ఒకే రోజు రెండు ఏసీబీ రైడ్స్


 


ఒకే రోజు రెండు ఏసీబీ రైడ్స్

*18  వేలు లంచము  తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ ,  అటెండర్‌*
*20 వేలు లంచం తీసుకుంటు ఎసిబి కి పట్టుబడ్డ విద్యుత్ ఏ ఈ మరియు బిల్ కలక్టర్*
 
జనగామ : విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి వారిని సక్రమ మార్గంలో నడిపించే గురువులు అవినీతికి పాల్పడి రెడ్‌ హ్యండెడ్‌గా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. జనగామ జిల్లా నర్మెట్ట మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలకు చెందిన ప్రిన్సిపాల్ అనురాధ, లెక్చరర్ మల్లేష్ అటెండర్‌ రేణుక వద్ద రూ. 18 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వేతనాలకు సంబంధించిన బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో వాటి చెల్లింపునకు బాధితురాలి నుంచి డబ్బులు డిమాండ్‌ చేశారు. దీంతో ఆమె ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. బుధవారం సాయంత్రం  పాఠశాలలో ప్రిన్సిపాల్‌, లెక్చరర్‌కు ఆమె డబ్బులు అందజేస్తుండగా పట్టుకున్నారు. వారిద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



**************************

హైదరాబాద్ విద్యుత్ శాఖలో ఏసీబీ రైడ్స్
యాకత్ పురా సెక్షన్ విద్యుత్ ఏ ఈ రాజ శేఖర్ తోపాటు బిల్ కలెక్టర్ మొహ్మద్ జమాల్  లు రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.    కరెంటు బిల్లులు పాత
బకాయిలు రద్దు చేయడానికి యాకుత్‌పురా చెందిన ఉస్మాన్ షరీఫ్  నుండి లంచం డిమాండ్ చేసి లంచం తీసుకుంటుండగా  ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
తీసుకున్న లంచం డబ్బును సీజ్ చేసి, లంచం తీసున్నట్లు నిర్ధారణ కావడంతో వెంటనే వారిని  అదుపులోకి తీసుకుని  ఎసిబి కోర్టు జడ్జి ముందు హాజరుపరిచారు.



Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్