భేరి నరేష్ ను వెంటనే శిక్షించాలి.

 

భేరి నరేష్ ను వెంటనే శిక్షించాలి...



అయ్యప్పస్వామి,  హిందూ దేవి దేవతలపై  అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేయాలని నల్లగొండ రామగిరి అయ్యప్ప దేవాలయం గురుస్వాములు నోముల శ్యామ్, కలేశన్ అశోక్ లు డిమాండ్ చేశారు.... నిన్న కొడంగల్ నియోజక వర్గంలోని రావులపల్లి గ్రామంలో జరిగిన నాస్తిక సభలో భేరి నరేష్ అనే వ్యక్తి మాట్లాడుతూ అయుప్ప స్వామి తో పాటు హిందూ దేవి దేవతలు అయిన శ్రీరాముడు, శివుడు తదితర దేవుల్లపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు... దీనికి నిరసనగా సోషల్ మీడియాలో వచ్చిన వీడియో క్లిప్పింగ్ లతో నల్లగొండ టూ టౌన్  పోలీస్ స్టేషన్ లో అయ్యప్ప భక్తులతో కలసి ఫిర్యాదు చేశారు... ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి ఫిర్యాదు స్వీకరించి విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు...  ఈ సందర్భంగా  అశోక్ గురుస్వామి మాట్లాడుతూ... నాస్తిక సభలో అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ సభలో హిందూ దేవీదేవతల గురించి అసభ్యంగా మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండించారు... హిందువుల మనోభావాలు దెబ్బ తీసేలా మాట్లాడిన నరేష్, తో పాటు ఆ సభ నిర్వాహకులపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు... భవిష్యత్తులో ఎవరు కూడా హిందూ దేవి దేవతల గురించి తప్పుగా మాట్లాడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.... ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి శివ, ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు...

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్