బియ్యం అప్పగించిన మిల్లర్ల కు తక్కువ? డిఫాల్టర్ మిల్లులకు ఎక్కువ?
బియ్యం అప్పగించిన మిల్లర్ల కు తక్కువ?
డిఫాల్టర్ మిల్లులకు ఎక్కువ?
సూర్యాపేట కస్టమ్ మిల్లింగ్ లో డిఫాల్టర్ అయిన రైస్ మిల్లర్ల భాగోతం పై గత నెల రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. కొన్ని మిల్లున్లు తనిఖీ చేసి అధికారులు సీజ్ చేశారని అందులో ధాన్యం నిలువలు లేవని వార్తలు గుప్పుమన్నాయి. బియ్యం ప్రభుత్వానికి అప్పగించిన మిల్లర్ల కు తక్కువ అలాట్ మెంట్ చేసి డిఫాల్టర్లు అయిన వారికి ఎక్కువ కేటాయింపులు జగతున్నాయని మిల్లర్లు లాభోదిబోమంటూన్నారు. ఈ విషయాన్ని గూఢచారి గతం లో డిఫాల్టర్లకే ఎక్కువ ధాన్యం కేటాయింపు లంటూ వార్త ప్రచురించింది. గూఢచారి వార్తను నిజం చేస్తూ డిఫాల్టర్ల అయిన మిల్లర్లు కు ఎక్కువ కేటాయింపులకు అధికారులు పూనుకున్నారని సమాచారం. గతం లో బియ్యం ప్రభుత్వానికి ఇవ్వలేదని సూర్యాపేట జిల్లా లోని 5 మిల్లులకు కేటాయింపులు జరపలేదు. మళ్ళీ అధికారులు ప్యాడి పర్చేసింగ్ సెంటర్ లకు ధాన్యం ఎక్కువ వస్తుందని సాకుతో ఒక వైపు ఆ 5 మిల్లులకు కేటాయింపు లు రంగం సిద్ధం చేశారని భోగట్టా. ఇంకో వైపు బహిరంగం మార్కెట్ లో మద్దతు ధర కన్న ఎక్కవ ఉండడం తో రైతులు బహిరంగ మార్కెట్ లో అమ్ముకుంటున్నారని పేపర్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు.
మరి ఈ కేటాయిపులు వెనుక ఉన్న గుడుపుటాని ఏమిట ని? ఏమైనా లావాదేవీలు జరిగి ఈ కేటాయింపులతో లాభం ఎవరి ఎవరికి జరుగుతుందని కొందరు అంచనాలు వేస్తున్నరు. నిజాయితీగా ఉన్న మిల్లర్లకు కేటాయింపులు చేసి న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు. ఈ విషయం వివరాలకు కొరకు సివిల్ సప్లయి అధికారులను సంప్రదించగా నో రెస్పాన్స్.
Comments
Post a Comment