*సర్వే ల్యాండ్ రికార్డ్స్ అధికారిని దుర్బాష లాడి, బెదిరించిన వ్యక్తి పై చర్యలు తీసుకోవాలి: ఉద్యోగ జె. ఏ.సి.డిమాండ్*.


 *సర్వే ల్యాండ్ రికార్డ్స్ అధికారిని దుర్బాష లాడి, బెదిరించిన వ్యక్తి పై చర్యలు తీసుకోవాలి: ఉద్యోగ జె. ఏ.సి.డిమాండ్*.              

  నల్గొండ,(గూఢచారి) నవంబర్ 23. సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏ డి.యం.శ్రీనివాసులు ను మంగళ వారం  దుర్భాష లాడి,దూషించిన  భాష పాక హరికృష్ణ వైఖరిని ఉద్యోగ జె. ఏ. సి.నాయకులు తీవ్రంగా ఖండించారు.మంగళవారం విధి నిర్వహణ లో ఉన్న సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏ.డి. ని కలెక్టర్ కార్యాలయం లో అధికారి ఛాంబర్ లో వివాద స్పద భూమిని తనకు అనుకూలంగా సర్వే చేయమని ఒత్తిడి చేస్తూ పెట్రోల్ బోసి తగల బెడతా అంటూ పరుష,అసభ్య పదజాలం తో దూషించి అవమాన పరిచి భయందోలనకు గురి చేసిన సంఘటన ను  టి.జి. ఓ.,టి.ఎన్.జి. ఓ ఉద్యోగ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ సంఘటనకు నిరసనగా జిల్లా కలెక్టర్ కార్యాలయం సంక్షేమ భవన్ లో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం కార్యాలయం లో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టి.జి. ఓ) అధ్యక్షులు ముజీ బుద్దిన్  అధ్యక్షతన సమావేశం జరిపి ఈ సంఘటన కు కారణమైన హరికృష్ణ అనే వ్యక్తి పై చర్య తీసుకోవాలని,సంఘటనని అందరూ ముక్తంఠంతో ఖండించారు.అదే విధంగా నిన్న భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో అటవీ రేంజ్ అధికారి శ్రీనివాస్ పై దాడి చేసి ఆయన మృతికి  కారణమైన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని,ఆయన మృతికి సంతాపం గా రెండు నిమిషాలు మౌనం పాటించారు.ఉద్యోగులు,అధికారుల పై దాడులు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని,ప్రజాస్వామ్య పద్దతి లో సమస్యలు పరిష్కరించేందుకు అంకిత భావం తో పని చేస్తున్న ఉద్యోగుల పై దాడులు చేయడం,బెదిరించడం వంటి సంఘటనలు పునరావృతం కాకుండా పకడ్బందీ గా చట్ట పర చర్యలు తీసుకోవాలని అన్నారు. అనంతరం టి.జి. ఓ.,టి.యన్.జి. వో ఉద్యోగ జె. ఏ.సి.నాయకులు  నల్ల బ్యాడ్జీ లు ధరించి సంక్షేమ భవన్ కలెక్టర్ కార్యాలయం లో నిరసన తెలుపుతూ నినాదాలు చేస్తూ ఉద్యోగులు,అధికారులను అసభ్య, పరుష పదజాలంతో దూషించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని జె. ఏ.సి.చైర్మన్,టి.యన్.జి. ఓ అధ్యక్షులు శ్రావణ్ కుమార్,జె. ఏ.సి.సెక్రటరీ జనరల్, టి.జి. ఓ అధ్యక్షులు ముజీబుద్దీన్ లు డిమాండ్ చేశారు.ఈ సంఘటనను జిల్లా కలెక్టర్,స్థానిక శాసన సభ్యులు దృష్టికి తీసుకు వచ్చినట్లు,వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసినట్లు,ఎఫ్. ఐ.అర్ నమోదు చేసినట్లు వారు  తెలిపారు.తర్వాత పోలీస్ స్టేషన్ లో సి. ఐ. గోపి ని కలిసి టి.జి. ఓ,టి..యన్.జి. ఓ నాయకులు ఈ సంఘటనకు కారణమైన వ్యక్తి పై చట్ట పరంగా చర్యలు  తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమం లో టి.జి. ఓ ఆసోసియెట్ అధ్యక్షుడు యం.శ్రీనివాసులు, ట్రెజరర్ యాకూబ్ నాయక్,ఉపాధ్యక్షులు పెద్ది శ్రీనివాస్,ఇస్మాయిల్, మంగ్యా నాయక్,జాయింట్ సెక్రటరీ డా.సందీప్,ఆర్గనైజింగ్ కార్యదర్శి అమరేందర్ గౌడ్,కార్యవర్గ సభ్యులు ఎస్.శ్రీనివాస్,మల్లేష్,సుమన్,  టి. యన్.జి. ఓ .ప్రధాన కార్యదర్శి కిరణ్,కార్యవర్గ సభ్యులు యం.జయ రావు,రాజు,లక్ష్మయ్య, జిల్లా నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు బిక్షం తదితరులు పాల్గొన్నారు

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్