ఎల్ఐసిని నిర్వీర్యం చేసేందుకు మోడీ కుట్ర - ఎమ్మెల్యే కంచర్ల
ఎల్ఐసిని నిర్వీర్యం చేసేందుకు మోడీ కుట్ర - ఎమ్మెల్యే కంచర్ల
నల్గొండ : (గూఢచారి ప్రతినిధి) దేశవ్యాప్తంగా 40 కోట్ల మంది పాలసీ హోల్డర్లు ఉన్న ఎల్ఐసి ని ప్రధాని నరేంద్ర మోడీ నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తున్నాడ ని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆరోపించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవన్లో నిర్వహించిన ఎల్ఐసి ఏ ఓ ఐ జిల్లా 5వ మహాసభలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆదాని, అంబానీలకు మేలు చేసే విధంగా దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పూనుకుందన్నారు. సీఎం కేసీఆర్ ఎల్ఐసి ప్రైవేటీకరణను తీవ్రంగా ఖండించినట్లు గుర్తు చేశారు. రాష్ట్రంలో అమలవుతున్న ప్రతిష్టాత్మక రైతు బీమాను ఎల్ఐసి తో అనుసంధానం చేసి వారం రోజుల్లో మృతులకు డబ్బులు అందే విధంగా ముఖ్యమంత్రి చొరవ తీసుకోవడం మంచి పరిణామం అన్నారు. 43 లక్షల కోట్ల ఆస్తులు ఉన్న అతిపెద్ద భీమా రంగ సంస్థను నిర్వీర్యం చేసి ప్రైవేటు భీమా రంగ సంస్థలకు లాభం చేకూర్చే విధంగా కమిషన్లకు కక్కుర్తి పడి వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క ఎల్ఐసి ఏజెంట్ 1000 మందిని ప్రభావితం చేయగలరన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఆపద సమయంలో అప్పులిచ్చే సంస్థ అన్నారు. కార్యక్రమంలో ఎల్ఐసి ఏఓఐ జోనల్ అధ్యక్షుడు మంజునాథ్, రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి, ఐసీఈయూ జోనల్ సహాయ కార్యదర్శి తిరుపతయ్య, కొయ్యడ రామయ్య, ఎల్ఐసి ఏఓఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి నలపరాజు సైదులు, జోనల్ నాయకులు ఎస్ వి ఎన్ రెడ్డి, అధ్యక్షుడు నారీ నరసింహ, సంఘం నాయకులు ఖాసిం, మోహన్ రెడ్డి, ధనుంజయ రావు, సో మిరెడ్డి, సైదులు, శివ శంకర్, దేవేందర్, ఎలేంద్ర, వెంకన్న, కవిత, నాగమణి, పృద్వి తదితరులు పాల్గొన్నారు
Comments
Post a Comment