*అక్రమంగా భూములు కబ్జా చేసిన శాగం ఈశ్వరమ్మ పై విచారణ చేసి ఆర్ ఓ ఆర్ బుక్కులను వెంటనే రద్దు చేయాలి*


*అక్రమంగా భూములు కబ్జా చేసిన శాగం ఈశ్వరమ్మ పై విచారణ చేసి ఆర్ ఓ ఆర్ బుక్కులను వెంటనే రద్దు చేయాలి*


*నల్లగొండ : (గూఢచారి ప్రతినిధి) కలెక్టరేట్ గ్రీవెన్స్ లో ఈశ్వరమ్మ బాధిత రైతులు జెసి గారికి విన్నపం* నల్గొండ;21-11-2022; పెద్దవూర మండలం చలకుర్తి శివారులో గిరిజన పేద రైతుల భూములను అక్రమంగా కబ్జా చేసుకుని ఆరో ఆరులో పాస్ బుక్కులు తీసుకున్న ఈశ్వరమ్మ పై ప్రత్యేక విచారణ జరిపించి ఆరో వార్ పాస్బుక్కులను వెంటనే రద్దు చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కూన్ రెడ్డి నాగిరెడ్డి, తెలంగాణ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి కొర్ర శంకర్ నాయక్, కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి sk బషీర్ లు అన్నారు


సోమవారం నల్లగొండ కలెక్టరేట్ గ్రీవెన్స్ డే లో ఈశ్వరమ్మ బాధిత రైతులతో కలిసి జేసి గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది


ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 100 ఎకరాలు ఉన్న శాగం ఈశ్వరమ్మకు 42ఎకరాలకు ROR లో భూమి పట్టాలు ఎలా వచ్చాయని ఆరో వారి పట్టా పాస్బుక్ లోకి సహకరించిన రెవెన్యూ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మరియూ ROR లొ ఏకించుకున్న పట్టాలను వెంటనే రద్దు చేసి అర్హులైన పేద గిరిజన రైతులకు ఇవ్వాలి అని అన్నారు గత కొన్ని సంవత్సరాల నుంచి అనేక కార్యక్రమాలు వినతిపత్రాలు ఇస్తున్న వారి సమస్య పరిష్కారం కావడం లేదని అన్నారు అదేవిధంగా పెద్దవుర మండలం పర్వేదుల గ్రామంలోని పేద రైతులకు సుమారు 42 ఎకరాల భూమికి ఇప్పటికీ పట్టాలు రాలేదని వెంటనే పట్టాలు ఇప్పించాలని జెసి గారిని కోరారు


ఈ కార్యక్రమంలో తెలంగాణ గిరిజన సంఘం జిల్లా కమిటీ సభ్యులు రమావత్ నరేష్ నాయక్ ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ నాయకులు రమావత్ మల్లికార్జున్ రమావత్ శ్రీను రైతులు గ్యామ లాలు పీలు బిక్షం రెడ్డి నాగార్జున రెడ్డి జ్యోతి రెడ్డి రాజు రవీందర్ తదితరులు పాల్గొన్నారు

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్