గూఢచారి ఎఫెక్టు తో సూర్యాపేట మిల్లుల పై యాక్షన్ ఫుల్ ! నల్గొండ లో యాక్షన్ నిల్? నల్గొండ అధికారుల పై రాజకీయ గ్రహణమా? లోపాయికారా ఒప్పందామా?

 

గూఢచారి ఎఫెక్టు తో

సూర్యాపేట  మిల్లుల పై యాక్షన్ ఫుల్ !

నల్గొండ లో యాక్షన్ నిల్?

నల్గొండ అధికారుల పై రాజకీయ గ్రహణమా?

లోపాయికారా ఒప్పందామా? - ప్రముఖ హై కోర్టు  అడ్వకేటు

 సోమవరపు సత్యనారాయణ

 నల్గొండ : (గూఢచారి),  రైతుల దగ్గర మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని  మిల్లు ఆడించి బియ్యాన్ని ప్రభుత్వానికి ఇవ్వడానికి  రైస్ మిల్లర్ల కు పంపుతారు. నల్గొండ, జిల్లాల్లో  కొందరు మిల్లర్లు గత 4 సీజన్ల నుండి వచ్చిన ధాన్యాన్ని ఆడించి  బియ్యాన్ని  ప్రభుత్వానికి ఇవ్వకుండా దారి మళ్లించిన్నట్లు అక్రమాలకు పాలుపడుతున్నట్లు హై కోర్టు అడ్వాకేటు సోమవరపు సత్యనారాయణ చేసిన  ఆరోపణల పై  మరియు సూర్యాపేట జిల్లా మిల్లులపై వస్తున్న ఆరోపణలపై  గూఢచారి వార్తల ద్వారా  విషయాన్ని వెలుగులోకి తెచ్చింది,

దీనితో పలు వార్త సంస్థలు కూడా దృష్టి సారించి  అక్రమాలను బహిర్గత పరిచాయి.

https://www.gudachari.page/2022/11/10.html

https://www.gudachari.page/2022/11/blog-post_71.html

https://www.gudachari.page/2022/11/blog-post_51.html





వార్తలు వచ్చిన  నేపథ్యంలో సూర్యాపేట  మిల్లుల పై యాక్షన్ ఫుల్  గా, నల్గొండ లో యాక్షన్ నిల్ గా ఉన్నదని నల్గొండ అధికారుల పై రాజకీయ గ్రహణమా? లోపాయికారా ఒప్పందామా? అని  అడ్వకేటు సత్యనారాయణ ప్రశ్నించారు. 

 సూర్యాపేట జిల్లా ఉన్నత అధికారి జోక్యం తో  అధికారాలు మిల్లులలో తనఖిలు నిర్వహించి కాపుగళ్ళు మిల్లులో 30 కోట్ల బియ్యం, ముకుందా పురం మిల్లులో 35 కోట్ల మేరకు బియ్యం మాయం అయ్యాయని తేల్చినట్లు పలు వార్త సంస్థలు వార్తలు  ప్రచురించాయి. 






https://youtu.be/yGKb4Mil7yQ

https://knowledgedailynews.com/capugallu-rice-mill-to-prevent-irregularities/

ఇంకా సూర్యాపేట మరియు    కోదాడ మిల్లులో  లెక్కతేల్చినట్లు లేదు.  వాటిలో కూడా దాదాపు 20 నుండి 30 కోట్ల వరకు లెక్క తేలాల్సి ఉంది.

 మరి నల్గొండ సంగతి దానికి విరుద్ధంగా వుందని బియ్యం దారి  మల్లినట్లు  వచ్చిన ఆరోపణలపై విజిలెన్స్ డిపార్ట్ మెంట్  సివిల్ సప్లై అధికారులకు  తనిఖీలు చేపట్టాలని లేఖ పంపిందని


దీనితో  అధికారులు తనిఖీ చేయుటకు కమిటీలు వేసారని

 కానీ కొందరి రాజకీయ జోక్యం తో  తనిఖీలు చేపట్టలేదని.  దానితో  హై కోర్టుకు కేసు వేసానని,  దీనితో తనిఖీల  చేయాలని  హైకోర్టు అర్దరు ఇచ్చిందని న్యాయ వాది పేర్కొన్నారు.


అంతే కాకుండా  80 కోట్ల  బియ్యం మాయమైనట్లు వార్త సంస్థలు  కూడా వార్తలు వ్రాసాయని, అయిన నల్గొండ జిల్లా అధికారులు ముందుకు సాగినట్లు కానీ,  అక్రమాల తనిఖీలు చేసినట్లు  మాత్రం సమాచారం లేదని ఆయన అన్నారు.   అలా చేయ కుండా డిఫాల్టర్  మిల్లులకే ధాన్యం కేటాయింపు జరుపుతున్నట్లు, అక్రమాలను ప్రోత్సహిస్తున్నట్లు ఫిర్యాదు చేసిన ఆ న్యాయవాది ఆరోపిస్తూన్నారు. అంతే కాకుండా అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదులపై ఈ సబ్జెక్ చూస్తున్న జాయింట్ కస్టడీయన్ లు అయిన నాయబ్ తహసీల్దార్ లను తనిఖీ కమిటీ లో వేయకూడదని, కానీ అధికారులు మాత్రం  సహజ  న్యాయ సూత్రాలకు విరుద్ధంగా వీరిని కూడా కమిటీలో వేశారని,

ఇప్పటికైనా జిల్లా ఉన్నత  అధికారి జోక్యం చేసుకొని అక్రమాలకు కళ్లెం వేసి ప్రభుత్వ సొమ్మును కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. 

ఈ విషయం పై జిల్లా ఇంఛార్జి డిఎస్వో ను మా ప్రతినిధి సంప్రదించగా   కమీషనర్  ఆదేశాల మేరకు కమిటీ సభ్యులు  తనిఖీలు  చేసి కమీషనర్ కు  రిపోర్టు  పంపామని తెలిపారు

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్