,*చరిత్రలో సువర్ణావకాశం మీదే.. కేసీఆర్*


 *చరిత్రలో సువర్ణావకాశం మీదే.. కేసీఆర్*

బీఆర్ ఎస్ పార్టీకి పునాదిరాయి పెట్టింది మునుగోడు. మీరే ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలి. దేశం బాగుపడాలంటే మీరు అడుగు ముందుకేయాలి. మునుగోడును గుండెల్లో పెట్టుకుంటా. దేశంలో జరిగే పోరాటంలో మీరే పునాది రాయి వేయాలి. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తవాలి. ఎనిమిదేళ్ళయినా మా నీళ్ళు చూపడానికి, మా వాటా ఎప్పుడిస్తావు? నేను మహా మొండి. వంద పడకల ఆస్పత్రి, చండూరు రెవిన్యూ డివిజన్ ఇస్తా. ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తే 15 రోజుల్లో మీ కోరిక నెరవేరుస్తా. ప్రజల్లో ఉండే మనిషిని ఓడించి.. రాజగోపాల్ రెడ్డిని 2018లో గెలిపించారు. గొడ్డలిని గెలిపించారు అభివృద్ది లేదు. రోడ్లన్నీ బాగుచేస్తా. గెలిచినవారు పత్తా లేరు. కష్టానికి వచ్చారు. ఆయన్ని గెలిపించండి

*ఉప ఎన్నిక ఫలితం కూడా తేల్చేశారు-సీఎం కేసీఆర్*


మునుగోడులో అవసరం లేకుండా ఎన్నిక వచ్చింది. ఉప ఎన్నిక ఫలితం కూడా తేల్చేశారు. ఆ విషయం కూడా నాకు తెలుసు. గత 20 రోజులుగా ఎన్నో చర్చలు జరిగాయి. న్యాయం ఏందో... ధర్మం ఏంటో మీకు తెలుసు. నాలుగు విషయాలు మీకు చెబుతాను. ఎన్నికలు వస్తాయి.. అనేక రకాలుగా వస్తాయి. ఎన్నిక రాగానే గాయి.. గాయి గత్తర్... గత్తర్ లొల్లి.. లొల్లి.. కొందరు గాల్లోనే నడుస్తుంటారు. విచిత్ర వేషధారులు వస్తారన్నారు కేసీఆర

*ఓటు వేసేటప్పుడు జాగ్రత్తగా వేయాలి-కేసీఆర్*


ఎవరు చెప్పిన మాటలైనా విని ఇంటికెళ్లి ఆలోచించండి. ఓటు శక్తివంతమయిన ఆయుధం. అలవోకగా, ఒళ్ళు మరిచిపోయి వేస్తే ఇల్లు కాలిపోతాది. సమాజానికి అవసరం ఏది అని ఆలోచించాలి. మన బతుకులు బాగుపడతాయి. నల్లగొండ బాగుపడుతుంది. తమాషాగా ఓటేయవద్దు. మర్యాద చేశారని, బావమరిది చెప్పారని ఓటు వేయవద్దు. కరిచే పాము అని తెలిసి ఓటేస్తామా? గ్రామంలో పెద్దలు ఆలోచించాలి. ఓటు వేసేటప్పుడు జాగ్రత్తగా వేయాలి.

*ఒళ్లు మ‌రిచి ఓటేస్తే.. ఇల్లు కాలిపోత‌ది : సీఎం కేసీఆర్*      


ఓటు అనేది మ‌న త‌ల రాత రాసుకునే గొప్ప ఆయుధం. అది అల‌వోక‌గా వేస్తే, ఒళ్లు మ‌రిచి ఓటేస్తే.. ఇల్లు కాలిపోత‌ది. చాలా జాగ్ర‌త్త‌గా ఆలోచించి.. మంచి, చెడు ఆలోచించి వేయాలి. బ‌తుకులు, మునుగోడు బాగుప‌డుతాయి. తెలంగాణ‌, భార‌త‌దేశం కూడా బాగుప‌డ్త‌ది. ఎవ‌రో చెప్పార‌ని, మ‌ర్యాద చేశార‌ని, డ్యాన్స్ చేస్తే మంచిగ అనిపించింద‌ని ఓటేస్తే ప్ర‌మాదం వ‌స్త‌ది అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. చండూరు మండ‌లం బంగారిగడ్డ‌లో నిర్వ‌హించిన టీఆర్ఎస్ పార్టీ బ‌హిరంగ స‌భ‌లో కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు.


