ఫోర్జరీ డాకుమెంట్స్ తో డ్రగ్ లైసెన్స్?
ఫోర్జరీ డాకుమెంట్స్ తో డ్రగ్ లైసెన్స్?
నల్గొండ: నల్గొండ బస్టాండ్ దగ్గర లో ఒక మెడికల్ షాప్ యజమాని ఫోర్జరీ డాకుమెంట్ తో డ్రగ్ లైసెన్స్ పొందినట్లు సమాచారం. సెలూన్ కొరకు షాప్ ను లీజ్ కు తీసుకుని లీజ్ డాకుమెంట్స్ లో సెలూన్ అనే దగ్గర మెడికల్ షాప్ కొరకు అని ఫోర్జరీ చేసి డ్రగ్ లైసెన్స్ పొందినట్లు సమాచారం. ఈ మెడికల్ షాప్ సంస్థలో ఉన్న ఇద్దరు పార్టనర్స్ మధ్య విభేదాలు రావడం తో ఈ విషయం వెలుగు లోకి వచ్చింది. దీనితో అధికారులు డ్రగ్ లైసెన్స్ ను రద్దు చేసినట్లు మరియు లీజ్ ఇచ్చిన ఆర్టీసీ షాప్ లీజ్ ను రద్దుచేసిందని తెలియ వచ్చింది.
ఇంత జరిగినా మళ్ళీ ఆ ఫోర్జరీ చేసిన వారు అధికారులను ప్రసన్నం చేసుకొని షాప్ లీజ్ తీసుకొని మరియు డ్రగ్ లైసెన్స్ పొందెదుకు పైరవీలు చేస్తున్నట్లు వార్తలు వినవస్తున్నాయి.
ఈ విషయం పై వివరణ కొరకు డ్రగ్ ఇన్స్పెక్టర్ కు ఫోన్ చేయగా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. మేసెజ్ చేస్తే దానికి బదులు ఇవ్వలేదు.
Comments
Post a Comment