ఐటీ రైడ్స్ లో సీజ్ చేసిన అమౌంట్
ఐటీ రైడ్స్ లో సీజ్ చేసిన అమౌంట్
Seized amount total : (Approx) ₹10.74 Cr
Mallareddy residence :
Mahender reddy residence : 12 lakhs
Badra reddy residence : 6lakhs
Rajashekar reddy residence : ₹3 cr
Sudheer reddy residence : ₹2.50 cr
Raghunandan Residence : ₹2 cr
Praveen reddy residence : ₹1 cr
Trishul reddy residence : ₹2 cr
తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఇంటిలో ఐటీ సోదాలు ముగిశాయి. రెండు రోజుల పాటూ 65 ఐటీ టీమ్‌లు.. 400మంది అధికారులు ఈ సోదాల్లో పాల్గొన్నారు. ఈ సోదాల్లో రూ.10కోట్ల 50 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే సోదాలు ముగిసిన తర్వాత సోమవారం ఐటీ విచారణకు రావాలని మల్లారెడ్డికి నోటీసులు ఇచ్చారు. ఐటీ అధికారులు మంత్రి మల్లారెడ్డి విద్యాసంస్థల్లో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నట్టు ప్రాథమికంగా గుర్తించినట్లు ఐటీ వర్గాలు చెబుతున్నాయి. ఈ తనిఖీల తర్వాత ఐటీ అధికారులు పంచనామాపై సంతకాలు తీసుకునేందుకు మూడు గంటల పాటూ అక్కడే ఉన్నారని సమాచారం. చివరికి మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి సంతకాలు తీసుకున్నారు. ఇంటి నుంచి ఆస్పత్రికి వెళ్లిన కుమారుడిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. తన కుమారుడితో బలవంతంగా సంతకం చేయించుకునే ప్రయత్నం చేశారని మంత్రి ఆరోపించారు.
ఆ తర్వాత ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లిన మంత్రి మల్లారెడ్డి ఐటీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. వారిలో రత్నాకర్ అనే అధికారిని బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రత్నాకర్‌ను అక్కడే ఉంచారు. ఆ తర్వాత ఐటీ అధికారులు పీఎస్‌కు వెళ్లారు. మల్లారెడ్డిపై దుండిగల్ పోలీస్ స్టేషన్‌లో ఐటీ అధికారులు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఇలా కొద్దిసేపు అక్కడ హైడ్రామా కనిపించగా.. తర్వాత ఆ వివాదం సద్దుమణిగింది. ఇటు మంత్రి మల్లారెడ్డితో పాటూ బంధువుల ఇళ్లలో సోదాలు ముగిసినా.. మంత్రి అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఇంట్లో మాత్రం ఐటీ తనిఖీలు కొనసాగుతున్నట్లు సమాచారం. మరోవైపు మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఇవాళ హైదరాబాద్ రానున్నారు.
Comments
Post a Comment