు సిద్ధమా?

ఫ్లోరైడ్ సమస్య లేదని రాష్ట్ర ప్రభుత్వమే చెప్పినప్పుడు... 

జీఎస్టీ సమావేశానికి వెళ్లి చేనేతపై ఎందుకు జీఎస్టీ రద్దు చేయాలని కోరలేదు? మీరే కదా జీఎస్టీ వేయాలని చెప్పింది. 

నూలు రంగులపై 50 శాతం సబ్సిడీ ఏమైంది? చేనేత బంధు ఏమైంది? 

మోటార్లకు మీటర్లు డ్రామా? గతంలో హుజూరాబాద్, దుబ్బాకలో ఇట్లనే చెప్పారు.. ఏమైంది? అసలు నీ ఫాంహౌజ్ లో మీటర్లు పెడతం...

కేసీఆర్ పాలనలో పోలీసులు అల్లాడుతున్నరు. 317 జీవోతో చెట్టుకొకరు పుట్టకొకరు అయ్యారు. ఎన్నికల డ్యూటీ పేరుతో తిండి, నీళ్లు లేక అల్లాడుతున్నరు.

పైగా ఎస్పీ, కలెక్టర్లను బెదిరిస్తున్నరు. మునుగోడు ఎన్నికల్లో టీఆర్ఎస్ ను గెలిపించకపోతే మీపై ఏసీబీ కేసులు పెట్టిస్తాం... బదిలీ చేస్తాం.. లూప్ లైన్ లో వేస్తామని హెచ్చరిస్తున్నరు. పూర్తిస్థాయిలో టీఆర్ఎస్ కు అనుకూలంగా వ్యవహరించాలని చెబుతున్నరు.

యాదాద్రి కేటీఆర్ అయ్యదా? తాతదా?

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్