మునుగోడులో మొదలైన యుద్ధం కేసీఆర్ ని గద్దె దింపే వరకు కొనసాగుతుంది - కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
మునుగోడులో మొదలైన యుద్ధం కేసీఆర్ ని గద్దె దింపే వరకు కొనసాగుతుంది - కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
నల్గొండ.....
మునుగోడు లో కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ప్రెస్ మీట్..
*రాజ్ గోపాల్ రెడ్డి కామెంట్స్....*
ఆయన మాటల్లో
మొన్న జరిగిన ఎన్నికల్లో నాకోసం అహర్నిశలు కష్టపడి... పోలీసులు ఎంత బెదిరించిన టిఆర్ఎస్ గుండాలు ఎంత దౌర్జన్యం చేసినా... ప్రభుత్వం ప్రలోభాలు పెట్టిన...నా గెలుపు కోసం కష్టపడ్డ ప్రతి నాయకునికి కార్యకర్తలకు ధన్యవాదాలు....
మొన్న మునుగోడు లో జరిగిన ఎన్నిక భారతదేశ చరిత్రలో కనివిని ఎరుగని ఎన్నిక
యుద్ధాన్ని తలపించేలా జరిగింది
నేను తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ నాతో పాటు ఎంతోమంది నడిచారు
మనం అనుకుంటున్నట్టు మునుగోడు నియోజకవర్గంలో ధర్మ యుద్ధం జరగలేదు
దుర్మార్గ ముఖ్యమంత్రి టిఆర్ఎస్ ప్రభుత్వం ఆధర్మయుద్ధంగా మార్చింది
అధికార దుర్వినియోగం చేసి కొద్ది తేడా తో గెలిచింది
వాళ్లు సాంకేతికంగా గెలిచినప్పటికీ...మునుగోడు ప్రజలు నైతికంగా నన్ను గెలిపించారు
150 మంది ప్రజాప్రతినిధులు గ్రామానికి ఒకటి చొప్పున ఉండి వత్తిడి తీసుకొచ్చి కొద్ది మెజారిటీతో గెలిచారు
నిజమైన గెలుపు కాదు
న్యాయంగా ధర్మంగా రాజగోపాల్ రెడ్డి గెలిచాడని సమాజం మొత్తం చెప్తుంది
యువకులు మహిళలు చాలా బాధపడుతున్నారు
ఈ మునుగోడులో యుద్ధం ఇంకా పూర్తి కాలేదు
మునుగోడులో మొదలైన యుద్ధం కేసీఆర్ ని గద్దె దింపే వరకు కొనసాగుతూనే ఉంటుంది
కుటుంబ పాలనకు చరమగీతం పాడే రోజు ముందే ఉంది
రాబోయే రోజుల్లో మరో ధర్మ యుద్ధం ఉంటుంది
భయపడి ఓడిపోయామని ఇంట్లో కూర్చునే ప్రసక్తి లేదు
మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా గొల్ల కురుమ సోదరులకు 7600 మందికి 1,58,000 చొప్పున ఎకౌంట్లో వేశారు
మీరే డబ్బులు వేసి మీరు ఎకౌంటు ఫ్రిజ్ చేశారు
*గెలిచిన తర్వాత గతంలో లాగానే గొర్ల పంపిణీ చేస్తాము నగదు బదిలీ ఇయ్యము అని చెప్తున్నారు*
*దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం*
కేవలం ఓట్ల కోసం గొల్ల కురుమ సోదరులు మోసం చేస్తున్నారు
గొల్ల కురుమ సోదరులు రోడ్ల మీదికి వచ్చి ప్రభుత్వ విధానాన్ని ఎండగట్టండి
ఈనెల 14న మునుగోడు నియోజకవర్గం లోని అన్ని మండల కేంద్రాలలో బిజెపి ఆధ్వర్యంలో గొల్ల కురుమ సోదరులు ఆందోళ ఉంటుంది
ఆందోళన ద్వారా వ్యతిరేకతను తెలియజేయాలని నిర్ణయించుకున్నాం
ఉప ఎన్నికలో ఇచ్చిన హామీల పనులు వెంటనే మొదలుపెట్టాలి
మున్సిపాలిటీలకు నిధులు విడుదల చేసి అభివృద్ధి పనులు చేపట్టాలి
ప్రతి మండల కేంద్రంలో జూనియర్ కళాశాల చండూరులో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి
ఉదయ సముద్రం పూర్తి చేస్తే మునుగోడు మండలానికి 50,000 ఎకరాలకు నీరు వస్తుంది వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నా
అసంపూర్తిగా ఉన్న రోడ్లను అభివృద్ధి చేయాలి
మునుగోడు ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవిస్తున్నాం
కానీ ఆ తీర్పు రావడానికి మీరు చేసిన దౌర్జన్యాలను వ్యతిరేకిస్తున్నాం....
కెసిఆర్ పెద్ద దొంగ అన్ని అబద్ధాలు ఆడుతాడు
కేటీఆర్ అహంకారి
జగదీశ్వర్ రెడ్డి చేతగాని మంత్రి ఒక బానిస
గెలిచిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఒక దద్దమ్మ
*100% మళ్లీ ఇక్కడి నుంచే పోటీ చేస్తా...*
మునుగోడు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో తెలంగాణలో నే నెంబర్ వన్ గా చేసేంతవరకు ఇక్కడే ఉంటా...
గెలిచిన ఓడిన రాజగోపాల్ రెడ్డి ప్రతి ఇంట్లో కుటుంబ సభ్యుడు
మునుగోడు ప్రజలు టిఆర్ఎస్ గెలుపును గెలుపు కింద భావిస్త లేరు గెలిచినాయనను ఎమ్మెల్యేగా భావించడం లేదు
ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చేలా భారతీయ జనతా పార్టీ తరఫున మా ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుంది
కేటీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిందే
మీరు అభివృద్ధి చేయకపోతే మాత్రం మిమ్మల్ని మునుగోడు నియోజకవర్గంలో అడుగుపెట్టనీయం
కిందిస్థాయి పోలీసులు రాజగోపాల్ రెడ్డి గెలవాలని కోరుకున్నారు
రాబోయే రోజుల్లో భవిష్యత్తు మనదే
బిజెపి అధికారంలోకి వస్తుంది కార్యకర్తలు ఎవరు కూడా అధైర్య పడొద్దు
ఉమ్మడి నల్గొండ జిల్లాలో చీము నెత్తురు లేని బానిస బతుకులు బతుకుతున్న ఎమ్మెల్యేలు నన్ను ఓడ కొట్టడానికి ఇక్కడికి వచ్చారు
అవినీతి సొమ్ము, మద్యం, ప్రలోభాలు, ఒత్తిడి, బలవంతం... బల ప్రయోగంగా గెలిచిన గెలుపుగాని మీ గెలుపు కాదు
*బిజెపిని బలోపేతం చేయడానికి సూర్యాపేట నుంచి నా ప్రచారం స్టార్ట్ చేస్తా*
మీరు ఈసారి గెలిచింది నిజమైన గెలుపు కాదు.. మీరు 100 మంది నేను ఒక్కడిని
Comments
Post a Comment