అసభ్య పదజాలంతో దూషించిందని చిట్టా ప్రసాద్ ఫిర్యాదు తో మంచి ప్రసన్న అలియాస్ సత్యవతి ప్రసన్న పై కేసు నమోదు
అసభ్య పదజాలంతో దూషించిందని చిట్టా ప్రసాద్ ఫిర్యాదు తో మంచి ప్రసన్న అలియాస్ సత్యవతి ప్రసన్న పై కేసు నమోదు
హైదరాబాద్: ( గూఢచారి) మంచి ప్రసన్న అలియాస్ సత్యవతి ప్రసన్న అసభ్య పదజాలంతో దూషించిందని చిట్టా ప్రసాద్ ఫిర్యాదు చేయడం తో ఐపిసి 504, 506 సెక్షన్ ల
ప్రకారం సనత్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. నేను కలం కౌంటర్ తెలుగు దినపత్రిక కు హైదరాబాద్ రిపోర్టర్ గా పని చేస్తున్నానని. నేను ఒక పేపరులో మరియు వాట్సాప్ లో లో వచ్చిన పోస్టును నేను తిరిగి పోస్టు చేశానని, అందుకు నేను తప్పు వార్త ప్రచురించాను అని ఒక మహిళ మంచి ప్రసన్న అలియాస్ సత్యవతి ప్రసన్న తనకు ఇష్టం వచ్చినట్లు బూతు మాటలతో చాలా అసభ్యకరంగా మాటల తో ఫోన్ ద్వారా దూషించిందని, దీనితో నా మనస్సు తీవ్ర క్షోభ ను అనుభవించే విధంగా, సమాజంలో నాకు ఉన్న పరువుప్రతిష్టలను మంట కలిపేలా బెదిరిస్తూ మాట్లాడిందని. మరియు వాట్సాప్ లో తెలుగులో సందేశంను కూడా పంపిందని చిట్టా ప్రసాద్ ఫిర్యాదులో పేర్కొన్నారు. . నాకు కలిగిన మానసిక క్షోభకి కారణమై న వారిపై చర్య తీసుకోవలసిందిగా, అలాగే ఒక పత్రికా రిపోర్టర్ను ఇష్టం వచ్చినట్లు అసభ్యంగా బూతు మాటలు మాట్లాడటం చట్టపరమైన నేరమని, ఈ నేరానికి తగిన చర్యను తీసుకోవలసినదిగా, మరియు ఆమె మాట్లాడిన మాటలు నా ప్రాణహాని కలిగించేవిగా ఉన్నందున నాకు తగిన రక్షణ కల్పించవలసినదిగా పోలీసు శాఖ వారిని, తగిన న్యాయం చేయాలని న్యాయశాఖ వారిని వినమ్రుపూర్వకంగా నమస్కరించి కోరుకుంటున్నానని ఆయన ఫిర్యాదులో తెలిపారు. ఆమె మాట్లాడిన మెమోరి కార్డును కూడా సనత్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుతోపాటు అందజేయడం తో వారు ఎఫ్ ఐ ఆర్ ను నమోదు చేసి కేసు రిజిస్టర్ చేశారు.
Comments
Post a Comment