ఆర్య వైశ్యులు వ్యాపారం లోనే కాదు, సామాజిక సేవలోను ముందుంటారు - రాష్ట్ర టూరిజం చైర్మన్ ఉప్పల శ్రీనివాస్
ఆర్య వైశ్యులు వ్యాపారం చేయడంలో మాత్రమే కాదు, సామాజిక సేవలోను ముందుంటారు - రాష్ట్ర టూరిజం చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త
హైదరాబాద్:
ఆర్య వైశ్యులు వ్యాపారం చేయడంలో మాత్రమే కాదు, సామాజిక సేవలోను ముందుంటారని రాష్ట్ర టూరిజం చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త అన్నారు. హైదరాబాద్ లోని సికింద్రాబాద్ మినర్వా గ్రాండ్ హోటల్ లో జరిగిన వాసవీ క్లబ్స్ ఇంటర్నేషనల్ GATE & RCTS - 2022, గవర్నర్స్ అకాడమీ ఆఫ్ ట్రైనింగ్ ఫర్ ఎంపవర్‌మెంట్ & రీజియన్ చైర్‌పర్సన్ ట్రైనింగ్ సెమినార్ లో ముఖ్య అతిథిగా రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఆర్య వైశ్యులు వ్యాపారం చేయడంలో మాత్రమే కాదు, సామాజిక సేవలోను ముందుంటారని,ఇకముందు కూడా ఉండాలని అన్నారు. IVF ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు. ప్రిలిమినరీ పాస్ అయి, IAS చదువుతున్న 23 మందికి ఒక లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగిందని అన్నారు. రాబోయే రోజుల్లో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ మరియు వాసవీ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో సంయుక్తంగా మహిళలకు 102 కుట్టు మిషన్లు అందించడ జరుగుతుంది అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో 24 గంటల కరెంట్ ఇచ్చి పవర్ హాలిడేస్ కరెంట్ కోతలు లేకుండా చేశారని, రాష్ట్రంలో వ్యాపారులు అందరూ ప్రశాంతంగా వ్యాపారం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇన్ని సంవత్సరాల కాలంలో ఆర్యవైశ్యులను గుర్తించి, వారికి ప్రాముఖ్యత ఇచ్చింది. న్యాయం చేసింది, సీఎం కేసీఆర్ ఒక్కరు మాత్రమేననీ, ఉప్పల్ భాగాయత్ లో 5 ఎకరాల భూమిని కూడా ఇచ్చారని, రాజకీయంగా కూడా ఆర్యవైశ్యుల కు పదవులు ఇచ్చారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం పరిధిలోని 33 జిల్లాల్లో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయనీ, అన్ని ప్రాంతాలలో,అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని, మన రాష్ట్రంలో బంగారు తెలంగాణ కు బాటలు వేస్తూ..ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని అన్నారు. అన్ని కులాలకు ఇచ్చినట్టే ఆర్యవైశ్య పేదలకు కూడా అన్ని పథకాలు అమలు చేయడం జరుగుతుంది అన్నారు. ఆర్యవైశ్యులు వ్యాపారం చేయడంలో మాత్రమే కాదు, సామాజిక సేవలోను ముందుంటారని అన్నారు.ఎటువంటి పదవులు ఇచ్చినా నీతి నిజాయితీ తో కష్టపడి పని చేస్తారని అన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా, సిద్దిపేట ముద్దుబిడ్డ, ముఖ్యమంత్రి కేసీఆర్ కోటి రూపాయలు ఇచ్చి అయినా కోమట్లతో సోపతి చేయమని అన్నారని గుర్తుచేశారు.అన్ని కులాలు,మతాల వారితో సత్సంబంధాలు కలిగి ఉండే అవకాశం ఒక్క ఆర్యవైశ్య కులానికి మాత్రమే ఉంటుంది అన్నారు. రైస్ మిల్లులు, కిరాణం, వస్త్ర, వ్యాపార దుకాణాలు తదితర వ్యాపారాలు, పరిశ్రమలు, పలు రకాల వ్యాపారం చేయడంలో ఆర్యవైశ్య సోదరులు ముందు ఉంటారను, మరియు ఊర్లో బడి, గుడి, అన్నదానం, ఎటువంటి సామాజిక సేవా కార్యక్రమాలు అయినా చేయడానికి ఆర్యవైశ్య సోదరులు ముందుంటారనీ. మొన్న కరోన సమయంలో కూడా ఆర్యవైశ్యులు బయటకు వచ్చి పేదలకు సాయం అందించడం జరిగింది. సామాజిక సేవా కార్యక్రమం ఏదైనా కావచ్చు ఆర్యవైశ్యులు ముందు ఉంటారని అన్నారు. IVF ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా అన్నదానం, సత్రం కావచ్చు బడి, గుడి నిర్మాణంలో..ఏదైనా కావచ్చు నా వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది అన్నారు.
*ఈ కార్యక్రమంలో..* ప్రిసైడింగ్ ఆఫీసర్ Vn .డైమండ్ స్టార్ KCGF పాట సుదర్శన్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్-2022, Vn .డైమండ్ KCGF ఎలక్షన్ ఆఫీసర్ & ICON అడ్వైజర్ యాద నాగేశ్వర్ రావు, కన్వెన్షన్ చైర్మన్ Vn .డైమండ్ KCGF అయిత రాములు, అగిరి వెంకటేస్వర్ ఇరుకుళ్ల రామకృష్ణ, మరియు ఇతర ఆర్యవైశ్య ప్రముఖులు, ఇంటర్నేషనల్ వాసవి క్లబ్స్ గవర్నర్స్ ,సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment