బి జే పి పార్టీ పై జిల్లా ఎన్నికల అధికారికి టి.ఆర్.ఎస్. నేతల ఫిర్యాదు..
బి జే పి పార్టీ పై జిల్లా ఎన్నికల అధికారికి టి.ఆర్.ఎస్. నేతల ఫిర్యాదు..
ఎన్నికల నియామావళి ఉల్లంగించిన బండి..
యదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో ప్రమాణం చేయడం నేరం...
విచ్చలవిడిగా డబ్బులు పంచుతున్న బి.జే.పి. పై కఠిన చర్యలు తీసుకోవాలి...
మొత్తం ఐదు అంశాలపై జిల్లా ఎన్నికల అధికారి పై ఫిర్యాదు చేసిన టి ఆర్ ఎస్ నాయకులు
టి ఆర్ ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ , శాసనసభ్యులు గండ్ర వెంకట రమణ రెడ్డి , కంచర్ల భూపాల్ రెడ్డి , విద్య మౌళిక వసతుల అభివృద్ధి సంస్థ అధ్యక్షులు రావుల శ్రీధర్ రెడ్డి , నల్లగొండ గ్రంధాలయ సంస్థ అధ్యక్షులు రేగట్టే మల్లిఖార్జున్ రెడ్డి ఈ సాయంత్రం జిల్లా కలెక్టరు, ఎన్నికల అధికారిని కలిసి బి జే పి పార్టీ ఎన్నికల నిభంధనలను ఉల్లఘించి అక్రమాలకు పాల్పడుతున్నారని ముఖ్యమంత్రి పై వారి కుటుంబం పై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ఎటువంటి అనుమతులు తీసుకోకుండా బి జే పి పార్టీ పక్షాన కుల సంఘాల మీటింగులు పెడుతున్నారని ఎన్నికల నిభందనలకు విరుద్ధముగా రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఎదుట ప్రమాణం చేసి దేవాలయాన్ని అపవిత్రం చేసి మతపరమైన సంప్రదాయాలను మునుగోడు ఎన్నికలలో వాడుకొని టి ఆర్ ఎస్ పార్టీ కి వ్యతిరేఖంగా ప్రచారం చేస్తున్నారని , విచ్చల విడిగా డబ్బులు ఖర్చు చేస్తూ ఓటర్లను మభ్యపెడుతున్నారని ఇందుకు సంబంధించిన మొత్తం ఐదు విషయాలపై సి డిలు డాక్యుమెంట్ ల రూపంలో జిల్లా ఎన్నికల అధికారి ఫిర్యాదు చేశామని ఈ అంశాల పై నిష్పాక్షికంగా విచారణ జరిపి నిబంధనలకు అనుగుణంగా వారి పై చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు తెలియజేశారు.
Comments
Post a Comment