హవ్వ...సంతలో పశువుల్లా అమ్ముడుపోయే ఎమ్మెల్యేలు ఆణిముత్యాలట - బండి సంజయ్
• హవ్వ...సంతలో పశువుల్లా అమ్ముడుపోయే ఎమ్మెల్యేలు ఆణిముత్యాలట - బండి సంజయ్
నల్గొండ...
*మునుగోడు నియోజకవర్గం మర్రిగూడెం మండల కేంద్రంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ మీడియా సమావేశం...*
కామెంట్స్:
మునుగోడు ఎన్నికలు టీఆర్ఎస్, బీఆర్ఎస్ కు సమాధిరాయి కాబోతోంది
• టోపి పెట్టుకుని వచ్చి మునుగోడు ప్రజలకు టోపీ పెట్టిన కేసీఆర్
• ఒక్క సామాజికవర్గం గురించి కూడా మాట్లాడలేకపోయిన సీఎం
• మునుగోడు ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రస్తావించకుండానే పారిపోయిన కేసీఆర్
• 8 ఏళ్లుగా చేయని పనులు... 15 రోజుల్లో ఎట్లా పూర్తి చేస్తావ్?
• పచ్చి అబద్దాలతో మరోసారి మోసం చేసేందుకు సిద్ధమైన కేసీఆర్
• సూడు సూడు నల్లగొండ...పాట కేసీఆర్ రాయనేలేదు... ఆ పాట రాసింది కోదాటి శ్రీను
• హవ్వ...సంతలో పశువుల్లా అమ్ముడుపోయే ఎమ్మెల్యేలు ఆణిముత్యాలట
• కమ్యూనిస్టు పార్టీల రంగులు వెలిసిపోయినయ్.....ఆ కార్యకర్తలే అసహ్యించుకుంటున్నరు
• మునుగోడు ఉప ఎన్నికలై పోగానే కరెంట్ ఛార్జీలు పెంచేందుకు కేసీఆర్ కుట్ర
• జీతాలివ్వకుండా 317 జీవో పేరుతో ఉద్యోగాలను రాచిరంపాన పెట్టినందుకు టీఎన్జీవో నాయకులు టీఆర్ఎస్ కు మద్దతిస్తున్నారా?
• గాడిదలెవరో... ఆవు ఎవరో ప్రజలెప్పుడో నిర్ణయించుకున్నారు
• ముఖ్యమంత్రి కేసీఆర్ పై మరోమారు నిప్పులు చెరిగిన బండి సంజయ్ కుమార్
మునుగోడు ఎన్నికల ఫలితాలు టీఆర్ఎస్/బీఆర్ఎస్ కు సమాధిరాయి కాబోతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. మునుగోడు ప్రజలకిచ్చిన హామీలను ప్రస్తావించకుండానే సీఎం కేసీఆర్ పారిపోయారని ఎద్దేవా చేశారు. టోపీ పెట్టుకని వచ్చి గప్పాలు కొట్టి ప్రజల నెత్తిన టోపీ పెట్టి పోయారన్నారు. మోటార్లకు మీటర్ల సాకుతో మునుగోడు ఎన్నికలై పోగానే మరోసారి కరెంట్ ఛార్జీలు పెంచి రాష్ట్ర ప్రజలపై భారం మోపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ స్కెచ్ వేశారని వ్యాఖ్యానించారు. మునుగోడు ప్రజలు గాడిదలెవరో... ఆవు ఎవరో నిర్ణయించుకున్నారని.. గాడిదలాంటి టీఆర్ఎస్ కు ఓటేయబోరన్నారు.. టీఎన్జీవో నేతలు కొందరు టీఆర్ఎస్ కు మద్దతివ్వడంపట్ల బండి సంజయ్ మండిపడ్డారు... ‘‘ఉద్యోగులను ఏం ఉద్దరించారని మద్దతు తెలుపుతున్నారు? 317 జీవోతో చెట్టుకొకరు పుట్టకొకరని చేసినందుకా? జీతాలే ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నందుకా?‘’అంటూ ప్రశ్నించారు.
• మర్రిగూడలోని బీజేపీ ఎన్నికల కార్యాలయంలో మాజీ మంత్రి సుద్దాల దేవయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, కేంద్ర జలవనరుల శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం, రాష్ట్ర అధికార ప్రతినిధులు సీహెచ్.విఠల్, జె.సంగప్ప, ఐటీ విభాగం కన్వీనర్ వెంకటరమణ, రాష్ట్ర నాయకులు దరువు ఎల్లన్న తదితరులతో కలిసి బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. అందులోని ముఖ్యాంశాలు...
