ఎసిబి చిక్కిన మత్స్యశాఖ ఉద్యోగి
ఎసిబి చిక్కిన మత్స్యశాఖ ఉద్యోగి
ఖమ్మం:
వైరా మత్స్య శాఖలోపనిచేస్తున్న ఓ ఉద్యోగిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఫోన్ పే ద్వారా 50,000 లంచం తీసుకున్న కేసులో వైరా మత్స్య శాఖ కార్యాలయంలో కాంట్రాక్ట్ ఫిషరీస్ అసిస్టెంట్గాపని చేస్తున్న మార్కాపురం మురళిని ఏసీబీ అధికారులు అరెస్ట్చేసి శనివారం హైదరాబాద్ నాంపల్లి ఎసిబి కోర్టులో రిమాండ్ చేశారు. వైరా రిజర్వాయర్లో చేపల వేట కోసం లక్షరూపాయలు లంచాన్ని మురళి డిమాండ్ చేశాడని, అయితే తాను ఫోనే ద్వారా రూ.50 వేలను జులై 21న మురళికి చె ల్లించినట్లు పారిశ్రామిక శాఖ సహకార సంఘం అధ్యక్షుడు ఎస్.కె. రహీం జిల్లా కలెక్టర్ వీపీ గౌతంకు, ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఏసీబీ డిఎస్పి సూర్యనారాయణ ఆధ్వర్యంలో సిఐలు శ్రీనివాస్, బాలకృష్ణ, సిబ్బందిశక్రవారం వైరా మస్త్యశాఖ కార్యాలయంతో పాటు, జిల్లా మస్త్య శాఖ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. వైరా మత్స్యశాఖలో అన్ని రికార్డులను తనిఖీ చేసి వాటి స్వాధీనం చేసుకున్నారు. జులై 1 నుంచి చేపల వేట నిలిపివేశారు. అయితే ఈ సమయంలో చేపల వేట కొనసాగించేందుకు గాను లక్ష రూపాయలు ఇవ్వాలని తాను అధికారులతో మాట్లాడి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తానని మురళి చెప్పడంతో తాను రు. 50,000 ఫోన్ పే ద్వారా చెల్లించినట్లు అధ్యక్షుడు రహీం ఫిర్యాదు చేయడంతో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు.శుక్రవారం రాత్రి వరకు సోదాలు చేసిన అధికారులు మురళినీఅదుపులోకి తీసుకున్నారు. శనివారం అరెస్టు చేసి ఏసీబీ కోర్టులోరిమాండ్ చేశారు. వైరా మత్స్యశాఖ అధికారి బుజ్జిబాబు పాత్రపై కూడా విచారణ నిర్వహిస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.
Comments
Post a Comment