అలాట్ మెంట్ లేని రైస్ మిల్లుకు ధాన్యం తరలింపు?
(ఫైల్ ఫొటో)
అలాట్ మెంట్ లేని రైస్ మిల్లుకు ధాన్యం తరలింపు?
నల్గొండ జిల్లాలో ప్రభుత్వం ఈ సీజన్ లో 200 పైగా ప్యాడి పర్చేసింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాల ద్వారా మద్దతు ధరకు రైతుల నుండి ధాన్యం కొనుగోలు కు అన్ని ఏర్పాటు చేసింది. ఆ సెంటర్ల నుండి కొనుగులు చేసినవి అలాట్ చేసిన మిల్లుల కు పంపిస్తూ వివరాలను ఏ ఏ రైతు నుండి కొనుగులు చేసినది, ఆ ధాన్యం ఏ ఏ మిల్లులు పంపింది అన్న సమాచారం జిల్లా సివిల్ సప్లై అధికారులకు పంపాలి. అయితే దానికి విరుద్ధంగా అలాట్ మెంట్ కానీ మిల్లు కు, ఓ సెంటర్ నుండి దాదాపు 25 లారీల కోటిన్నర విలువ గల వడ్లు ఓ అధికారి పంపినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని కప్పిపుచ్చు కోవడానికి ఆ అధికారి అలాట్ మెంట్ చేయని రైస్ మిల్లుకు అలాట్ మెంట్ ఇప్పించడానికి నానా ప్రయాస పడుతున్నట్లు , అలాట్ మెంట్ కానీ ఆ యజమానికి సహకరిస్తు రకరకాల ప్రయత్నాలు చేసుకొమ్మని సలహాలు ఇస్తున్నట్లు గుసగుసలు వినపడుతున్నాయి. రాజకీయ వత్తిడి, సంఘాల నుండి వత్తిడి తెచ్చి డిఫాల్టర్ అయిన రైస్ మిల్లులకు అలాట్ మెంట్ చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. ఈ విషయం పై డిఎం సివిల్ సప్లై అధికారిని మా ప్రతినిధి సంప్రదించగా ఈ విషయం పై జిల్లా సహకార అధికారిని సంప్ర దించమని తెలపడంతో వారిని వివరణ అడుగగా మా దృష్టికి రాలేదని, ఎంక్వరి చేస్తామని తెలిపారు
Comments
Post a Comment