• ఈరోజు కేసీఆర్ మళ్లీ కోతలు కోసిండు.... మునుగోడు ఎన్నికలున్నందున నియోజకవర్గానికి ఏం చేశావో చెప్పమని అడిగనం... కానీ ఆ ఊసే ఎత్తలేదు. గతంలో ఇచ్చిన హామీలతోపాటు మొన్న ఇచ్చిన హామీల గురించి మాట్లాడలేదు. గౌడ కులస్తుల గురించి ప్రస్తావనే లేదు. బెల్టు షాపులు పెట్టి, డ్రంకన్ అండ్ డ్రైవ్ పెట్టి వాళ్ల వ్రుత్తులు దెబ్బతీస్తావేమో... యాదవుల సమస్యలు మాట్లాడలేదు.. అంటే మొన్న అకౌంట్లో వేసిన గొర్ల పథకం పైసలు వాపస్ తీసుకుంటాడేమో.. వడ్డెరలు, విశ్వకర్మలు, ఎస్టీ, ఎస్టీల ప్రస్తావనే లేదు. కుమ్మరి, కమ్మరి సహా ఎవరి గురించి ప్రస్తావించలే. అంటే ఆ కులాలకు ఏమీ చేయనని చెప్పేసిండు.. కేసీఆర్ ముఖంలో భయం కన్పిస్తోంది. మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నడు..
• చేనేతల గురించి ప్రస్తావించిన కేసీఆర్... చేనేత సహకార ఎన్నికలు ఎందుకు జరపడం లేదు. నూలు వస్త్రాల రంగులపై 50 శాతం సబ్సిడీ ఏమైంది? చేనేత బంధు ఎంతమందికి ఇచ్చిండో చెప్పలేదు. జీఎస్టీ గురించి కేంద్రం నిర్వహించిన సమావేశంలో ఎందుకు మాట్లాడలేదు? జీఎస్టీ వేయాలని మంత్రి హరీష్ రావు చెప్పిన విషయం మర్చిపోయినవా?
• శివన్నగూడెం, రోడ్లన్నీ చిన్న చిన్నపనులట... 15 రోజుల్లో గెలిపిస్తారట... అంత చిన్నవైతే 8 ఏళ్లుగా ఎందుకు పూర్తి చేయలేదు. అన్నీ అబద్దాలే...
• చివరకు ‘‘సూడు సూడు నల్లగొండ... గుండెపైన ఫ్లోరైడ్ బండ’’ నేనే రాసినని సిగ్గు లేకుండా కేసీఆర్ చెప్పుకుండు.. ఆ పాట రాసింది కోదాటి శ్రీను... అయినా సిగ్గు, శరం లేకుండా నేనే రాసినని అబద్దాలు చెప్పిండు..
• మరి డబుల్ బెడ్రూం ఇండ్లు, దళిత బంధు, దళితులకు మూడెకరాలు ఎందుకు ఇయ్యలే? ఉద్యోగాలెందుకు ఇయ్యలే. ఈడ ఉద్యోగాలు రాక వేలాదిమంది యువత డ్రైవర్లుగా హైదరాబాద్ వలసపోయిండ్రు.
• శివన్నగూడెం రిజర్వాయర్ పనులను కేంద్రం ఆపిందని పచ్చి అబద్దాలు వల్లించిండు... ఇప్పుడేమో 15 రోజుల్లో పూర్తి చేస్తానని కథలు చెబుతున్నడు. కిష్టరాంపల్లి, డిండి ప్రాజెక్టులు ఏమైనయ్... పాలమూరు-రంగారెడ్డి ఏమైంది?
• ఫ్లోరైడ్ సమస్యపైనా అబద్దాలు చెప్పిండు... క్రిష్ణా జలాలను హైదరాబాద్ తీసుకుపోయే సమయంలో మునుగోడు సహా ఫ్లోరోసిస్ ప్రాంతాలకు తెలంగాణ రాకముందే నీళ్లు వచ్చినయ్..
• నువ్వు ఇంఛార్జ్ గా ఉన్న లెంకలపల్లి గ్రామ ప్రజలంతా ఆర్వో ప్లాంట్ ద్వారా నీళ్లు తాగుతున్నరు. మరి నీ మిషన్ భగీరథ నీళ్లు యాడికి పోయినయ్...
• కేసీఆర్... ఈ సారైనా హామీలన్నీ అమలు చేస్తారేమో.. ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తానంటాడేమో అనుకున్న... టీఆర్ఎస్ అభ్యర్ధి ప్రజల్లో ఉంటాడట... అసలాయన అందుబాటులోనే ఉండరు. ఆయన ప్రజల్లో ఉంటే ఓట్లు కూడా పడవు.. ఆయన వస్తుంటేనే ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకునే దుస్థితి.
