ప్రవేట్ స్కూల్లు కాలేజీల యాజమాన్యం తాయిలాలకు ఆశపడి స్కూళ్లను, కాలేజీలను పర్యవేక్షించని అధికారులు- BJYM అధ్యక్షులు అయితరాజు సిద్దు
ప్రవేట్ స్కూల్లు కాలేజీల యాజమాన్యం తాయిలాలకు ఆశపడి స్కూళ్లను, కాలేజీలను పర్యవేక్షించని అధికారులు- BJYM అధ్యక్షులు అయితరాజు సిద్దు
నల్గొండ: ప్రవేట్ స్కూల్లు కాలేజీల యాజమాన్యం ఇచ్చే తాయిలాలకు ఆశపడి స్కూళ్లను, కాలేజీలను అధికారులు
పర్యవేక్షించడం లేదని BJYM అధ్యక్షులు అయితరాజు సిద్దు ఆరోపించారు. ఆయా స్కూల్లో, కాలేజీలో చదువుతున్నటువంటి విద్యార్థులకు సరిపడా మరుగుదొడ్లు లేవు ఉన్నటువంటి మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉన్నాయి విద్యార్థులు తాగడానికి ఎక్కడ కూడా మంచినీటి వ్యవస్థ లేదు బోధన విషయంలోకొస్తే సరైన అనుభవం ఉన్నటువంటి ఉపాధ్యాయులు లేరు కనీసం డిగ్రీ కూడా లేనటువంటి వ్యక్తులను ఉపాధ్యాయులుగా నియమించుకొని కాలం వెళ్లదీస్తున్నారు విద్యార్థులకు మంచి బోధన అందక చదువులలో ఉత్తీర్ణత రాణించలేకపోతున్నారు వేలకు వేల రూపాయలు విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల ముక్కు పిండి వసూలు చేస్తున్నారు కానీ సరైన భోదన లేదు, సరైన సౌకర్యాలు లేవు మరి నల్లగొండ జిల్లా అదికారులు స్కూల్లను, కాలేజీలను ఎందుకు పర్యవేక్షించట్లేదని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నామని అన్నారు. వివిధ కల్చరల్ ప్రోగ్రామ్ ల పేరు మీద విద్యార్థుల దగ్గర డబ్బులు వసూలు చేయడం వలన తలిదండ్రుల మీద బారం పడుతుంది ,స్కూల్ లకు కాలేజీలకు సంబంధించినటువంటి ఫీజులు చెల్లిస్తేనే పరీక్ష ఫీజులు తీసుకుంటామని చెప్పేసి కొత్త నిబంధనలతో విద్యార్థుల యొక్క తల్లిదండ్రులను వేధింపులకు గురి చేస్తున్నారని, మరి స్కూల్ లలో కాలేజీలలో ఇలాంటి దురక్రమాలకు పాల్పడుతున్న ఈ జిల్లాకు సంబంధించినటువంటి అధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారని అని విద్యార్థుల తల్లిదండ్రులు అవేదన్ చెందుతున్నారని పేర్కొన్నారు. చలి కాలంలో స్కూల్ లలో, కాలేజీలలో పరిశుభ్రత పాటించకపోవడంతో విద్యార్థులు వివిధ రోగాలకు గురవుతూన్నారని నల్లగొండలో ఉన్నటువంటి ప్రవేట్ స్కూల్లోనూ కాలేజీలను తనిఖీ చేసి ఆయా యజమానులపై చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను డిమాండ్ చేస్తున్నామని, లేని పక్షంలో డి ఈ ఓ,మరియు ఆర్. ఐ. ఓ కార్యాలయాలను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు.
Comments
Post a Comment