విద్య,రాజకీయ రంగాల్లో వైశ్యులు మరింత రాణించాలి : హరినాథ్ గుప్త బెలిదె


 

విద్య,రాజకీయ రంగాల్లో వైశ్యులు మరింత రాణించాలి : హరినాథ్ గుప్త బెలిదె


హైదరాబాద్ : వ్యాపారంలో తిరుగులేని ఆధిక్యతను సాధించిన వైశ్యులు, విద్య, రాజకీయ రంగాల్లో మరింత రాణించాల్సిన అవసరం ఉందని, వాసవీ పొలిటికల్ ఫోరం చైర్మన్ హరినాథ్ గుప్త బెలిదె పేర్కొన్నారు. నేరేడ్ మెట్ మల్కాజ్ గిరి లోని శ్రీ వాసవీ ఆర్యవైశ్య సేవా సమితి ఆధ్వర్యంలో రూపొందించిన 2023 ఆంగ్ల సంవత్సర క్యాలెండర్ ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నేరేడ్ మెట్ లోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో, సేవా సమితి అధ్యక్షులు పోకల శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో హరినాథ్ గుప్త మాట్లాడుతూ, వ్యాపార రంగంలో వైశ్యులకు సాటి ఎవరూ లేరన్నారు. అలాగే విద్య, రాజకీయ రంగాల్లో వేగవంతమైన అభివృద్ధి సాధించాల్సిన అవసరం చాలా ఉందన్నారు. సమాజంలోని నూతన ఆవిష్కరణలను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవడానికి ఉన్నత విద్య చాలా అవసరమన్నారు. అలాగే సమాజ శ్రేయస్సును ఆశించే వైశ్య సామాజిక వర్గం, రాజకీయంగా అగ్రస్థానంలో ఉంటే సమాజంలోని అన్ని వర్గాలు అభ్యున్నతిని సాధిస్తాయన్నారు. మల్కాజ్ గిరి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు దూబగుంట అశోక్, శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయ చైర్మన్ కాసం వెంకట హరి మాట్లాడుతూ, వైశ్యుల్లో ఐక్యత పెరగాలన్నారు. సామూహిక ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణ వల్ల అది కొంతమేరకు సాధ్యమవుతుందన్నారు. ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న సేవా సమితిని వారు అభినందించారు. అధ్యక్షులు పోకల శ్రీనివాస్ మాట్లాడుతూ, తాను చేపట్టిన అన్ని సేవా కార్యక్రమాలకు సహకరిస్తున్న సంఘ సభ్యులకు, దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.

  ఈ కార్యక్రమంలో సమితి సలహాదారులు దేప వీరేశం గుప్త, చక్రపాణి, తాటిపల్లి శ్రీనివాసరావు, కే. ఆనంద్, పుండరీకం, లక్ష్మీనారాయణ, హనుమంతరావు, ఆలయ ప్రధాన కార్యదర్శి సంతోష్ కుమార్, కోశాధికారి శ్రీనివాస్, సామాజిక కార్యకర్త జైని రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్