• ఈరోజు కేసీఆర్ టోపీ పెట్టుకుని వచ్చిండు.. ప్రజలకు టోపీ పెట్టి పోయిండు. ఇన్నాళ్లు 4గురు ఎమ్మెల్యేలను ప్రగతి భవన్ లో గంప కింద కోడిలాగా కప్పిపెట్టిండు... యాడ పారిపోతరో.. నిజాలు ఎక్కడ బయటపడతాయోనని... సర్కస్ లో, జూలో జంతువులను పట్టుకొచ్చినట్లుగా ఇయాళ సభకు తీసుకొచ్చి మళ్లీ వెంట బెట్టుకుపోయిండు..
• వంద కోట్లు పెట్టి ఆ ఎమ్మెల్యేలను కొంటారట.. వాళ్లు ఆణిముత్యాలట... వాళ్లంతా సెకండ్ హ్యాండ్ గాళ్లు... ఇతర పార్టీల నుండి గెలిచి టీఆర్ఎస్ కు అమ్ముడుపోయినోళ్లు... అసలా ఎమ్మెల్యేలను స్వేచ్ఛగా ఎందుకు వదిలేయడం లేదు?
• సీబీఐ విచారణ జరగకుండా 51 జీవో ఎందుకు తీసుకొచ్చినవ్? అంత భయమెందుకు? తప్పు చేయకుంటే విచారణ జరిపించాలి కదా....
• గత 8 ఏండ్లలో 36 కాదు.. 37 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువు లెక్క కొన్నది నువ్వు. ప్రతి ఏటా వడ్లు కొనేది ముమ్మాటికీ కేంద్రమే. పైసలిచ్చేది కేంద్రమే... కేసీఆర్ మాత్రం సంతలో పశువుల లెక్క ఎమ్మెల్యేలను కొంటున్నడు..
• వడ్లు కేంద్రం కొనడం లేదు... కేంద్రం పైసలియ్యడం లేదని దమ్ముంటే ప్రమాణం చెయ్...మోటార్లకు మీటర్లట.. యాడ పెట్టినం? దుబ్బాకలో, హుజూరాబాద్ లో పెట్టినమా? మేం గెలిచిన చోట ఏమైనా పెట్టినమా?
• మోటార్లకు మీటర్ల సాకుతో మునుగోడు ఎన్నికల తరువాత కరెంట్ ఛార్జీలను కేసీఆర్ మళ్లీ పెంచబోతున్నడు. ఎందుకంటే 70 వేల కోట్ల నష్టాల్లో విద్యుత్ సంస్థలున్నయ్. జీతాలిచ్చే పరిస్థితి లేదు. వాటికి కారణం ముమ్మాటికీ కేసీఆరే...
• 24 గంటలు కరెంట్ ఇస్తున్ననని గప్పాలు కొడుతుండు.. ఈరోజు మర్రిగూడలో 10 సార్లు కరెంట్ కట్ అయ్యింది. అయినా పచ్చి అబద్దాలు వల్లిస్తుండు..
• బిడ్డ లిక్కర్ కేసు.. కొడుకు డ్రగ్స్ కేసు... టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అమ్ముడుపోయిండ్రు... మంత్రుల ఉంటారో ఉండరో నిత్యం అనుమానమే... సీఎం సీటు కోసం నిత్యం ఇంట్ల గోడవ... ఇవన్నీ దారి మళ్లించేందుకే కేసీఆర్ డ్రామాలు..
• గాడిదకు గడ్డి వేసి బర్రె పాలియ్యమంటే ఇస్తదా? అన్నవ్ కదా... అవును.. గాడిద ఎవరో.. ఆవు ఎవరో ప్రజలకు తెలిసిపోయింది. మీలాంటి గాడిదలకు ఓటేయబోమని మునుగోడు ప్రజలు డిసైడ్ అయ్యారు.
• మొన్నటి దాకా కమ్యూనిస్టులు తోకపార్టీలు... సూది దబ్బడం పార్టీలన్నడు.. ఇయాళ కేసీఆర్ కు ప్రగతి శీల శక్తులని చెబుతుండు..
