దళితుడు పరుశురాములపై చెప్పుతో దాడి చేసిన అగ్రకుల సర్పంచ్ సరితా రెడ్డిని బర్తరఫ్ చేయాలి - కట్టెల శివకుమార్
దళితుడు పరుశురాములపై చెప్పుతో దాడి చేసిన అగ్రకుల సర్పంచ్ సరితా రెడ్డిని బర్తరఫ్ చేయాలి - కట్టెల శివకుమార్
నల్గొండ : దళితుడు దివ్యాంగుడు వరకల పరుశురాములపై చెప్పుతో దాడి చేసిన అగ్రకుల సర్పంచ్ సరితా రెడ్డిని బర్తరఫ్ చేయాలని ఎస్సీ ఎస్టీ విద్యార్థి విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ డిమాండ్ చేశారు.
నల్గొండ జిల్లా ఆర్ అండ్ బిగ్ గెస్ట్ హౌస్ నందు నిర్వహించిన ప్రెస్ మీట్ ఆయన మాట్లాడుతూ నార్కట్పల్లి మండలం బాజకుంట గ్రామానికి చెందిన దళితుడు వికలాంగుడు వరకాల పరశురాములపై చెప్పుతో ఆ గ్రామ సర్పంచ్ సరితా రెడ్డి అగ్రకుల దురఅహంకారంతో చెప్పుతో దాడి చేయడం అమానుషమని దీని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. తక్షణమే అమె ఫైవ్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని సర్పంచ్ పదవి నుండి భర్తరఫ్ చేయాలని ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న ఇంకా దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయని, ఈ దాడి యావత్ దళిత జాతిని అవమానపరిచే విధంగా ఉందని అన్నారు. సరితా రెడ్డి సర్పంచ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కఠిన చర్యలు తీసుకొని ఎడల అనేక ఉద్యమాలు వరకాల పరశురాముకు అండగా ఉండి ఆయనకు న్యాయం జరిగేంత వరకు పోరాడుతామని ఈ సందర్భంగా తెలియజేశారు.
Comments
Post a Comment