ఈ రాష్ట్రాన్ని సక్కదిద్దే సత్తా లేని కేసీఆర్ దేశాన్ని బాగు చేస్తా అంటుండు - ఈటెల


 

ఈ రాష్ట్రాన్ని సక్కదిద్దే సత్తా లేని కేసీఆర్  దేశాన్ని బాగు చేస్తా అంటుండు - ఈటెల


నల్గొండ నియోజకవర్గం లో  *ప్రజాగోస - బీజేపీ భరోసాయాత్ర* బైక్ ర్యాలీ కార్యక్రమానికి  ముఖ్య అతిథిగా హాజరైన  బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యులు ఈటల రాజేందర్..ఈటెల రాజేందర్ కి ఘన స్వాగతం పలికిన బిజెపి శ్రేణులు...


పానగల్లు లోని పచ్చల సోమేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఈటెల...


అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాధగోని శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో *ప్రజా గోస బీజేపీ భరోసా* యాత్రలో భాగంగా నియోజకవర్గ వ్యాప్తంగా నిర్వహించే బైక్ ర్యాలీ ప్రారంభిచిన ఈటెల రాజేందర్...









*ఈటెల కామెంట్స్....*


ఆయన మాటల్లో

కేసీఆర్ ప్రభుత్వం 2018 ఎన్నికల సందర్భంగా అనేక హామీలు ఇచ్చి ఆ హామీలు నెరవేర్చకుండా ప్రతిపక్ష పార్టీల మీద దాడులు చేస్తూ సమస్యల పరిష్కారాన్ని పక్క దోవ పట్టిస్తుంది 


కేసీఆర్ ఎన్ని అబద్ధపు మాటలు చెప్పిన  మాటలు నమ్మే పరిస్థితి లేదు



ఈ రాష్ట్రాన్ని సక్కదిద్దే సత్తా ఆయనకు లేదు గాని దేశాన్ని బాగు చేస్తా అంటుండు


సురక్షితంగా సుభిక్షంగా పాలించే సత్తా భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉందని గుజరాత్ ఎన్నికలు మరోసారి నిరూపించాయి


తెలంగాణలో సమస్యల పరిష్కారం కావాలంటే ప్రత్యామ్నాయ పార్టీగా బిజెపికి మాత్రమే సాధ్యం


మునుగోడులో వందల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టిన.. వేలాది హామీలు ఇచ్చిన చావుతప్పి కన్నులోట్ట బోయి గెలిచామానిపించుకున్నారు...


కానీ అక్కడ మాత్రం ధర్మమే గెలిచింది రాజగోపాల్ రెడ్డి మాత్రమే గెలిచారు


తెలంగాణ రాష్ట్రంలో ఎగిరేది కాషాయ జెండా మాత్రమే


నల్గొండ జిల్లాలో గ్రామ గ్రామానికి ప్రజా భరోసా యాత్ర ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతాం 


కెసిఆర్ కి తెలంగాణ ప్రజానీకానికి బంధం దిగిపోయింది


తెలంగాణ పదాన్ని రద్దు చేసుకుని బిఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసుకుంటున్నారు


బిఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసినప్పుడే కెసిఆర్ కి తెలంగాణ కి బంధం తెగిపోయింది 


టిఆర్ఎస్ పార్టీ సజ్జల రామకృష్ణారెడ్డి కూడ బలుకు కొని   మళ్లీ తెలంగాణ సెంటిమెంటును లేవనెత్తుతున్నారు 


దీన్ని ఎవరూ నమ్మరు ప్రజలు తిప్పి కొడతారు


ఆ సెంటిమెంట్తో మళ్ళీ తెలంగాణ ప్రజల్ని కేసీఆర్ మోసం చేయలేడు

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్