లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి:* - *అదనపు కలెక్టర్ ఖుష్బు గుప్తా*
లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి:* - *అదనపు కలెక్టర్ ఖుష్బు గుప్తా*
నల్గొండ, డిసెంబర్ 08. ఈనెల 12న జిల్లా కేంద్రంలో ఒకే రోజు లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖుష్బు గుప్తా సూచించారు. గురువారం నల్లగొండ మున్సిఫల్ కౌన్సిల్ హాల్లో మున్సిపల్ కమిషనర్ డా.కె.వి. రమణా చారి తో కలిసి మొక్కలు నాటే కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా అమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరిత హారం కార్యక్రమంలో భాగంగా ఈనెల 12న జిల్లా కేంద్రంలో లక్ష మొక్కలు నాటేందుకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఎలాంటి పోరపాట్లు లేకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. విద్యార్థులు ఎక్కువగా పాల్గొంటున్నందున తగిన ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని పర్యవేక్షించాల్సిన బాధ్యత మున్సిపాలిటి అదికారులదేనని అన్నారు. చనిపోయిన వాటి స్థానంలో కొత్తవి నాటడం, వాటని నీరు అందించడం కూడా మున్సిపాలిటి అధికారులు చూడాలన్నారు.అనంతరం అధికారులతో కలిసి ఎస్.ఎల్.బి.సి., దేవర కొండ రహదారి,ఎస్.టి.పి తదితర మొక్కలు నాటే ప్రాంతాలను అధికారులతో కలిసి పరిశీలించి సూచనలు చేశారు. ఈసమావేశంలో జిల్లా అధికారులు జడ్.పి. సి. ఈ. ఓ ప్రేమ్ కరణ్ రెడ్డి,షెడ్యూల్డ్ కులాల అభివృద్ది అధికారిణి సల్మాభాను,వెనుక బడిన తరగతుల అభివృద్ది అధికారిణి పుష్పలత,మైనార్టీ సంక్షేమ అధికారి బాల కృష్ణ, ఉద్యాన శాఖ అధికారిని సంగీతలక్ష్మీ తదితరులు ఉన్నారు.
నల్గొండ డీపీఆర్వో సౌజన్యంతో
Comments
Post a Comment