• కమ్యూనిస్టు కార్యకర్తలు వేదనకు గురైతున్నరు. కమ్యూనిస్టు సిద్దాంతాలను కేసీఆర్ కాళ్ల ముందు పెట్టారు. నిన్నటిదాకా ఇండ్ల కోసం, ఉద్యోగాల కోసం, రైతుల కోసం, ఎస్టీఎస్సీ సమస్యలపై కమ్యూనిస్టు కార్యకర్తలు కొట్లాడినరు... మరి ఇయాళ అవన్నీ వచ్చినయా? మరి దేని కోసం టీఆర్ఎస్ కు మద్దుతు ఎందుకు ఇస్తున్నరు? ఎన్ని వేల కోట్లు ముట్టజెప్పితే మద్దతు తెలిపారు? నిన్నటి దాకా కమ్యూనిస్టులు టీఆర్ఎస్ ను శత్రువుగా చూసి... ఇయాళ ఎందుకు మిత్రుడు అయ్యారు? నిన్నటిదాకా పోరాటాలు చేసిన కేసులపాలైన కమ్యూనిస్టు కార్యకర్తల పరిస్తితి ఏంది? అందుకే కమ్యూనిస్టు కార్యకర్తలు ఈసారి టీఆర్ఎస్ కు ఓటేయబోమని చెబుతున్నరు..
• పొరపాటున టీఆర్ఎస్ కు కమ్యూనిస్టులు ఓట్లేస్తే... ప్రజలు నిలదీస్తారు. రుణమాఫీ కాలేదు.. కేసీఆర్ ఇచ్చిన హామీలేవీ అమలు చేయలేదు? ఉద్యోగాలియ్యలేదు... ఎందుకు మద్దతిచ్చారని నిలదీస్తారు..కమ్యూనిస్టు జెండాలు వెలిసిపోయినయ్...
• ఈ ఎన్నికలు ఇద్దరు అభ్యర్థుల మధ్య జరుగుతున్న పోటీ... ఆ ఇద్దరిలో ఎవరు బెటరో బేరీజు వేసుకోండి... టీఆర్ఎస్ అభ్యర్ధి ఎట్లాంటోడో... స్ర్కిప్ట్ రాసిస్తే తప్ప మాట్లాడలేనోడు..
• తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నడు ఇన్నాళ్లు... ఇగ దేశం మీద పడి దోచుకుంటడ... మునుగోడు ఫలితాలు బీఆర్ఎస్ కు పునాది రాయి అయితదని కేసీఆర్ అంటున్నడు... మునుగోడు ఫలితాలే బీఆర్ఎస్ కు సమాధి రాయి కాబోతోంది.
• ఎవరైనా తప్పు చేసినోడు తడిబట్టలతో యాదాద్రి వెళ్లి ప్రమాణం చేసే దమ్ముందా? ... మా నిజాయితీని నిరూపించుకోవడానికే తడిబట్టలతో ప్రమాణం చేసినవ్.... కేసీఆర్ కు నిజాయితీ లేదు... కుట్రలు చేస్తావు కాబట్టే ప్రమాణం చేయడానిక రాలేదు.. కేసీఆర్ తప్పు చేసిండు కాబట్టే.. సీబీఐ ఎంక్వేరీకి ఒప్పుకోవడం లేదు.
• మునుగోడు ప్రజలకు ఇచ్చిన హామీల గురించి మాట్లాడకుండా పారిపోయిన కేసీఆర్...
• టీఆర్ఎస్ కు టీఎన్జీవో నాయకులు మద్దతివ్వడం సిగ్గుచేటు.. ప్రమోషన్ల కోసం, పైరవీల కోసం సిగ్గులేకుండా ఆ నాయకులు మద్దతిస్తున్నరు. ఉద్యోగాలకు జీతాలే ఇయ్యనందుకు మద్దతు చెబుతున్నరా? 317 జీవో పేరుతో చెట్టుకొకరు పుట్టకొకరిని చేసినందుకా? ఉద్యోగులను రాచి రంపాన పెడుతున్నందుకా? దేనికి మద్దతు తెలుపుతున్నరు.. టీఆర్ఎస్ కు మద్దతిచ్చిన ఆ కొందరు టీఎన్జీవో నాయకులపై కేసులు పెట్టాలే...
• పెట్రోలు, డీజిల్ ధరల గురించి మాట్లాడుతున్న కేసీఆర్.... వ్యాట్ పేరుతో లీటర్ పెట్రోలుపై రూ.30లు ఎందుకు దొబ్బుతున్నవ్. వ్యాట్ పేరుతో ఏటా రూ.10 వేల కోట్లు ఎందుకు దోచుకుంటున్నవ్? నిజంగా ప్రజలపై ప్రేమ ఉంటే ఎందుకు తగ్గించవు?
Comments
Post a Comment