*ప్రజావాణికి 60 ఫిర్యాదులు*
*ప్రజావాణికి 60 ఫిర్యాదులు*
నల్గొండ, నవంబర్ 21 : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ భాస్కరరావు అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 60 ఫిర్యాదులు అందాయి. కాగా, అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
సహాయ సంచాలకులు, జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం,నల్గొండ సౌజన్యంతో
Comments
Post a Comment