ఈ మునుగోడు ఉప ఎన్నిక అవ‌స‌రం లేకుండానే వ‌చ్చింది. ఈ ఉప ఎన్నిక ఫ‌లితం ఎప్పుడో తేల్చేశారు అది కూడా తెలుసు. నేను కొత్త‌గా చెప్ప‌డానికి ఏం లేదు. మీకు అన్ని విష‌యాలు తెలుసు. ఒక నాలుగు విష‌యాలు చెప్పాల‌ని చెప్పి ఇక్క‌డికి వ‌చ్చాను. ఎల‌క్ష‌న్లు వ‌స్తాయి. ఎన్నిక‌లు రాగానే ఏందో ఏమో మాయ‌రోగం ప‌ట్టుకుంటుంది. గ‌త్త‌ర గ‌త్త‌ర లొల్లి లొల్లి ఉంట‌ది. కొంద‌రైతే గ‌జం ఎత్తున గాల్లోనే న‌డుస్తున్నారు. విచిత్ర వేషాధారులు, అనేక పార్టీలు వ‌స్తాయి. ప్ర‌జ‌ల‌కు మ‌న‌కెందుకు ఉండాలి.


నేను చెప్పిన మాట‌లు జాగ్ర‌త్త‌గా వినండి. చేతులెత్తి దండం పెట్టి చెబుతున్నాను. ఈ మాట‌ల‌ను ఇక్క‌డ‌నే వ‌దిలేసి వెళ్లిపోవ‌ద్దు. మీ ఊరెళ్లిన త‌ర్వాత చ‌ర్చ చేసి నిజ‌నిజాలు తేల్చాలి. ఓటు అనేది మ‌న త‌ల రాత రాసుకునే గొప్ప ఆయుధం. అది అల‌వోక‌గా వేస్తే.. ఒళ్లు మ‌రిచి ఓటేస్తే.. ఇల్లు కాలిపోత‌ది. చాలా జాగ్ర‌త్త‌గా ఆలోచించి.. మంచి, చెడు ఆలోచించి వేయాలి. బ‌తుకులు, మునుగోడు బాగుప‌డుతాయి. తెలంగాణ‌, భార‌త‌దేశం కూడా బాగుప‌డ్త‌ది. ఎవ‌రో చెప్పార‌ని, మ‌ర్యాద చేశార‌ని, డ్యాన్స్ చేస్తే మంచిగ అనిపించింద‌ని ఓటేస్తే ప్ర‌మాదం వ‌స్త‌ది.


దేశంలో ఉన్న‌ది ప్ర‌జాస్వామ్యం. ఈ దేశంలో ఏం జ‌రుగుతుందో మ‌న‌సు విప్పి ఆలోచించాలి. ఓటు వేసేట‌ప్పుడు చాలా జాగ్ర‌త్త‌గా ఆలోచించాలి. క‌రిచే పాము అని చెప్పి మెడ‌లో వేసుకుంటామా? ఆలోచించాలి. దేశంలో చైత‌న్యం రానంత వ‌ర‌కు దుర్మార్గ రాజ‌కీయాలు కొన‌సాగుతాయి. దోపిడీదారులు మాయ‌మాట‌లు చెప్పి మోసం చేస్తారని కేసీఆర్ సూచించారు.


*మాయలో పడితే మంచి జరగదు-కేసీఆర్*

మనం పండ్లు తినాలంటే.. పండ్ల చెట్లు పెట్టాలి. ఓటు వేసేటప్పుడు ఆలోచించాలి. గాడిదలు గడ్డి వేస్తే.. ఆవుల నుంచి పాలు రావు. గడ్డి వేసేటప్పుడే ఆలోచించాలి. యుద్ధం చేయాలి. దేశంలో ఏ ప్రధాని చేయని దుర్మార్గం. చేనేతలపై భారం వేశారు. ఏ విధంగా బీజేపీకి ఓటువేయాలి. ఆషామాషీగా తీసుకోకూడదు. అన్నంలో సగం లాక్కుంటా.. నాకే ఓటు వేయి అంటే ఓటు వేస్తా. మన వేలితో మన కన్ను పొడుచుకుందామా? పోరాటం అంటే ప్రదర్శనలు చేస్తాం. భవిష్యత్తులో కూడా వామపక్షాలతో కలిసి నడుస్తాం. నీ వేలితో నీ కన్ను పొడుస్తా అంటే బీజేపీకి ఓటు వేస్తారా? అంతా గుండెలమీద చేయి వేసుకుని ఆలోచించాలి. జీఎస్టీ వాపసు తీసుకోవాలంటే.. చేనేతలు ఒక్క ఓటు కూడా బీజేపీకి వేయవద్దు.


