సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లో భారీ అవినీతి
సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లో భారీ అవినీతి
*నెల్లూరు జిల్లా :*
*రాష్ట్రంలో పెను సంచలనం..అవినీతి కేసులో సూళ్లూరుపేట ఆర్డీవో అరెస్ట్*
*సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లో జరిగిన భారీ అవినీతి కేసులో ప్రమేయం ఉన్నట్టు తేలడంతో సూళ్లూరుపేట ఆర్డీవో గా పని చేస్తున్న రోజ్మాండ్ ను అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు.*
*కోట్ల రూపాయల సివిల్ సప్లైస్ కుంభకోణం కేసులో రోజ్మండ్ కోట్ల రూపాయలు వెనకేసుకున్నట్టు గుర్తించిన ఏసీబీ అధికారులు.*
*తవ్వే కొద్ది బయటపడుతున్న భారీ తిమింగలాలు.*
*అంతులేని అవినీతి కేసును కొలిక్కితేస్తున్న ఏసీబీ.*
*ప్రధాన నిందితుడు శివకుమార్ ప్రియురాలికి రెండు కేజీ బంగారం ఇచ్చినట్టు, రోజమండ్ కుటుంబానికి సంబంధించి ఆమె కుటుంబంలో జరిగిన ఒక వివాహానికి రెండు కోట్ల రూపాయల వరకు ఇచ్చినట్లు కూడా ఏసీబీ అధికారులు గుర్తించినట్టు సమాచారం*
ఉమ్మడి నెల్లూరు జిల్లా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లో గతంలో ఎండిగా పనిచేసి ,ప్రస్తుతం సూళ్లూరుపేట ఆర్డీవో గా పని చేస్తున్న రోజ్మండ్ కూడా అవినీతికి పాల్పడినట్లు పూర్తి ఆధారాలు దొరకడంతో ఆర్డీఓ గా పనిచేస్తున్న ఈమె అరెస్టుకు రాష్ట్ర సిఎస్ పర్మిషన్ కోరిన ఏసీబీ అధికారులు అనుమతులు రాగానే అదుపులోకి తీసుకుని కోర్టుకు హాజరు పరచడంతో రోజ్మండ్ కు జనవరి 4వ తారీఖు వరకు రిమాండ్ విధించినట్టు సమాచారం... ఇప్పటికే ఈ కేసుతో సంబంధం ఉన్న అనేక మందిని అదుపులోకి తీసుకుని విచారించిన ఏసీబీ అధికారులు పలుచోట్ల వారికి సంబంధించిన ఆస్తులను గుర్తించి వాటిని సీజ్ చేస్తున్న క్రమంలో ఈరోజు RDO రోజ్మాండ్ అరెస్టుతో కేసు కీలక దశకు చేరుకున్నట్టు ఈమెకు సంబంధించిన ఆస్తులు కూడా త్వరలోనే గుర్తించి ప్రభుత్వం స్వాధీనం చేసుకునే దిశగా చర్యలు చేపడుతున్నట్టు సమాచారం.
.
Comments
Post a Comment