అబ్బురపరిచేలా ఆహ్లాదం కలిగించేలా సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణం చేయాలి -నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
అబ్బురపరిచేలా ఆహ్లాదం కలిగించేలా సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణం చేయాలి -నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
*సాధ్యమైనంత త్వరగా శిల్పారామం పనులు ప్రారంభం*
*15 రోజుల్లో కళాభారతి డిపిఆర్ ను పూర్తి చేయాలి*
*నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి*
నల్గొండ,నవంబర్28... నల్గొండ పట్టణ శివారులోని పానగల్ ఉదయ సముద్రం అలుగు నుండి ఏర్పాటు చేయనున్న సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణాన్ని పట్టణ ప్రజలను ఆకట్టుకునేలా వారికి ఆహ్లాదం కలిగించేలా ఏర్పాటు చేయాలని నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఏజెన్సీ ప్రతినిధులకు, మున్సిపల్ అధికారులకు సూచించారు. సోమవారం ఆయన నల్గొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి శిల్పారామం, ప్రత్యేక అధికారి రిటైర్డ్ ఐఏఎస్ గావోజి కిషన్ రావు, మున్సిపల్ కమిషనర్ డాక్టర్ కె.వి. రమాణచారి లతో కలిసి శిల్పారామాన్ని కళాభారతిని సస్పెన్షన్ బ్రిడ్జిని సంబంధించిన కార్యక్రమాలను పరిశీలించి వాటిపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్లగొండ పట్టణం తెలంగాణ రాష్ట్రానికి తల మానికంగా నిలబడపోతుందని అన్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ సహకారంతో వందలాది కోట్ల రూపాయలతో పట్టణం లో పలు రకాల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు. అవే కాకుండా శిల్పారామం కళాభారతి వల్లభరావు చెరువును నెక్లెస్ రోడ్డుగా మార్చేందుకు తగిన ప్రతిపాదనలు కూడా సిద్ధం చేయడం జరుగుతుందని తెలిపారు. నల్గొండ పట్టణంలోని ఉదయ సముద్రం అలుగు సమీపము నుండి 350 మీటర్ల పొడవు రెండున్నర మీటర్ల వెడల్పుతో సస్పెన్షన్ బ్రిడ్జి ఏర్పాటు చేసేందుకు తగిన ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ఈ నిర్మాణం సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకు కావలసిన అన్ని రకాల అనుమతులను తీసుకోవాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. శిల్పారామం పనులను సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలని జన్సిస్ కన్సల్టెన్సీ ప్రతినిధులను సూచించారు. ఇందుకు కావలసిన అన్ని రకాల వనరులను కూడా ఏర్పాటు చేసుకోవాలని కోరారు. కళాభారతి నిర్మాణానికి సంబంధించి రోడ్డు నుండి ఎంతవరకు అవసరం ఉంటుంది, భూమి ఎంత కావాలి, సర్కిల్లో ఎంత భూమి అవసరం ఉంటుంది అనే పూర్తి వివరాలను అందజేసి 15 రోజుల్లోగా డీపీఆర్ ఇస్తే త్వరగా టెండర్ ప్రక్రియలోకి వెళ్లేందుకు వీలుంటుందని ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కోరారు. వల్లభరావు కట్టమీద నెక్లెస్ రోడ్డును మరిపించేలా నల్గొండ పట్టణంలో మరో నెక్లెస్ రోడ్ ను ఏర్పాటు చేయాలని ఇందుకు అనుగుణంగా తగిన ప్రతిపాదనలు తయారు చేయాలని జన్సిస్ కన్సల్టెన్సీ ప్రతినిధులను సంబంధిత కాంట్రాక్టర్లను సూచించారు. అనంతరం పలు రకాల అభివృద్ధి పనులను కూడా సమీక్షించారు. ఆయన వెంట..నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, కమిషనర్ కె.వి రమణ చారి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్,కౌన్సిలర్, ఆలకుంట్ల మోహన్ బాబు, కో ఆప్షన్ సభ్యులు కొండూరు సత్యనారాయణ, నాయకులు మైనం శ్రీనివాస్,పట్టణ పార్టీ అధికార ప్రతినిధి సందినేని జనార్దన్ రావు, మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాసరెడ్డి,నాయకులు సూర మహేష్, గంజి రాజేందర్,దొడ్డి రమేష్ పొనుగోటి జనార్దన్ రావు, పిఎసిఎస్ వైస్ ఛైర్మన్ తవిటి కృష్ణ,కొత్తపల్లి పిచ్చయ్య,శరత్, మర్రి శ్రీను తదితరులు ఉన్నారు
Comments
Post a Comment