రైస్ మిల్లులో సి ఎమ్ ఆర్ ధాన్యం ఉందా దారి మళ్లిందా? తేల్చడానికి 10 మెన్ కమిటీ?
రైస్ మిల్లులో సి ఎమ్ ఆర్ ధాన్యం ఉందా దారి మళ్లిందా? తేల్చడానికి 10 మెన్ కమిటీ?
నల్గొండ జిల్లా:
రైసె మిల్లులో సి ఎమ్ ఆర్ ధాన్యం ఉందా దారి మళ్లిందా? అనే విషయాన్ని తేల్చడానికి 10 మెన్ కమిటీ ఏర్పాటు చేసినట్లు సమాచారం. నల్గొండ జిల్లా లో ఓ నాలుగు రైస్ మిల్లు లు గత సీజన్ లో ప్రభుత్వం తమ మిల్లులు పంపిన దాదాపు 100 కోట్ల రూపాయల విలువ గల సి ఎమ్ ఆర్ ధాన్యాన్ని దారి మళ్లించి ఎక్స్పోర్ట్ కంపెనీకి అమ్ముకున్నారని ఓ న్యాయవాది ఫిర్యాదు చేస్తూ, ఆ మిల్లుల ను తనిఖీ చేయాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిసింది. ఆ ఫిర్యాదు పై జిల్లా యంత్రాంగం కొంత మంది అధికారులతో ఇన్స్పెక్షన్ చేయడానికి ఓ కమిటీ వేసింది. ఇది తెలుసుకున్న సదరు మిల్లర్లు రాజకీయ వత్తిడి తేవడం తో అధికారులు ఆ ఫైల్ ను ప్రక్కకు పెట్టినట్లు తెలుస్తోంది. దాంతో ఫిర్యాదు దారుడు కోర్టు కు వెళ్లి చర్యలకు అర్దరు తెచ్చినట్లు వినికిడి. ఈ విషయం పై ఆర్టీఐ ధరకాస్తులు రావడం, మీడియాలో వార్తలు రావడం తో జిల్లా ఉన్నతాధికారులు ఓ పది మందితో మరో కమిటీ ని పకడ్బందీగా తనిఖీ చేసి సి ఎమ్ ఆర్ ధాన్యం మిల్లులో ఉన్నదా లేక దారి మలిందా అనే విషయాన్ని నిగ్గు తేల్చడానికి సమయావత్తం ఆయునట్లు సమాచారం. అయితే సదరు మిల్లర్లు అధికారులతో తనిఖీలో జాప్యం జరగడానికి సంప్రదింపులు చేసి, మళ్లించిన ధాన్యానికి సరిపడు ధాన్యాన్ని వివిధ ప్రాంతాల నుండి తెప్పిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆగ మేఘాల మీద ధాన్యాన్ని ఎక్కువ ధరకు కొంటుండం తో ఆ మిల్లర్ల కు భారీ నష్టం కూడా వచ్చే అవకాశం ఉంది. ఆ ఫిర్యాదు దారుడు ఈ సీజన్ లో సదరు మిల్లర్లు కు సి ఎమ్ ఆర్ ధాన్యం ఇవ్వవద్దని వందల పేజీలు సాక్షాల తో ఫిర్యాదు చేయడం కొసమెరుపు.
Comments
Post a Comment