స్టాంపు పేపర్లు అధిక ధరలకు విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి:-చికిలంమెట్ల అశోక్
*"స్టాంపు పేపర్లు అధిక ధరలకు విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి:-చికిలంమెట్ల అశోక్
*"ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా జ్యుడీషియల్ స్టాంప్ పేపర్లు విక్రయిస్తున్న వారిని గుర్తించి వారిపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు చి కి లం మెట్ల అశోక్ ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు.*
*సంక్షేమ పథకాల అమలు, విద్యార్థుల ఉపకార వేతనాలు, స్థిరాస్తి ఒప్పందాలు, ఆస్తుల రిజిస్ట్రేషన్ లో రుణాలు పొందేందుకు వీటి అవసరం ఉంటుంది కాబట్టి, వినియోగదారుల బలహీనతలను పసిగట్టి స్టాంపు వెండర్లు, స్టాంపు పేపర్లను విక్రయించాల్సిన ధరకు అధికంగా వసూలు చేస్తుండడంతో.. ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు.*
*వెంటనే సంబంధిత అధికారులు స్పందించి నిర్ణీత ధరకు స్టాంపు పేపర్లు విక్రయాలు జరిగే విధంగా చర్యలు చేపట్టాలని, పేదల అవసరాలను బలహీనతలుగా పసిగట్టి దోపిడీ చేస్తున్న వారి లైసెన్సులు రద్దు చేయాలని ఒక ప్రకటనలో అశోక్ డిమాండ్ చేశారు.*
Comments
Post a Comment