సూర్యాపేట జిల్లాలో బ్లాక్ లిస్టులో పెట్టాల్సిన మిల్లులకే కేటాయింపులు ఎక్కవట?
సూర్యాపేట జిల్లాలో బ్లాక్ లిస్టులో పెట్టాల్సిన మిల్లులకే కేటాయింపులు ఎక్కవట?
సూర్యాపేట: మద్దతు ధరకు రైతులు నుండి పర్చేసింగ్ సెంటర్ల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యం అలాట్ చేసిన మిల్లులకు మర అందించడానికి పంపుతారు. ప్రభుత్వ జీవో ప్రకారం గతం లో అలాట్ అయిన ధాన్యం బాపతు బియ్యం ప్రభుత్వానికి అప్పగించిన మిల్లులకు మాత్రమే అధికారులు తిరిగి అలాట్ మెంట్ చేయాలి. గత సీజన్ లలో కేటాయించిన ధాన్యానికి సంబంధించిన బియ్యం ప్రభుత్వానికి ఇవ్వకుండా డిఫాల్ట్ అయిన మిల్లులకు కేటాయింపులు జరగవద్దు. ఈ నిబంధన ప్రకారం సూర్యాపేట జిల్లాలో డిఫాల్ట్ అయిన మిల్లులను బ్లాక్ లిస్ట్ లో పెడుతున్నట్లు ప్రముఖుంగా వార్తలు కూడా వచ్చాయి. దాని విరుద్ధంగా డిఫాల్ట్ అయిన మిల్లులకు కూడా కేటాయింపులకు చేయడానికి కొందరు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. 2021 రబీ, ఖరీఫ్ సీజన్ లలో జిల్లాలో 8 మిల్లులు భారీగా డిఫాల్ట్ అయినవని. ఆ మిల్లులకు కూడా ఈ ఖరీఫ్ సీజన్ లో ధాన్యం కేటాయింపులు చేయడానికి కొందరి అధికారులు సిఫారసు చేస్తున్నట్లు గుసగుసలు వినపడుతున్నాయి. కోదాడలో రెండు మిల్లులు, సూర్యాపేటలో నాలుగు మిల్లులు, నేరడుచర్ల లో ఓ మిల్లు ముకుందాపురం లో ఓ మిల్లు 2021 రబీ లో మొత్తం దాదాపు 50 కోట్ల రూపాయల సిఎంఆర్ ధాన్యం పెట్టకుండా డిఫాల్ట్ అయినాయి. ఖరీఫ్ లో కూడా దాదాపు 260 కోట్ల మేరకు బియ్యం మిల్లులు పెట్టలేదు. అందులో ఎక్కువ బకాయి బడ్డ మిల్లులకే ఎక్కువ కేటాయింపులు జరుగుతున్నాయని కొందరు మిల్లర్లు వాపోతున్నారు. ఈ విషయం పై సివిల్ సప్లై అధికారులను సంప్రదించడానికి ప్రయత్నిస్తే వారి నుండి స్పందన లేదు. అన్ని జిల్లాలో ఉన్న మిల్లులకు వారి వారి కెపాసిటీ కి తగ్గట్టు సమానంగా అలాట్ మెంట్ చేస్తుంటే, ఈ జిల్లాలో అలా జరగక పోవడం తో పాటు దాదాపు 35 మిల్లులకు సి ఎమ్ ఆర్ కేటాయింపులు జరగక పోవడం అధికారులు పని తనానికి నిదర్శనం!
Comments
Post a Comment