 *మీటర్లు పెట్టి కొంపలు ఆర్పుకుందామా?-కేసీఆర్*

దేశంలో పెట్టుబడిదారులకు అనుకూలంగా కేంద్రం మోసం చేస్తోంది. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతామంటారు. మీటరు ధర వారే నిర్ణయిస్తారు. మోడీ బయటపెట్టిన సర్క్యులర్ వచ్చింది. మీటర్లు కావాలా? మోసపోతే నష్టపోతాం. ఎన్నికలలో వారిని నమ్మితే మోసాలకు గురి అవుతాం. మీకు దండం పెడుతున్నా. మనం ధర్మం వైపు నిలబడాలి. ప్రైవేటీకరణకు మొగ్గు చూపితే నష్టం మనకే. మీ బలం చూసి కొట్లాడుతాం. మీరే మా బలం. మీరు సహకరించకపోతే ఏం చేయగలం. మునుగోడులో మీరు వారికి ఓటేస్తే.. నన్ను పక్కకు జరిపేస్తారు. కేసీఆర్ ని పడగొట్టి తెలంగాణను కబ్జా పెడతామని రంగంలోకి వచ్చారు. ఈ దేశంలో కరెంట్ వున్నా ప్రజలకు రాదు

 *భయంకర కుట్ర జరుగుతోంది-కేసీఆర్*

దేశంలో భయంకర కుట్ర జరుగుతోంది. దేశంలో కుట్రను మనం భగ్నం చేయాలి. కీలెరిగి వాత పెట్టాలి. నష్టపోయేది, కష్టపడేది మనమే. మీటర్లు పెట్టకుండా చూడాలి. మునుగోడు నీళ్ళ గోస తీరిందా? ఫ్లోరైడ్ సమస్య తీర్చాలని వాజ్ పేయిని కలిశారు. సమస్య తీర్చలేదు. మునుగోడులో అనేక మండలాలు తిరిగా. మనలో చైతన్యం కోసం పాట రాశా.. చూడు చూడు నల్లగొండ.. నల్లగొండకు నరకం చూపిన జెండాలు ఎన్నో. అలాంటి జెండాలు గుర్తుపట్టాలి. హంసలా పాలకు పాలు, నీళ్ళకు నీళ్ళు వేరుచేయాలి. ప్రజల్లో అమాయకత్వం వుంటుందో దుర్మార్గుల ఆటలు సాగుతాయి. ఒళ్ళు మరిచి ఓటు వేసి ఇళ్ళు కాల్చుకోవద్దు. దేశం వంచించబడుతోంది. కేంద్రం విధానం వల్ల నీళ్లు రావు, కరెంట్ రాదు


 *చరిత్రలో సువర్ణావకాశం మీదే.. కేసీఆర్*

బీఆర్ ఎస్ పార్టీకి పునాదిరాయి పెట్టింది మునుగోడు. మీరే ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలి. దేశం బాగుపడాలంటే మీరు అడుగు ముందుకేయాలి. మునుగోడును గుండెల్లో పెట్టుకుంటా. దేశంలో జరిగే పోరాటంలో మీరే పునాది రాయి వేయాలి. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తవాలి. ఎనిమిదేళ్ళయినా మా నీళ్ళు చూపడానికి, మా వాటా ఎప్పుడిస్తావు? నేను మహా మొండి. వంద పడకల ఆస్పత్రి, చండూరు రెవిన్యూ డివిజన్ ఇస్తా. ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తే 15 రోజుల్లో మీ కోరిక నెరవేరుస్తా. ప్రజల్లో ఉండే మనిషిని ఓడించి.. రాజగోపాల్ రెడ్డిని 2018లో గెలిపించారు. గొడ్డలిని గెలిపించారు అభివృద్ది లేదు. రోడ్లన్నీ బాగుచేస్తా. గెలిచినవారు పత్తా లేరు. కష్టానికి వచ్చారు. ఆయన్ని గెలిపించండి


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్