ఏసీబీ వలలో మున్సిపల్ కమీషనర్ మరియు మేనేజర్
ఏసీబీ వలలో మున్సిపల్ కమీషనర్ మరియు మేనేజర్
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపల్ కమీషనర్ సుభాష్ రావు దేశ్‌ముఖ్ మరియు మేనేజర్ మనోహర్ లు బుధవారం సాయంత్రం 4.30 లకు బాధితుడు నిసరుద్దీన్ నుండి అవుట్ సోర్సింగ్ ఉద్యోగి రాకేష్ ద్వారా 2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ కి పట్టుబడ్డారు. Md. నిసరుద్దీన్ కొనుగోలు చేసిన ఇంటి ని మ్యుటేషన్ చేసి మ్యూనిసిపల్ రికార్డు లో ఆయన పేరు ను మార్పుచేయడానికి 2 లక్షలు డిమాండ్ చేసి తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు వల పన్ని పట్టుకున్నారు. మున్సిపల్ కమీషనర్ సుభాష్ రావు దేశ్‌ముఖ్ , మేనేజర్ మనోహర్ మరియు అవుట్ సోర్సింగ్ ఉద్యోగి రాకేష్ లను అరెస్టు చేసి ఏసిబి కోర్టు న్యాయమూర్తి ముందు ప్రవేశ పెట్టి కేసును విచారణ చేస్తున్న అధికారులు. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం డిమాండ్ చేస్తే టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు కోరారు.
Comments
Post a Comment